బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus patientsకు చికిత్స : బెంగళూరులో వైద్యుల ఇండ్లు ఖాళీ చేయించి, రోడ్ల మీదకు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) వ్యాధిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేశారు. కరోనా వైరస్ వ్యాధి సోకిన రోగులకు వైద్యులు, వైద్య సిబ్బంది పగలు, రాత్రి అనే తేడా లేకుండా రోజుకు 24 గంటలు చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి వైద్యులు నివాసం ఉండటానికి వీలులేదని, వెంటనే ఇండ్లు ఖాళీ చెయ్యాలని, ఎక్కడ మీ వలన మాకు కరోనా వైరస్ వ్యాధి సోకుతుందో అనే భయంగా ఉందని కొందరు ఇంటి యజమానులు డాక్టర్లకు చెప్పారు. బెంగళూరు నగరంలో విక్టోరియా ఆసుపత్రి (ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి)లో కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్స చేస్తున్న వైద్యుల ఇండ్లను ఖాళీ చేయించడంతో వారు రోడ్ల మీద పడటంతో కలకలం రేపింది.

Coronavirus: ఢిల్లీ జమాత్ మీటింగ్ కు 9 వేల మంది, వైరస్ చైన్ లింక్: ఆంధ్రా, తెలంగాణలో !Coronavirus: ఢిల్లీ జమాత్ మీటింగ్ కు 9 వేల మంది, వైరస్ చైన్ లింక్: ఆంధ్రా, తెలంగాణలో !

 బెంగళూరులో కరోనా చికిత్స !

బెంగళూరులో కరోనా చికిత్స !

కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాధి కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బెంగళూరు నగరంలో కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా కర్ణాటక ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ వ్యాధి సోకిన అనుమానితులకు బెంగళూరు నగరంలోని అనేక ఆసుపత్రుల్లోని క్వారంటైన్ లో చికిత్స అందిస్తున్నారు.

 వికోర్టియా ఆసుపత్రిలో ఇలా !

వికోర్టియా ఆసుపత్రిలో ఇలా !

బెంగళూరు నగరంలోని కేఆర్ మార్కెట్ ( సిటీ మార్కెట్) సమీపంలో విక్టోరి ఆసుపత్రి ఉంది. బ్రిటీష్ కాలం నాటి ఈ విక్టోరియా ఆసుపత్రి నిర్వహణా భాద్యతలను కర్ణాటక ప్రభుత్వం చూసుకుంటోంది. బెంగళూరు నగరంతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన రోగులు విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందడానికి ప్రతినిత్యం వస్తుంటారు

 విక్టోరియాలో కరోనా క్వారంటైన్ కేంద్రాలు

విక్టోరియాలో కరోనా క్వారంటైన్ కేంద్రాలు

బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలోని ప్రత్యేక క్వారంటైన్ లలో కరోనా వైరస్ వ్యాధి సోకిందనే అనుమానితకులకు చికిత్స అందిస్తున్నారు. విక్టోరియా ఆసుపత్రిలో పని చేస్తున్న కొందరు వైద్యులు నగరంలోని ఇతర ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు. విక్టోరియా ఆసుపత్రిలోని కరోనా క్వారంటైన్ కేంద్రాల్లోని రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఎప్పటిలాగే వారి ఇళ్లకు వెళ్లి వస్తున్నారు.

 మర్యాదగా ఇండ్లు ఖాళీ చెయ్యండి !

మర్యాదగా ఇండ్లు ఖాళీ చెయ్యండి !

బెంగళూరులో ఇంత కాలం వైద్యులకు ఇండ్లు అద్దెకు ఇస్తే అదో పెద్ద హోదాగా బావించిన కొందరు ఇంటి యజమానులు ఇప్పుడు కరోనా వైరస్ భయంతో వైద్యులను చూస్తేనే హడలిపోతున్నారు. తమ ఇండ్లలో అద్దెకు ఉంటున్న వైద్యులు కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తున్నారని, ఎక్కడ ఆ వ్యాధి ఆ డాక్టర్ల కారణంగా మాకు వ్యాపిస్తుందో అని ఇంటి యజమానులకు భయం పట్టుకుంది. వెంటనే మర్యాదగా ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అద్దెకు ఉంటున్న వైద్యులను ఇళ్ల యజమానులు హెచ్చరించారు.

 రోడ్డున పడిన వైద్యులు

రోడ్డున పడిన వైద్యులు

కరోనా వైరస్ భయంతో బెంగళూరు నగరంలో వైద్యులుగా పని చేస్తున్న 8 మంది కుటుంబ సభ్యులను వారి ఇంటి యజమానులు ఇండ్లు ఖాళీ చేయించారు. రోడ్డున పడిన వైద్యులను ఆదుకోవడానికి నమ్మ బెంగళూరు ఫౌండేషన్ (NBF) సంస్థ ముందుకు వచ్చింది. ఇండ్లు ఖాళీ చేసి రోడ్డున పడిన వైద్యులను బెంగళూరులోని డి-ఓరియల్ హోటల్ కు తరలించారు. ప్రాణాలకు తెగించి కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు ప్రస్తుతం తాత్కాలికంగా హోటల్ లో ఉంటున్నారని, వారిని తాము అన్ని విదాలుగా ఆదుకుంటామని నమ్మ బెంగళూరు పౌండేషన్ సంస్థ జనరల్ మేనేజర్ హరీష్ కుమార్ అంటున్నారు. ఇప్పటికే నమ్మ బెంగళూరు పౌండేషన్ ఆధ్వర్యంలో 8, 305 మంది నిరుపేదలు, రోడ్డున పడిన వలస కూలి కార్మికులు, భిక్షగాళ్లకు ఆహారం, నిత్యవసర వస్తువులు అందిస్తున్నారు.

English summary
COVID 19: Coronavirus In Karnataka:NBF Accommodation For Corona Patients Serving Doctors In Bengaluru. 8 doctors vacate the rented homes ahead of coronavirus patients serving.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X