వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎన్ఎక్స్ మీడీయా కేసులో పి. చిదంబరం, ముందస్తు బెయిల్ నిరాకరించిన కోర్టు

|
Google Oneindia TeluguNews

మాజీ ఆర్ధిక మంత్రి పీ చిదంబరం ఎదుర్కోంటున్న ఐఎన్ఎక్స్ మీడీయా కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లి హైకోర్టు నిరాకరించింది. కేసుపై గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న నేపథ్యంలోనే చిదంబరం ఢిల్లీ కోర్టును ఆశ్రయించాడు. దీంతో పలు సార్లు అరెస్ట్ కాకుండా కోర్టుల్ వాజ్యాలు వేశాడు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా ఒప్పందంలో నిబంధనలకు విరుద్ధంగా రూ.305 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు వచ్చాయని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చిదంబరంపై విదేశీ పెట్టుబడుల విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని కేసులు నమోదయ్యాయి.

యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. 3,500కోట్ల ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ ఒప్పందం, రూ. 305కోట్ల ఐఎన్‌ఎక్స్‌ మీడియా ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీతోపాటు సీబిఐ దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఒప్పందాల సమయంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఐఎన్ఎక్స్‌ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి ఇవ్వడంలో చిదంబరం అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే నేడు విచారణ నిమిత్తం ఈడీ చిదంబరానికి సమన్లు కూడ జారీ చేసింది. దీంతో ఆయన ఈడీ విచారణ కూడ హజరయ్యారు.

 Court rejected former finance minister P Chidambaram’s anticipatory bail in the INX Media case

ఈ నేపథ్యంలనే ఈ కేసుల్లో చిదంబరానికి దిల్లీ హైకోర్టులో పలుసార్లు తాత్కాలిక ఊరట కల్పించింది. గత జనవరి 15 వరకు ఆయనను అరెస్టు చేయకుండా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరోసారి జనవరి 25న వాదనలు జరిగాయి. చిదంబరం అరెస్ట్‌పై వాదనలు జరిగాయి. అటు సిబిఐ గాని, ఈడీగాని చిదంబరం అరెస్ట్‌ను కోరాయి. అయితే వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వు చేసి నేడు ముందస్తు బెయిల్ నిరాకరించింది. మరోవైపు అరెస్ట్‌కు మూడు రోజుల ముందు అప్పిల్ చేయడానికి అవకాశం ఇవ్వాలన్న పిటిషన్ పై కోర్టు స్పందించలేదు.

English summary
The Delhi High Court on Tuesday rejected former finance minister P Chidambaram’s anticipatory bail in the INX Media case being investigated by cbi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X