వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో కరోనా: తొలిరోజు గుడ్‌న్యూస్ -1కోటి రికవరీలు-కొత్తగా 19,079 కేసులు, 224మరణాలు-వ్యాక్సిన్ డ్రైరన్ షురూ

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి విలయానికి సంబంధించి కొత్త ఏడాది తొలిరోజే భారత్‌కు రెండు గుడ్ న్యూస్‌లు వచ్చాయి. దేశంలో అత్యవసర వినియోగానికి సీరం-ఆక్స్ ఫర్డ్ అభివృద్ధి చేసిన 'కొవిషీల్డ్' వ్యాక్సిన్‌కు కేంద్ర నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, తొలి రోజు పెరిగిన రికవరీలతో దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 1కోటికి చేరువైంది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైరన్ శనివారం విజయవంతంగా ప్రారంభమైంది..

 సెక్సీ ఫొటోలతో హారిక వలపువల -డేటింగ్ పేరుతో భారీ చీటింగ్ -భర్త సిక్ - కుటుంబ పోషణకు పక్కదారి సెక్సీ ఫొటోలతో హారిక వలపువల -డేటింగ్ పేరుతో భారీ చీటింగ్ -భర్త సిక్ - కుటుంబ పోషణకు పక్కదారి

96.12శాతం రికవరీ రేటుతో..

96.12శాతం రికవరీ రేటుతో..


దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ నుంచి కోలుకునే వారి సంఖ్య పెరుగుతోంది. రికవరీలు ఇప్పటికే 99 లక్షల మార్కును దాటి..కోటి దిశగా పయనిస్తున్నాయి. వరసగా 36వ రోజు కూడా రోజూవారీ పాజిటివ్ కేసులకంటే.. రికవరీ కేసులే ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. నిన్న(శుక్రవారం) ఒక్కరోజే 22,926 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య కోటికి చేరువగా, 99,06,387కు పెరిగింది. దేశంలో రికవరీ రేటు 96.12శాతంగా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. ఇక..

కన్నకూతురిని రేప్ చేయించిన తల్లి -ప్రియుడి మోజు తీర్చడానికి బిడ్డను పణంగా -బాలికకు గర్భం రావడంతోకన్నకూతురిని రేప్ చేయించిన తల్లి -ప్రియుడి మోజు తీర్చడానికి బిడ్డను పణంగా -బాలికకు గర్భం రావడంతో

కొత్తగా 19,079 కేసులు..

కొత్తగా 19,079 కేసులు..


కరోనా తగ్గుతుందన్న ఆశతో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన దేశంలో తొలి రోజున కొత్త కేసుల సంఖ్య 20 వేలకు దిగువన ఉండటం గమనార్హం. ఆరోగ్య శాఖ చెప్పిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో మొత్తం 8,29,964 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 19,079 మంది పాజిటివ్ గా తేలారు. తద్వారా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,03,05,788కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 224 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం మృతుల సంఖ్య 1,49,218కి పెరిగింది. రికవరీలు ఒక కోటికి చేరువకాగా, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,50,183గా ఉంది.

దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైరన్ షురూ..

దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైరన్ షురూ..


కరోనా మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమానికి దేశంలో ముందడుగు పడిన వేళ శనివారం టీకా డ్రైరన్‌ చేపట్టారు. దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లోని 259 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్‌ మాక్‌ డ్రిల్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. టీకా పంపిణీ కోసం ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థల పనితీరును ఈ డ్రైరన్‌లో అధికారులు విస్తృతంగా పరిశీలిస్తున్నారు. ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ మాక్‌ డ్రిల్‌ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ స్వయంగా వెళ్లి పరిశీలించారు.

English summary
With 19,079 new coronavirus infections in the past 24 hours, India's overall COVID-19 tally stood at 1,03,05,789 on Saturday, the Ministry of Health and Family Welfare said. The death toll surged to 1,49,218 after the COVID-19 infection claimed 224 more lives in the past 24 hours. Vaccine dry run across India took place on saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X