వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయుష్ మంత్రికి కరోనా పాజిటివ్ - హోం ఐసోలేషన్ లో శ్రీపాద్ నాయక్

|
Google Oneindia TeluguNews

నరేంద్ర మోదీ కేబినెట్ లో మరో మంత్రికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, అర్జున్ రామ్ మేఘావాల్ తదితరులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. ఇప్పుడు ఏకంగా కేంద్ర ఆయుర్వేద, యోగా, నేచరోపతి, యునాని, సిద్ధ, హోమియో(ఆయుష్) శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ పాజిటివ్ గా తేలారు.

మిగతా కేంద్ర మంత్రులకు భిన్నంగా ఆయుశ్ మంత్రి శ్రీపాద్ నాయక్ కరోనా లక్షణాలేవీ లేకుండానే పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. ''ఇవాళ కొవిడ్ టెస్టులు చేయించుకున్నాను. లక్షణాలు లేకున్నా పాజిటివ్ అని వచ్చింది. ఎలాంటి అనారోగ్యం లేదు కాబట్టి హోం ఐసోలేషన్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. గడిచిన కొద్ది రోజులుగా నాతో కాంటాక్ట్ లోకి వచ్చినవాళ్లంతా దయచేసి జాగ్రత్తలు తీసుకోండి'' అని మంత్రి ట్వీట్ చేశారు.

ఈసీ సంచలన నిర్ణయం - షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు - సీఎంకు అసలైన 5 సవాళ్లివే..ఈసీ సంచలన నిర్ణయం - షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు - సీఎంకు అసలైన 5 సవాళ్లివే..

covid-19: AYUSH Minister Shripad Naik tests positive for coronavirus

కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 60,963 కేసులు, 834 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23.30 లక్షలకు, మరణాల సంఖ్య 46,091కు పెరిగింది. 70.38 శాతం రికవరీ రేటుతో ఇప్పటికే 16.4లక్షల మంది వ్యాధి నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6.43లక్షలుగా ఉంది.

English summary
Union Minister of State for AYUSH Shripad Y. Naik on Wednesday announced he has tested positive for Covid-19. He said he's going into home isolation because he's asymptomatic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X