వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్ 19 .. ఇండియాలో 68కి పెరిగిన కేసులు ..ఏప్రిల్ 15 వరకు వీసాలు రద్దుకు కేంద్ర నిర్ణయం

|
Google Oneindia TeluguNews

ఇప్పుడు చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ ఇండియాను భయపెడుతుంది. చైనాలోని వుహాన్‌లో మొదలైన ఈ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 110 దేశాలకు వ్యాపించింది. ఈ కరోనా మహమ్మారి కారణంగా సుమారు 4 వేల మందిపైగా ప్రాణాలు విడిచారు. ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది.ఇది భారత సర్కార్ ను ఆందోళనకు గురి చేస్తుంది.

కరోనా ఒక మహమ్మారి.. ప్రకటించిన డబ్ల్యూ‌హెచ్‌ఓ: ప్రపంచాన్ని వణికించిన 'మహమ్మారి' వైరస్ లు ఇవే కరోనా ఒక మహమ్మారి.. ప్రకటించిన డబ్ల్యూ‌హెచ్‌ఓ: ప్రపంచాన్ని వణికించిన 'మహమ్మారి' వైరస్ లు ఇవే

ఇండియా వ్యాప్తంగా 68కి చేరిన కరోనా కేసుల సంఖ్య

ఇండియా వ్యాప్తంగా 68కి చేరిన కరోనా కేసుల సంఖ్య

ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 68 కి చేరింది. ప్రస్తుతం ఈ పరిస్థితులు ఇండియాను భయపడుతుంది. ఇప్పటికే కేరళ, కర్ణాటక, తెలంగాణా , ఢిల్లీ ప్రాంతాలలో కరోనా కేసులు నమోదు కాగా కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తగు తక్షణ చర్యలకు ఉపక్రమించింది . భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

 ఏప్రిల్ 15 వరకు అన్ని వీసాల రద్దుకు కేంద్రం నిర్ణయం

ఏప్రిల్ 15 వరకు అన్ని వీసాల రద్దుకు కేంద్రం నిర్ణయం


ఇటలీ నుండి వచ్చిన టూరిస్టుల వల్లే భారత్ లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే కొంత కాలం పాటు విదేశీయులను ఇండియాకు రాకుండా నియంత్రించాలని భావించింది భారత సర్కార్. అందుకోసం ఏప్రిల్ 15 వరకు అన్ని టూరిస్ట్ వీసాలను రద్దు చేసింది.ఈ నిబంధన మార్చి 13వ తేదీ నుంచి, అంటే రేపటి నుండి అమలులోకి రానుంది.

కరోనా నియంత్రణకు తప్పనిసరి చర్యల్లో భాగంగా నిర్ణయం

కరోనా నియంత్రణకు తప్పనిసరి చర్యల్లో భాగంగా నిర్ణయం

అధికారిక వీసాలు, డిప్లొమాటిక్ వీసాలు, ఐక్య రాజ్య సమితి సంస్థల ప్రతినిధులకు సంబంధించిన వీసాలు ఇలా ఒకటేమిటి అన్ని రకాల వీసాలన్నింటిని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణకు తప్పని సరి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో మంత్రుల కమిటీ సమావేశమై కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఈ నిర్ణయానికి వచ్చారు.

విదేహ్సాల నుండి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి ..14 రోజుల పాటు ఐసోలేషన్‌

విదేహ్సాల నుండి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి ..14 రోజుల పాటు ఐసోలేషన్‌

అటు ఫిబ్రవరి 15 తర్వాత చైనా, ఇటలీ, ఇరాన్, కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీల నుంచి వచ్చిన విదేశీయులపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక వారిని గుర్తించి తప్పనిసరిగా 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా విదేశాల నుంచి వచ్చే భారతీయులకు స్క్రీనింగ్ నిర్వహించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఎవరైనా కరోనా అనుమానితులు ఉంటే ఐసోలేషన్ వార్డులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.

English summary
The corona virus that is now trembling China threatens india..In order to curb the spread of corona, the Indian government wanted to control foreigners from coming to India . For this purpose, all tourist visas have been canceled until April 15. this will be implemented from tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X