గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొరియర్ బాక్స్‌లో అనుకొని అతిథి.. చూసి ఖంగుతిన్న వినియోగదారు... ఏముందో తెలుసా ...?

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్ : తనకు కావాల్సిన గృహోపకరణాలను కొరియర్ చేశాడు. చేసిన 15 రోజులకు కొరియర్ బాక్స్ వచ్చింది. అయితే అందులో తాను చేసిన వస్తువులకు బదులు మరో అతిథి కూడా ప్రత్యక్షమైంది. దీంతో అతను ఖంగుతిన్నాడు. వామ్మో .. అంటూ పరుగుతీశాడు. అనుకొని అతిథి దర్శనం ఇవ్వడంతో కాలు, చేయి ఆడలేదు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు ఘటనాస్థలానికి చేరుకొని ... ఆ సరీసృపాన్ని పట్టుకోవడంతో ... అతని కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఒడిశాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

ఒడిశాలో మకాం ..

ఒడిశాలో మకాం ..

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ముత్తుకుమరన్ ఉద్యోగరీత్యా ఒడిశాలో ఉంటున్నారు. మయూర్‌బంజ్ జిల్లా రాయ్‌రంగ్‌పూర్‌లో తన ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాడు. అయితే అతను గుంటూరు నుంచి గృహోపకరణాలను ఎంపిక చేసుకొని .. కొరియర్ ద్వారా బుక్ చేశాడు. ఈ నెల 9న బుక్ చేసిన ఆ వస్తువులు 15 రోజులకు చేరాయి. అంటే ఈ నెల 24న కొరియర్ బాక్స్ కుమరన్‌కు అందింది. దానిని వెంటనే తెరచి చూస్తే .. కుమరన్ ఒక్కసారిగా షాక్‌నకు గురయ్యాడు. అందులో గృహోకరణాల వస్తువులకు బదులు పాము ఉండటం చూసి షాక్‌నకు గురయ్యాడు. వామ్మో అంటూ ఒక్కసారిగా పరుగుతీశాడు. దీంతో అతని కుటుంబసభ్యుల చేయి, కాలు ఆడలేదు.

కొరియర్ బాక్సులో పాము ..

కొరియర్ బాక్సులో పాము ..

ఆ కొరియర్ బాక్సులో వచ్చింది సాదా సీదా పాము కాదు. నల్ల త్రాచు పాము. ఇంకేముంది కుమరన్ గుండె కిందకి జారినంత పనైంది. ఆ బాక్సును ఎలాగోలా మూసివేశాడు. వెంటనే అటవీ అధికారులు సమాచారం ఇచ్చారు. కొరియర్ బాక్సులో నల్ల త్రాచుపాము ఉందని చెప్పడంతో అటవీ అధికారులు హుటహుటిన తిరిగొచ్చారు. వెంటనే ఆ పామును పట్టుకొని .. అటవీలో వదిలేశారు. దీంతో కుమరన్, అతని ఫ్యామిలీ ఊపిరి పీల్చుకున్నారు. కొరియర్‌లో ప్రత్యక్షమైన అనుకొని అతిథిని అటవీ అధికారుల సాయంతో పంపించివేశామని కాస్త రీలాక్స్ అయ్యారు. అసలు గ‌ృహోపకరణాల వస్తువుల సంగతినే మరచిపోయారు. నల్ల త్రాచు తీసుకొచ్చిన టెన్షన్‌తో మరోసారి కొరియర్ చేయాలంటేనే వణికిపోతున్నారు.

ఎలా వచ్చిందబ్బా ..

ఎలా వచ్చిందబ్బా ..

ఆ కొరియర్ బాక్సులోకి పాము ఎలా వచ్చి ఉంటుందనే అంశంపై అటవీ అధికారులు ఆరా తీస్తున్నారు. గుంటూరు నుంచి ఒడిశా వచ్చే క్రమంలో దూరి ఉంటుందని పేర్కొన్నారు. గత ఆదివారం బాక్సులోకి చేరి ఉంటుందని భావిస్తున్నారు. వాస్తవానికి కొరియర్ బాక్స్ కూడా పకడ్బందీగా చేశారని .. కానీ అందులోకి ఎలా దూరిందో అర్థం కావడం లేదన్నారు. దీనిపై ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు. మొత్తానికి నల్ల త్రాచు పామును పట్టుకొని అడవీలో వదిలేశామని వివరించారు.

English summary
an Odisha resident was shocked after he found a snake inside his courier as he was unpacking the parcel at Rairangpur in Mayurbhanj district on Sunday. The man was identified as S Muthukumaran, a native of Vijayawada in Andhra Pradesh. Muthukumaran said as soon as he found cobra inside the courier at his present home in Rairangpur area of Mayurbhanj district of Odisha, he informed the forest officials who then released the snake in its natural habitat. Muthukumaran said he had booked a parcel through a private courier agency a fortnight back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X