వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: ఏక్షణమైనా వ్యాక్సిన్ పంపిణీ -నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు -దేశంలో కొత్తగా 30,245 కేసులు

|
Google Oneindia TeluguNews

గ్లోబల్‌గా కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 16లక్షలు దాటింది. మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 7.21కోట్లకు పెరిగింది. ఇండియాకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,254 పాజిటివ్ కేసులు, 391 మరణాలు నమోదయ్యాయి. తద్వారా మొత్తం కేసుల సంఖ్య 98,57,029కు, మరణాల సంఖ్య 1,43,019కి చేరింది. నిన్న ఒక్కరోజే 33,136 మంది డిశ్చార్జ్. దాదాపు 95శాతం రికవరీ రేటుతో ఇప్పటికే 93,57,464 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,56,546గా ఉంది. కరోనా విలయం కారణంగా భయానకంగా గడచిన 2020 నుంచి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నవేళ ఒకింత శుభపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి..

Recommended Video

COVID-19 Vaccination SOP by health ministry | Oneindia Telugu

తెలంగాణ: కరోనా రిలీఫ్ -కొత్తగా 573 కేసులు, 4మరణాలు -75లక్షల మందికి వ్యాక్సిన్ -స్కూల్స్ రీఓపెనింగ్తెలంగాణ: కరోనా రిలీఫ్ -కొత్తగా 573 కేసులు, 4మరణాలు -75లక్షల మందికి వ్యాక్సిన్ -స్కూల్స్ రీఓపెనింగ్

వ్యాక్సిన్‌పై కేంద్రం గైడ్‌లైన్స్

వ్యాక్సిన్‌పై కేంద్రం గైడ్‌లైన్స్

ఇండియాలో వివిధ సంస్థలు అభివృద్ధి చేసిన మొత్తం 8 వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. విదేశీ ఫార్మా కంపెనీలు సైతం డిస్ట్రిబ్యూషన్ కు దరఖాస్తులు చేసుకున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ ను భారత్ లో ఏ క్షణమైనా అనుమతులు లభించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, కేంద్రం భారీ ఎత్తున వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లలో నిమగ్నమైంది. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే తొలుత ఫ్రంట్ లైన్ వారియర్లకు ఆ తర్వాతే ప్రజలకు అందించాలని కేంద్రం డిసైడైంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీ విధానం, లాజిస్టిక్స్, వ్యాక్సిన్ స్టోరేజ్ తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొనే వర్కర్లకు శిక్షణ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా గైడ్ లైన్స్ విడుదల చేసింది.

ట్రంప్‌కు మోదీ ఆఖరి పంచ్ -గ్లోబ్‌ను గబ్బు పట్టించిన పాపం ఎవరిది బాసు? పారిస్ ఒప్పందానికి ఐదేళ్లుట్రంప్‌కు మోదీ ఆఖరి పంచ్ -గ్లోబ్‌ను గబ్బు పట్టించిన పాపం ఎవరిది బాసు? పారిస్ ఒప్పందానికి ఐదేళ్లు

113 పేజీల డాక్యుమెంట్..

113 పేజీల డాక్యుమెంట్..

స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్(ఎస్ఓపీ)లో భాగంగా భారత్ లో కొవిడ్‌-19 టీకా నిర్వహణకు సంబంధించి విడుదల చేసిన మార్గదర్శకాల్లో.. ప్రజలను రక్షించడం, కరోనా కారణంగా సంభవించే సామాజిక, ఆర్థిక ప్రభావాలతో పాటు మరణాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యమని కేంద్రం పేర్కొంది. మొత్తం 113 పేజీల డాక్యుమెంట్ లో కరోనా నివారణ, వ్యాక్సిన్‌, పలు స్థాయిల్లో టీకా నిర్వహణ, మానవ వనరులు, వారికి శిక్షణ అంశాలతోపాటు కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌ (కొవిన్‌) సాప్ట్‌వేర్‌, వ్యాక్సిన్‌ అందించే ప్రక్రియ, టీకా నిల్వకు సంబంధించిన కోల్డ్ స్టోరేజీ వ్యవస్థ నిర్వహణ, టీకా దుష్ఫ్రభావం ఎదుర్కోవడం, పర్యవేక్షణ వంటి అంశాలకు సంబంధించిన విషయాలను కూడా పొందుపర్చారు. కొవిడ్ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో మొత్తం 23 మంత్రిత్వ శాఖలను భాగస్వామ్యం చేసినట్లు కేంద్రం తెలిపింది.

వ్యాక్సిన్ ఎస్ఓపీలో ముఖ్యాంశాలు..

వ్యాక్సిన్ ఎస్ఓపీలో ముఖ్యాంశాలు..

