వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్నేహం ముసుగులో మోసం : లక్షన్నర మాయం.. సెటిల్ చేస్తానంటూ ఆ భార్యభర్తలను ...!!

|
Google Oneindia TeluguNews

గురుగ్రామ్ : స్నేహితుడు .. హితుడు, సన్నిహితుడు.. కష్ట, సుఖాలను పంచుకొంటాం, ఒకరి బాధ మరొకరిగా అనుకొంటాం. ఫ్రెండ్ కోసం ఏ పనైనా చేసేందుకు వెనకాడబోం. కానీ ఇది కలియుగం. దోస్తులను కూడా నమ్మలేని పరిస్థితి. ఎక్కడ, ఏ స్నేహితుడితో శత్రుత్వం ఎలా ప్రారంభమవుతుందో తెలియదు. గురుగ్రామ్‌లో కూడా విక్రమ్ అనే సీనియర్ బీపీవో ఉద్యోగి పాలిట స్నేహితుడే కాలయముడయ్యాడు. విక్రమ్‌తో పాటు అతని భార్యను కూడా మట్టుబెట్టాడు. ఇంతకీ ఈ ఘాతుకానికి సదరు స్నేహితుడు ఎందుకు పాల్పడ్డాడో తెలుసా..?

ఇదీ నేపథ్యం ..

ఇదీ నేపథ్యం ..

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విక్రమ్ సింగ్, జ్యోతికి కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. వారికి ఏడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. వీరితో అతని తమ్ముడు శైలేంద్ర కూడా ఉంటున్నారు. ఇతను ఆటో నడుపుతూ ఉంటాడు. విక్రమ్ దంపతులు పొట్ట చేత పట్టుకొని వారు గురుగ్రామ్ వచ్చారు. గురుగ్రామ్ ఉద్యోగ విహర్‌లో గల ఫ్లాట్ రెండో అంతస్తులో ఉంటున్నారు. విక్రమ్ సీనియర్ బీపీవోగా పనిచేస్తున్నారు. అయితే నాలుగేళ్ల క్రితం తనికి అభినవ్ అగర్వాల్ అనే పరిచయమయ్యాడు. కొద్దికాలానికే ఇద్దరి మధ్య మంచి రపో ఏర్పడింది. ఇంకేమంది విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని అభినవ్ నమ్మబలికాడు. నిజమేనని విక్రమ్ విశ్వసించాడు. అయితే అందుకు రూ. లక్షన్నర ఖర్చవుతుందని చెప్పాడు. విదేశంలో కొలువు కాబట్టి ఖర్చులుంటాయని భావించి .. అంతమొత్తాన్ని విక్రమ్ ఇచ్చేశాడు. కానీ ఉద్యోగం మాట దేవుడు ఏరుగు ... తన కంటికి కనిపించకుండా పోయాడు అభినవ్.

గుండెపోటుతోనే తబ్రేజ్ అన్సారీ మృతి..!! కానీ పుర్రె ఫ్రాక్చర్, ఇతర గాయాలతోనే స్ట్రోక్గుండెపోటుతోనే తబ్రేజ్ అన్సారీ మృతి..!! కానీ పుర్రె ఫ్రాక్చర్, ఇతర గాయాలతోనే స్ట్రోక్

ఇంటికి పిలిస్తే ..

ఇంటికి పిలిస్తే ..

రోజులు గడుస్తున్నాయి. ఉద్యోగం లేదు. దీంతో విక్రమ్‌కు కోపమొచ్చింది. తనకు ఉద్యోగం వద్దు అని .. తన డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరాడు. ఈ అంశంపై ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలోనే బుధవారం మాట్లాడుదామని అభినవ్ చెప్పాడు. దీంతో తన ఇంటికి ఆహ్వానించాడు విక్రమ్. ఇద్దరు కలిసి బంగ్లాపైన మందు కూడా తాగారు. భోజనం చేసి పడుకున్నారు. డ్రింక్ చేసే సమయంలో కూడా డబ్బులకు సంబంధించి డిస్కషన్ జరిగింది. అది మనసులో పెట్టుకున్న అభినవ్ .. ఏం ఏరుగనట్టు ఉన్నాడు. అయితే విక్రమ్ తమ్ముడు శైలేంద్ర ఇంటిలో లేకపోవడం .. వారి పాలిట శాపంగా మారింది. అతను ఉంటే ప్రతిఘటించే వాడు.. అభినవ్ కూడా హత్య చేసే ధైర్యం చేసేవాడు కాదేమోనని పోలీసులు అంటున్నారు.

నిశీధి రాత్రిలో ..

నిశీధి రాత్రిలో ..

గురువారం తెల్లవారుజామున 3.30 అవుతుంది. ఆ రాత్రి నిద్రపోని అభినవ్ .. ఎలాగైనా విక్రమ్‌కు బుద్ధి చెప్పాలని భావించాడు. నిశీధి రాత్రి వేళ విక్రమ్‌ను కత్తితో పొడిచాడు. ఆయన అరవడంతో భార్య లేచింది. దీంతో ఆమెను పట్టుకొని పొట్టలో దాడిచేశాడు. మెట్లపైనుంచి కిందకి తోయడంతో ఇటు భార్య, అటు భర్త ... ఇద్దరూ చనిపోయారు. అయితే అభినవ్ చేస్తున్న నరమేధాన్ని పక్క బెడ్ రూంలో ఉన్న ఏడేళ్ల కుమారుడు చూస్తుండటం విశేషం. విక్రమ్, అతని భార్యను హతమార్చిన నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే మెయిన్ డోర్ లాక్ పడింది. ఇంతలో విక్రమ్, అతని భార్య అరవడంతో కింది నుంచి వచ్చి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అప్పటికే వారు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.

శైలేంద్ర లేకపోవడం ..

శైలేంద్ర లేకపోవడం ..

మరోవైపు విక్రమ్ దంపతులు హత్య పలు అనుమానాలకు తావిస్తోంది. హత్య జరిగిన సమయంలో అతని సోదరుడు శైలేంద్ర లేకపోవడంపై కూడా దృష్టిసారించామని పోలీసులు చెప్తున్నారు. ఈ కేసును నిశీతంగా దర్యాప్తు చేస్తున్నామని .. ఏ చిన్న ఆధారాన్ని వదలబోమని పేర్కొన్నారు.

English summary
A senior associate of a business process outsourcing (BPO) firm and his wife were found stabbed to death at their rented house in Dundahera, near Udyog Vihar, in the early hours of Thursday morning, the police said. The couple’s seven-year-old boy was in the room at the time of the murders and awoke to loud shrieks, but was unhurt, the police said. Police arrested a former colleague and a friend of the man, who had worked with him at the BPO four years ago and had visited them for dinner on Wednesday night. Police said prima facie, the motive for the crime is suspected to be a financial dispute. A case of murder was registered against the man, Abhinav Aggarwal, on the statement of the victims’ family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X