వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: దంపతులను హత్యచేసి ముక్కలుగా కోసి ఆపై....

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్ : పశ్చిమబెంగాల్‌లో దారుణం జరిగింది. భార్యాభర్తలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతి చెందిన వారిని ప్రదీప్ అల్పనా బిస్వాస్‌గా గుర్తించారు. సౌత్ 24 పరగనాస్ జిల్లాలోని ఓ ఇంట్లో ఈ మృతదేహాలు పడిఉన్నాయి. కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలు పడి ఉన్న ఇంటికి దంపతులు కేర్‌టేకర్‌లుగా పనిచేస్తున్నారు.ఇదిలా ఉంటే ఇంటి యజమానీ చాలా అరుదుగా వచ్చి వెళుతుంటారని అయితే మృతి చెందిన ప్రదీప్, అల్పనాలతో నిత్యం ఫోన్‌లో టచ్‌లో ఉంటారని పోలీసులు తెలిపారు. రెండ రోజులుగా ఫోన్ తీయకపోవడంతో అనుమానం వచ్చిన యజమాని ప్రదీప్ సోదరుడు జాయ్‌కు ఫోన్ చేశాడు.

ఏమి జరిగిందో తెలుసుకునేందుకు జాయ్ ఇంటికి చేరుకోగా అక్కడ రెండు సూట్‌కేసులు బాత్రూంలో కనిపించాయి. సూట్‌కేసులో నుంచి దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు కబురు చేశాడు. పోలీసులు చేరుకుని సూట్‌కేసును తెరువగా తన దంపతుల మృతదేహాలు బయటపడ్డాయి. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు పోలీసులు. హత్య జరిగిన ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు. డాగ్ స్క్వాడ్‌ కూడా చేరుకుని దర్యాప్తు చేస్తోంది. మరోవైపు ఫోరెన్సిక్ నిపుణులు కూడా చేరుకుని ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

bengal murder

వెస్ట్ బెంగాల్‌లోని నరేంద్ర పూర్‌లో జంటహత్యలు జరిగి ఒక రోజు కూడా గడవకముందే మరో దంపతుల హత్య జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. నేతాజీ నగర్‌లోని రెండంతస్తుల భవనంలో ఈ వృద్ధ దంపతులు చనిపోయి కనిపించారు. మృతులను దిలీప్, సప్నా ముఖర్జీలుగా గుర్తించారు. భార్య గొంతుకు తాడు కట్టి ఆమెను గుమ్మం దగ్గర పడేశారు దుండగులు. గొంతులోకి ఓ పైపును కూడా దూర్చారు. మరోవైపు భర్త మృతదేహం బెడ్‌రూంలో కనిపించింది. అయితే ప్రాథమిక విచారణ ప్రకారం ముగ్గురు ఆగంతకులు దోచుకునేందుకు వచ్చి ఈ వృద్ధ దంపతులను హత్య చేసి ఉంటారని తెలుస్తోంది.

English summary
A bone-chilling instance has come to light from the state of West Bengal where a couple was found murdered in gruesome conditions. The bodies of Pradip and Alpana Biswas was found at a home in South 24 Paraganas district of the state. Local police have registered a case and initiated an investigation into the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X