వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కేసు: విజయ్ మాల్యాపై అరెస్ట్ వారెంట్ జారీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బెంగళూరు: బ్యాంకులకు సుమారు 9వేలకోట్ల రూపాయల ఎగవేసి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌ మాల్యాపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కేసులో బెంగళూరులోని కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కోర్టు మాల్యాతోపాటు మరో 18మందికి ఈ వారెంట్‌ జారీ చేసింది.

సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఐఎఫ్ఓఓ) దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు ఈ ఈ మేరకు చర్య తీసుకుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని దర్యాప్తు సంస్థ, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి పలు కంపెనీల చట్టాల ఉల్లంఘనలను గుర్తించింది. దీంతోపాటు తీవ్రమైన కార్పొరేట్ పాలన లోపాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Court: Issue arrest warrant against Vijay Mallya in Kingfisher Airlines case

ఈ కేసులో చోటుచేసుకున్న అక్రమాల మొత్తం భారీగా ఉండటంతో మాల్యా సహా అందరి నిందితులపై కోర్టు సీరియస్‌గా స్పందించింది. ఈ నేపథ్యంలోనే కంపెనీల చట్టాల ప్రకారం డిఫాల్టర్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా, మరో 18 మందికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అంతేగాకుండా, 19 సంస్థలపై 'ప్రత్యేక నేర కేసు' నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీ తమ చార్జ్‌షీటులను దాఖలు చేశాయి.

English summary
A court has directed issuance of arrest warrant against defaulter businessman Vijay Mallya+ and 18 others in the Kingfisher Airlines case, on a complaint filed by the Serious Fraud Investigation Office (SFIO).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X