• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Coronavirus: బీహార్ లో 60 కరోనా కేసులు, ఒక్కడి దెబ్బకు ఫ్యామిలీలో 23 మందికి, మీరు జాగ్రత్త !

|

పాట్నా (బీహార్): ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు కరోనా వైరస్ (COVOD 19) దెబ్బకు విలవిలలాడిపోతున్నారు. భారతదేశంలో కరోనా వైరస్ ను అరికట్టడానికి ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా వైరస్ కట్టడికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. బీహార్ లో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఇదే సమయంలో బీహార్ లో ప్రస్తుతం నమోదైన కరోనా వైరస్ కేసుల్లో 35 శాతం కేసులు ఒకే ఫ్యామిలీలో నమోదైనాయని వెలుగు చూడటంతో ప్రజలు హడలిపోయారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి నుంచి ఆయన కుటుంబంలోని 23 మందికి కరోనా వైరస్ సోకిందని అధికారులు అంటున్నారు.

Corna Lockdown: డ్రోన్లకు క్రికెట్ కామెంట్రీ, తుపాకి కాల్పులు, దెబ్బకు దౌడ్, వైరల్ వీడియో!

ఒమన్ టూ బీహార్

ఒమన్ టూ బీహార్

బీహార్ లోని పాట్నాకు 130 కిలోమీటర్ల దూరంలోని శివన్ జిల్లాలో పంజ్వార్ గ్రామం ఉంది. ఒమన్ (మస్కట్) నుంచి మార్చి 16వ తేదీన ఓ వ్యక్తి అతని సొంతం ఊరు అయిన శివన్ జిల్లాలోని పంజ్వార్ గ్రామానికి చేరుకున్నాడు. తరువాత కుటుంబ సభ్యులతో అతను కాలం గడిపాడు.

బీహార్ లో 60 కరోనా కేసులు

బీహార్ లో 60 కరోనా కేసులు

బీహార్ లో నేటి ఇప్పటి వరకు మొత్తం 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయని ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. బీహార్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువ కాకుండా చూడటానికి అక్కడి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వం సైతం బీహార్ లోని కొన్ని జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

ఒక్కడితో 23 మందికి కరోనా వైరస్

ఒక్కడితో 23 మందికి కరోనా వైరస్

ఒమన్ నుంచి వచ్చిన వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఒమన్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ వ్యాధి సోకిందని ఏప్రిల్ 4వ తేదీన అధికారులు గుర్తించారు. అప్పటికే ఒమన్ నుంచి వచ్చిన వ్యక్తి కుటుంబంలోని మహిళలు, పిల్లలు, కుటుంబ సభ్యులతో పాటు శివన్ జిల్లాలోని అనేక ప్రాంత ప్రజలతో కలిసిమెలసి తిరిగేశాడు. ఇప్పటి వరకు ఒమన్ నుంచి వచ్చిన వ్యక్తి వలన అతని కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, వారితో సంబంధాలు ఉన్న 23 మందికి కరోనా వైరస్ సోకిందని అధికారులు తెలిపారు.

బీహార్ లో ఒక్క దెబ్బకు 35 శాతం కరోనా కేసులు

బీహార్ లో ఒక్క దెబ్బకు 35 శాతం కరోనా కేసులు

బీహార్ లో నేటి వరకు 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. అయితే ఇందులో ఒమన్ నుంచి వచ్చిన వ్యక్తి వలనే 35 శాతం కరోనా కేసులు (1+ 23) నమోదైనాయని అధికారులు అంటున్నారు. అంతే కాకుండా ఒమన్ నుంచి సొంత గ్రామం వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని బీహార్ వైద్య శాఖ అధికారులు అంటున్నారు. 23 మందికి ప్రస్తుతం ప్రత్యేక చికిత్సలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

బీహార్ కరోనా హాట్ స్పాట్

బీహార్ కరోనా హాట్ స్పాట్

ఒమన్ నుంచి వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులు అందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించామని, అందులో 23 మందికి కరోనా పాజిటివ్ రిపోర్టులు వచ్చాయని, మరో 10 మంది కరోనా పరీక్షల ఫలితాలు ఇంకా రాలేదని బీహార్ వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఒమన్ నుంచి వచ్చిన వ్యక్తితో చనువుగా ఉన్న వారిని అందర్నీ 14 రోజులు క్వారంటైన్ కు తరలించి ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నామని, బీహార్ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ ఎన్ డీ టీవీకి సమాచారం ఇచ్చారు.

23 గ్రామాలు సీల్ డౌన్

23 గ్రామాలు సీల్ డౌన్

ఒమన్ నుంచి బీహార్ తిరిగి వచ్చిన వ్యక్తి శివన్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో సంచరించాడని అధికారులు గుర్తించారు. అతను సంచరించిన 43 గ్రామాలు సీల్ డౌన్ ప్రకటించామని బీహార్ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ తెలిపారు. ఒమన్ నుంచి వచ్చిన వ్యక్తి సంచరించిన శివన్ జిల్లాతో పాటు బెగుసారై, నవాడా జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువ కావడంతో ఆ జిల్లాల సరిహద్దులను అధికారులు మూసివేశారు. మొత్తం మీద బీహార్ లో ఒక్కడి వలన 23 మందికి కరోనా వైరస్ సోకడంతో అతనితో సంబంధాలు ఉన్న వ్యక్తులు, స్థానిక గ్రామ ప్రజలు హడలిపోతున్నారు.

  Lockdown : Trains Likely To Available From 15th April
  దండం పెడుతున్న సీఎం

  దండం పెడుతున్న సీఎం

  విదేశాల నుంచి బీహార్ వచ్చిన ప్రతి ఒక్కరు స్వచ్చందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని, మీ వలన ఇతరులకు వ్యాధి వ్యాపించకుండా చెయ్యడానికి మీరు మాకు సహకరించాలని, మీ ప్రాణాలతో పాటు ప్రతి ఒక్కరి ప్రాణం చాలా విలువైనదని, దయచేసి సహకరించాలని, మీకు చేతులు ఎత్తి దండం పెట్టి వేడుకుంటున్నానని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ రాష్ట్ర ప్రజలకు మనవి చేశారు.

  English summary
  Coronavirus: Nearly a third of Bihar's 60 coronavirus cases have been reported from one family in Siwan district, a COVID-19 hotspot about 130 km from state capital Patna. The chain of infection started with one man who returned from Oman last month.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more