వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 15 లక్షల జీతాన్ని వదిలి టీ స్టాల్ పెట్టిన మాజీ టెక్కీలు, ఎందుకంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఫూణె: లక్షలాది రూపాయాల ఉద్యోగాలను వదిలేసి 'టీ 'స్టాల్‌ను ఏర్పాటు చేసుకొన్నారు. ప్రస్తుతం నెలకు రూ.5 లక్షలను ఈ దంపతులు సంపాదిస్తున్నారు. త్వరలోనే తమ వ్యాపారాన్ని విస్తరించనున్నట్టు వారు ప్రకటించారు.

మహారాష్ట్రలోని పూణెకు చెందిన టెక్కీ దంపతులు నెలకు రూ. 15 లక్షలను సంపాదించేవారు. అయితే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేయడం వల్ల వచ్చే ఆదాయం కంటే తమకు ఇష్టమైన పని చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. దీంతో తాము చేసే ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు.

Couple gives up engineering careers to sell tea

మాజీ టెక్కీ దంపతులు నితిన్ బయానీ, పూజలు తమ ఉద్యోగాలను మానేశారు. పూణేలోని ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో వీరిద్దరూ పనిచేసేవారు. నెలకు రూ.15 లక్షలు సంపాదించినా వారికి తృప్తి కలగలేదు.

వీరిద్దరికి ఇష్టమైన టీ వ్యాపారం చేయాలని భావించారు. ఈ మేరకు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశార. 'చాయ్ విల్లా రిఫ్రెష్ యువర్ సెల్ప్' పేరుతో టీ స్టాల్‌ను ప్రారంభించారు. నాగ్‌పూర్ సీఏ రోడ్డులో ఐదు మాసాల క్రితం ఈ టీ స్టాల్ ప్రారంభించారు. 15 రకాల ప్లేవర్లతో టీ, కాఫీలు అందుబాటులోకి తీసుకొచ్చారు. టీ, కాఫీతో పాటు పలు రకాల స్నాక్స్‌ను కూడ ఈ దంపతులు అందుబాటులోకి తీసుకొచ్చారు.

వాట్సాఫ్, జొమాట్లో ఆర్డర్లిచ్చినా వారి ఇంటికి నేరుగా టీ, కాఫీ, స్నాక్స్‌ డోర్ డెలివరీ చేస్తారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా తామిద్దరం ప్రఖ్యాత కంపెనీల్లో పనిచేసి నెలకు లక్షలు సంపాదించిన తృప్తి లేకపోవడంతో చాయ్ విల్లాను ప్రారంభించినట్టు నితిన్ బయానీ చెప్పారు.సోషల్ మీడియా ద్వారా తమ వ్యాపారాన్ని విస్తరించుకొంటున్నామని చెప్పారు. మరో వైపు మరికొన్ని బ్రాంచీలు ఏర్పాటు చేయనున్నట్టు కూడ ఆయన చెప్పారు.

English summary
The love for tea and aspiration to do something unique led two individuals to give up their careers as engineers and start a tea shop in Nagpur.Nitin Biyani and wife Pooja, who worked in Pune as Software Engineers and used to earn Rs 15 lakh every month, left their careers behind and opened 'Chai Villa, refresh yourself' on the CA Road five months ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X