• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వరుసకు అన్నాచెల్లెలు: ప్రేమ, పెళ్లి: పారిపోయి చెన్నైకి: దారుణహత్య..దహనం: పోలీసుల కళ్లుగప్పి

|

రాయ్‌పూర్: ఛత్తీస్‌గడ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమజంటను వారి కుటుంబ సభ్యులు హతమార్చారు. ప్రేమికులకు విషం పెట్టి చంపారు. అనంతరం వారి మృతదేహాలను దహనం చేశారు. ఏమీ తెలియనట్టు.. తమ పిల్లలు కనిపించట్లేదంటూ ఆ రెండు కుటుంబాల వారు వేర్వేరుగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తు సందర్భంగా ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మరి కొందరి కోసం గాలింపు చర్యలను చేపట్టారు. ప్రేమికుల మధ్య సోదర సంబంధం ఉందని కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు.

గంటకు రూ.5,000..ఫుల్ నైట్ రూ.15,000: హైప్రొఫైల్ సెక్స్ వర్కర్‌గా మహిళా టెక్కీ ఫొటో సర్కులేట్

ప్రేమలో ఎలా పడ్డారంటే..?

ప్రేమలో ఎలా పడ్డారంటే..?

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా కృష్ణానగర్‌‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణానగర్‌కు చెందిన శ్రీహరి, అతని కజిన్ ఐశ్వర్య పరస్పరం ప్రేమించుకునే వారు. శ్రీహరి, ఐశ్వర్య నివాసాలు పక్కపక్కనే ఉన్నాయి.. వారిద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారు. చాలాకాలంగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం బయటపడటంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీనితో వారు కిందటి నెల ఇళ్లొదిలి పారిపోయారు. వారి కోసం అన్నిచోట్లా గాలించిన కుటుంబ సభ్యులు చివరికి కృష్ణానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 ఇంట్లో నుంచి పారిపోయి.. చెన్నైలో మకాం..

ఇంట్లో నుంచి పారిపోయి.. చెన్నైలో మకాం..

కేసు నమోదు చేసుకున్న పోలీసుల శ్రీహరి, ఐశ్వర్య కోసం గాలింపు చర్యలను చేపట్టారు. సెల్ సిగ్నళ్ల ఆధారంగా వారు చెన్నైలో ఉంటున్నట్లు గుర్తించారు. వారిని తీసుకుని రావడానికి ప్రత్యేక బృందాన్ని పంపించారు. ఈ నెల 7వ తేదీన పోలీసులు వారిని స్వస్థలానికి తీసుకొచ్చారు. కౌన్సెలింగ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారిపై నిఘా ఉంచారు. శనివారం నుంచి శ్రీహరి, ఐశ్వర్య కనిపించకుండా పోయారు. ఈ సారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయకపోవడం పోలీసుల్లో అనుమానాలను రేకెత్తించింది.

విషం పెట్టిన చంపిన ఫ్యామిలీ మెంబర్స్..

విషం పెట్టిన చంపిన ఫ్యామిలీ మెంబర్స్..

ఇద్దరి గురించి ఆరా తీయగా.. కుటుంబ సభ్యులు పొంతన లేని సమాధానాలను ఇచ్చారు. వారిని కస్టడీలోకి తీసుకుని విచారించగా.. దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించారు. తమ కుటుంబ పరువు తీశారనే కారణంతో శనివారం రోజే శ్రీహరి, ఐశ్వర్యను విషం ఇచ్చి హత్య చేసినట్లు అంగీకరించారు. మృతదేహాలను జెవ్రా సిర్సా గ్రామానికి సమీపంలో ఉన్న శివనాథ్ నది ఒడ్డున తగలబెట్టినట్లు నిందితులు వెల్లడించినట్లు భిలాయ్ నగర్ సిటీ పోలీసు సూపరింటెండెంట్ అజిత్ యాదవ్ తెలిపారు.

నదీతీరంలో దహనం..

నదీతీరంలో దహనం..

ఈ ఘటనలో కుప్పల్ చరణ్, రాము అనే ఇద్దరిని అరెస్టు చేశామని అజిత్ యాదవ్ తెలిపారు. కృష్ణానగర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుపేలా, జెవ్రా సిర్సా గ్రామాల మధ్య శివనాథ్ నదీ తీరంలో మృతదేహాలను తగులబెట్టినట్లు వారు వెల్లడించారని అన్నారు. నిందితులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పాక్షికంగా కాలిపోయిన శ్రీహరి, ఐశ్వర్య మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం తరలించినట్లు చెప్పారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు. వరుసకు అన్నాచెల్లెలయిన శ్రీహరి, ఐశ్వర్య పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించారని, అందుకే హత్య చేసినట్లు అన్నారు.

English summary
A man and his cousin were poisoned and their bodies set on fire by two of their relatives for reportedly being in a relationship in Durg district, police said on Monday. The relatives burnt their bodies on the banks of Shivnath river near Jewra Sirsa village of Durg, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X