• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bed Blocking: కిలాడి నేత్రావతి అందర్, ఒక్క బెడ్ రూ. 50 వేలు, ఆంటీ డీల్, ఎంపీ ఎంట్రీతో ?

|

బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో ఎక్కడ మా ప్రాణాలు పోతాయే అనే ఆందోళనతో ఉంటున్న రొగులను క్యాష్ చేసుకోవడానికి కొత్తకొత్త దందాలు మొదలౌతున్నాయి. ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ లు బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తూ అనేక మంది దళారులను పోలీసులకు పట్టుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఐసీయూ బెడ్ బ్లాకింగ్ దందాలోని ముఠా సభ్యులను స్వయంగా అధికార పార్టీకి చెందిన ఎంపీ పట్టుకుని పోలీసులకు అప్పగించడం కలకలం రేపింది. అధికార పార్టీ ఎంపీతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారుల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చెయ్యడంతో సీఎంతో పాటు కరోనా వార్ రూమ్ ఇన్ చార్జ్ మంత్రి సైతం ఉలిక్కిపడ్డారు. అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల దెబ్బతో బెడ్ బ్లాకింగ్ కింగ్ పిన్ నేత్రావతి ఆంటీ అండ్ కో కేసు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల చేతికి వెళ్లిపోయింది.

Lady techie: జెండా ఎత్తేసిన మొగుడు, యూఎస్ కంపెనీ ఫ్రెండ్, ఏకంగా రూ. 10 లక్షలు, మూడు !Lady techie: జెండా ఎత్తేసిన మొగుడు, యూఎస్ కంపెనీ ఫ్రెండ్, ఏకంగా రూ. 10 లక్షలు, మూడు !

బెంగళూరులో ఇది సీన్

బెంగళూరులో ఇది సీన్


ఐటీ హబ్ బెంగళూరు సిటీలో పుట్టగొడుగుల్లా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పుట్టుకొస్తున్నాయి. నిత్యం వేల సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆరోగ్య శాఖ అధికారులతో పాటు సామాన్య ప్రజలు హడలిపోతున్నారు. బెంగళూరులో కోవిడ్ లక్షణాలు ఉన్న రోగులు ఆసుపత్రిలో బెడ్ చిక్కితే చాలు దేవుడా అంటూ భగవంతుడిని వేడుకుంటున్నారు.

బీబీఎంపీ- ప్రైవేట్ ఆసుపత్రుల డీల్

బీబీఎంపీ- ప్రైవేట్ ఆసుపత్రుల డీల్

బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP) పరిధిలోని 198 వార్డుల్లో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే వారిని ఆసుపత్రులకు తరలించడానికి బీబీఎంపీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్ లు కోవిడ్ రోగులకు కేటాయించాలని ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం, కర్ణాటక ప్రభుత్వం, బీబీఎంపీ ఓ ఒప్పందం కుదుర్చుకుంది.

ఎంపీ తేజస్వి సూర్య ఎంట్రీతో సీన్ సిడేల్

ఎంపీ తేజస్వి సూర్య ఎంట్రీతో సీన్ సిడేల్

బెంగళూరు దక్షిణ లోక్ సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యా బెడ్ బ్లాకింగ్ దందాను పట్టుకోవడానికి ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. మంగళవారం జయనగర 5వ బ్లాక్ లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యా, బీజేపీ ఎమ్మెల్యేలు సతీష్ రెడ్డి, రవిసుబ్రమణ్య, ఉదయ్ గరుడాచార్ మీడియాతో మాట్లాడుతూ కరోనా రోగుల బెడ్ లు ఎలా బ్లాక్ లో అమ్ముడుపోతున్నాయో అంటూ వివరిస్తు కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని కూడా లెక్క చెయ్యకుండా ప్రభుత్వ అధికారుల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

