వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదెక్కడి కాలికాలంరా నాయనా..! పవిత్ర పుణ్యక్షేత్రంలో అక్కా చెల్లెళ్లు పెళ్లి చేసుకోవడం ఏంటో..? చిత్రం

|
Google Oneindia TeluguNews

వారణాసి/హైదరాబాద్ : సమాజం పాశ్యాత్య పోకడలకు నిలయంగా మారుతోంది. వావి వరసలు, నైతిక విలువలు, మంచి-మర్యాద పూర్తిగా అడుగంటి పోతున్నాయి. అసలు సమాజంలో ఏది మంచి ఏది చెడు నిర్ధారించుకునే విచక్షణకోల్పోతున్నారు నేటి యువత. అందుకు మహిళలు కూడా మినాహాయింపు ఏమీ కాదు. మానవతా విలువలకు అతీతంగా వ్యవహరించడంలో వారి పాత్ర వారు కూడా పూర్తి స్థాయిలో పోషిస్తున్నారు. స్త్రీ, పురుషులు వివాహం చేసుకుంటారనేది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే.

అయితే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో చాలా మంది తమ బంధం గురించి బాహాటంగానే ప్రకటిస్తున్నారు. మరికొంతమంది ఓ అడుగు ముందుకేసి వివాహం చేసుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.వరుసకు అక్కా చెల్లెలు అయిన ఇద్దరు యువతులు బుధవారం పెళ్లి చేసుకున్నారు. సంస్కృతి, సంప్రదాయలకు పుట్టినిల్లుగా పేరొందిన వారణాసి వంటి ఆధ్యాత్మిక నగరంలో ఈ ఘటన కలకలం రేపుతోంది. ఇటువంటి వివాహం జరగటం వారణాసి చరిత్రలో మొదటిదని పలువులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Cousins In Varanasi Marry Against Family..!!

పూర్తి వివరాలు ఒక సారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాన్పూర్‌కు చెందిన ఓ యువతి తనకు చెళ్లి వరుస అయ్యే మరో యువతిని.. స్థానిక శివాలయానికి తీసుకవెళ్లారు. ఎవరికీ అనుమానం రాకూడదనే ఉద్దేశంతో.. ఎరుపు రంగు చున్నీని ముఖానికి ధరించి వెళ్లారు. తమకు పెళ్లి జరిపించాలని పూజారిని కోరారు. అయితే ఆయన మాత్రం ఇందుకు నిరాకరించారు. అయినప్పటికీ అక్కడే భీష్మించుకుని కూర్చున్న సదరు యువతులు తమకు తాముగా వివాహం చేసుకున్నారు. అనంతరం పెళ్లి ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఈ ఘటపై వారణాసిలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

English summary
In the wake of the Supreme Court ruling that homosexuality is not a crime, many have been outspoken about their relationship. Others are taking a step back and getting married. The latest incident in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X