వ్యాక్సినేషన్‌ కోసం రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించాలి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు టీకాను ఇవ్వాలి. కొవిన్‌ సాప్ట్‌వేర్‌ ద్వారా గుర్తించిన లబ్ధిదారులకే టీకాలు వేయాలి. ఒక వ్యాక్సినేషన్‌ సెషన్‌లో 100 మందికే వ్యాక్సిన్‌ వేయాలి. వైద్య సిబ్బందికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు స్కూల్స్‌, కమ్యూనిటీ హాల్స్‌, హైరిస్కు పాపులేషన్‌కు పాఠశాలలు, కమ్యూనిటీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ, మునిసిపల్‌ కార్యాలయాలతో పాటు మొబైల్‌సైట్స్‌ ద్వారా కరోనా వ్యాక్సిన్‌ అందించాలి. సాధారణ పౌరులు వ్యాక్సిన్‌ కోసం ‘కొవిన్‌' ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోదలిస్తే గుర్తింపు కార్డు తప్పనిసరి. అందుకు మొత్తం 12 రకాల గుర్తింపు కార్డులలో ఒకదానిని వాడుకోవచ్చు. వాటిలో ఆధార్‌, పాన్‌ కార్డు, పాస్‌పోర్టు, ఉపాధిహామీ కార్డు, బ్యాంకు పాస్‌ బుక్‌, పెన్షన్‌ ధ్రువపత్రాలు, ఓటరు ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే గుర్తింపు కార్డులు ఉన్నాయి.

తొలి దశలో 30 కోట్ల మందికి..

తొలి దశలో 30 కోట్ల మందికి..

తొలి దశలో దేశంలోని 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను అందిస్తారు. వారిలో కోటిమంది వైద్య సిబ్బంది, 2 కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 27 కోట్ల మంది యాభై ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉంటారు. వ్యాక్సిన్‌ కేంద్రంలో మూడు గదులు ఏర్పాటు చేయాలి. వేచి ఉండు గది, టీకా గది, అబ్జర్వేషన్‌ రూమ్‌ (వ్యాక్సిన్‌ తీసుకున్నాక వేచి ఉండే గది) ఏర్పాటు చేసుకోవాలి. టీకా తీసుకున్న వారిలో ఏమైనా దుష్ప్రభావం తలెత్తితే తక్షణ వైద్య సదుపాయం అందించాలి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిర్వహణ కోసం రాష్ట్ర,మండల, బ్లాక్‌ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలి. ఆయా కమిటీలు, టాస్క్‌ఫోర్స్‌లు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలను మార్గదర్శకాల్లో పొందుపరిచారు. ఈ కార్యక్రమం కోసం అన్ని రాష్ట్రాలు స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఎన్నికలా పకడ్బందీగా జరపాలని కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఉంది.

వ్యాక్సినేషన్ బృందాల్లో4 విభాగాలు..

వ్యాక్సినేషన్ బృందాల్లో4 విభాగాలు..


ఇంకా తేదీలు ఖరారు కానప్పటికీ, దేశంలో త్వరలోనే చేపట్టనున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఒక్కో బృందంలో నాలుగు విభాగాలు ఉంటాయని కేంద్రం తన మార్గదర్శకాల్లో తెలిపింది. మొదటి విభాగంలో వ్యాక్సినేటర్‌ ఆఫీసర్‌ (ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ డాక్టర్‌) స్టాఫ్‌నర్స్‌, ఫార్మసిస్ట్‌, ఏఎన్‌ఎమ్‌ ఉంటారు. వీరిలో ఒకరు కొవిడ్‌-19 టీకా వేయొచ్చు. రెండో విభాగంలో వ్యాక్సినేషన్‌ ఆఫీసర్లు, పోలీసులు, హోంగార్డ్‌, సివిల్‌ డిఫెన్స్‌, ఎన్‌సీసీ, ఎన్‌ఎ్‌సఎస్‌ విభాగాలు ఉంటాయి. వీరిలో కనీసం ఒకరు ఉండి వ్యాక్సిన్‌ లబ్ధిదారుల రిజిస్ట్రేషన్‌ స్టేట్‌సను తనిఖీ చేయాల్సి ఉంటుంది. మూడు, నాలుగు విభాగాల్లో వ్యాక్సినేషన్‌ ఆఫీసర్స్‌ ఉంటారు. ఇందులో ఉండేది అంతా సహాయక సిబ్బందే. వీరు టీకా ప్రచారం, క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌, వ్యాక్సినేటర్‌కు సహాయ సహకారాలు అందించాలి.

English summary
India on Sunday registered 30,254 fresh COVID-19 cases, pushing the tally to 98.57 lakh, according to health ministry data. As India gears up for vaccination drive, the government said that a total of 100 people is expected to get the anti-Covid-19 shots at each site per day. In a draft SOP issued by health ministry to all states and union territoties, it stated that 100 people should be vaccinated per day at a site and if sufficient resources are available then up to 200 people can be vaccinated
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X