 కిలాడీ నేత్రావతి అండ్ టీమ్

కిలాడీ నేత్రావతి అండ్ టీమ్

బెంగళూరులోని బేగూరులో నివాసం ఉంటున్న నేత్రావతి అలియాస్ నేత్రా (42) స్వచ్చంద సంస్థ కార్యకర్త అంటూ తిరుగుతోంది. నేత్రావతి పక్కింటిలోనే నివాసం ఉంటున్న రోహిత్ కుమార్ అలియాస్ రోహిత్ (32) అనే యువకుడితో పాటు కొందరు నేత్రావతితో జతకలిశారు. బీబీఎంపీ ఆధీనంలో ఉండే ఆసుపత్రుల్లోని బెడ్ లు, ఐసీయూ బెడ్ లు వారికి కావలసిన వారి పేర్లతో బ్లాక్ చేసి తరువాత కోవిడ్ రోగుల బంధువులు ఒక్కొక్కరి నుంచి రూ. 50 వేలకు పైగా వసూలు చేసి వారికి బెడ్ లు కేటాయిస్తున్నారని వెలుగు చూసింది. కోవిడ్ రోగుల కోసం సహాయం చేస్తున్నామని నేత్రావతి ఇప్పటికే ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఈ దందా మొదలుపెట్టిందని వెలుగు చూసింది.

చిత్రాంగి అండ్ కో అరెస్టు

చిత్రాంగి అండ్ కో అరెస్టు

కరోనా బెడ్ లు బ్లాక్ చేసి బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్న నేత్రావతి, రోహిత్ కుమార్ లను స్వయంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యా పట్టుకుని బెంగళూరులోని జయనగర పోలీసులకు అప్పగించారు. నేత్రావతి, రోహిత్ కుమార్ అకౌంట్ లో ఉన్న సుమారు రూ. 1. 05 లక్షలను అధికారులు గుర్తించారు. నేత్రావతి టీమ్ లోని కొందరు తప్పించుకున్నారని పోలీసులు అంటున్నారు.

 ఒక్క బెడ్ రూ. 50 వేలు !

ఒక్క బెడ్ రూ. 50 వేలు !

బీబీఎంపీ ఆరోగ్య శాఖ ఉద్యోగులు, కొందరు కోవిడ్ వార్ రూమ్ సిబ్బందితో కలిసి నేత్రావతి బెడ్ లు బ్లాక్ చేసి ఒక్కొక్క ఐసీయూ బెడ్ ను రూ. 50 వేలకు పైగా విక్రయించి రోగులకు కేటాయిస్తోందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. నేత్రావతికి సహకరించిన బీబీఎంపీ సిబ్బంది, కోవిడ్ వార్ రూమ్ లోని సిబ్బందికి ఇప్పుడు కింద తడిచిపోతాఉందని తెలిసింది.

 కేసు క్రైమ్ బ్రాంచ్ కు: సిటి పోలీసు కమీషనర్

కేసు క్రైమ్ బ్రాంచ్ కు: సిటి పోలీసు కమీషనర్


బెంగళూరులో కరోనా రోగులను టార్గెట్ చేసుకుని బెడ్ బ్లాక్ దందా నిర్వహిస్తూ అరెస్టు అయిన వారి కేసును బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అప్పగిస్తామని, తప్పు చేసిన వాళ్లు ఎవరైనా సరే కచ్చితంగా అరెస్టు చేస్తామని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కమల్ పంత్ స్పష్టం చేశారు. బెంగళూరులో అధికార పార్టీ ఎంపీ బెడ్ బ్లాక్ దందా వ్యవహారం బయటపెట్టడం బీజేపీలో కలకలం రేపింది. బెడ్ బ్లాక్ దందాలో అరెస్టు అయిన నేత్రావతి అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఇప్పుడే విడుదల కావడం కలకం రేపింది.

English summary
COVID-19 Bed blocking scam: Case transferred to CCB for investigation says Bengaluru police commissioner Kamal Pant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X