
అక్రమ సంబంధం ఆరోపణలు... ఆ మహిళను,యువకుడిని నగ్నంగా మార్చి ఊరేగింపు...
జార్ఖండ్లో దారుణం జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకున్నారన్న ఆరోపణలతో ఓ జంటను స్థానికులు నగ్నంగా మార్చి వీధుల్లో ఊరేగించారు. ఈ దారుణానికి పాల్పడిన 60 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుంకా జిల్లా ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... దుంకా జిల్లాలోని మయురంచ గ్రామానికి చెందిన ఓ వివాహిత దినసరి కూలీగా పనిచేస్తోంది. పొరుగు గ్రామమైన కుల్హదియాకు చెందిన ఓ వ్యక్తి కూడా ఆమె పనిచేసే చోటే దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. మంగళవారం(సెప్టెంబర్ 28) ఆ యువకుడు ఆ వివాహితను కలిసేందుకు ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. గమనించిన స్థానికులు అతన్ని,ఆమెను ఇద్దరినీ పట్టుకుని చితకబాదారు.

ఆ ఇద్దరికీ అక్రమ సంబంధం ఉందని... అందుకే అతను ఆమె ఇంటికి వచ్చాడని ఆరోపించారు. ఇద్దరినీ నగ్నంగా మార్చి గ్రామంలో ఊరేగించారు.దాదాపు కిలో మీటర్ దూరం వరకు వారిని అలాగే నడిపించారు.ఇంతలో విషయం పోలీసులకు తెలియడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. గ్రామస్తులను చెదరగొట్టి బాధితులను అక్కడి నుంచి స్టేషన్కు తరలించారు.బాధితుల ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన 50-60 మందిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
మైనర్ బాలికపై 74 ఏళ్ల వృద్దుడి అత్యాచారం :
తమిళనాడులోని నరసైయర్కులంలో ఏడేళ్ల బాలికపై 74 ఏళ్ల వృద్దుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చాక్లెట్లు చూపించి ఆ బాలికను ఆకర్షించిన వృద్దుడు... చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు.ఇటీవల బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో అసలు విషయం బయటపడింది. ఆ వృద్దుడు తనపై రెండు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నట్లు ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పింది.పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.