వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: కులం, మతం వద్దు.. ఐకమత్యంగా వైరస్‌పై యుద్ధం చేద్దాం, గెలుపు మనదే: రాహుల్ గాంధీ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌ను భారతీయులంతా కలిసికట్టుగా ఎదుర్కొని పారద్రోలాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించొచ్చని ఉదహరించారు. కరోనా వైరస్‌ను అరికట్టడం కూడా ఈజీ అని పేర్కొన్నారు. కరోనా రక్కసిపై పోరాడాల్సిన సమయంలో కులం, మతం పేరుతో విభజన చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

వైరస్‌పై భారత జాతి కలిసికట్టుగా పోరాడుతోందని చెప్పారు. కులం, మతం, తరగతి, అంతరం అనే చూడొద్దని రాహుల్ గాంధీ కోరారు. అంతా ఐకమత్యంతో ముందుకుసాగి.. కరోనా రక్కసిని పారద్రోలుదామన్నారు. కరుణ, దాతృత్వం, స్వీయ నియంత్రణతోనే వైరస్‌ను పారదొలచ్చు అని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. అందరూ కలిసి నడిస్తే.. కరోనా వైరస్‌ను జయించొచ్చు అని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.

Covid-19 an opportunity for India to unite as one: rahul gandhi

కరోనా వైరస్ నేపథ్యంలో రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్దరామయ్య ప్రభుత్వాన్నికోరారు. రైతులతోపాటు రైతు కూలీలను కూడా ఆదుకోవాలని సీఎం యడియూరప్పకు రిక్వెస్ట్ చేశారు. మరోవైపు యూపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం 16 పాజిటివ్ కేసులు నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 294కి చేరుకున్నది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు సంఖ్య 4 వేల 200 మార్క్ దాటగా.. చనిపోయిన వారి సంఖ్య 100కి పైగా చేరింది.

English summary
coronavirus is an opportunity for India to unite as one people, putting aside differences of religion, caste & class Congress leader Rahul Gandhi said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X