• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా షాకింగ్: దేశంలో రెండో దశ ఉత్పాతం - అంచనా వేయలేమన్న ఐసీఎంఆర్ - భిన్నంగా వైరస్ తీరు..

|

కరోనా పాజిటివ్ కొత్త కేసుల విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ దేశమైన అమెరికాను సైతం భారత్ అధిగమించింది. గడిచిన వారం రోజులుగా 50 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. జులై 30(గురువారం) కొత్తగా 52,123 కేసులు, జులై 31(శుక్రవారం) 55,078, ఆగస్టు 1న(శనివారం) అత్యధికంగా 57,118, ఆగస్టు 2(ఆదివారం) 54,736 కొత్త కేసులు నమోదుకాగా, సోమవారం వెల్లడైన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో అమెరికాలో(49,038) కంటే ఇండియాలో(52,783) కొత్త కేసులు అధికంగా నమోదయ్యాయి. దీంతో దేశంలో రెండో దశ ఉత్పాతం మొదలైందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) అనూహ్య ప్రకటన చేసింది.

షాకింగ్: కరోనాతో బలవంతపు కాపురమే - దశాబ్దాలపాటు వైరస్ ప్రభావం - WHO సంచలన ప్రకటన..

కష్టంగా సెకండ్ వేవ్ అచనాలు..

కష్టంగా సెకండ్ వేవ్ అచనాలు..

గడిచిన వారం రోజులుగా కొత్త కేసులు భారీగా నమోదువుతున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ చీఫ్, ప్రముఖ సైంటిస్టు డాక్టర్ బలరాం భార్గవ సోమవారం మీడియాతో మాట్లాడుతూ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా రెండో దశ ఉత్పాతం ఇప్పటికే మొదలైందా? లేక సమీపకాలంలో రాబోతోందా? అనే విషయాన్ని అంచనా వేయడం కష్టతరంగా మారిందని భార్గవ చెప్పారు. భౌగోళికంగా పెద్దదైన భారత్ లో వైరస్ ఒక్కో చోట ఒక్కోలా వ్యవహరిస్తుండం, కేసులు, మరణాల ఉధృతి వేర్వేరు ప్రాంతాల్లో భిన్నంగా ఉంటుండటం వల్లే ఓవరాల్ గా సెకండ్ వేవ్ గురించి కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదని తెలిపారు.

ఇప్పటికివే కీలక అంశాలు..

ఇప్పటికివే కీలక అంశాలు..

‘‘SARS-CoV-2 అనేది ఓ నావెల్ వైరస్. దీని గురించి మనకు ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉంది. వివిధ భౌగోళిక పరిస్థితుల్లో అది భిన్నంగా ప్రవర్తిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సంక్రమిస్తున్న తీరు, మరణాల రేటులో చాలా వైవిధ్యాలున్నాయి. మన దేశంలో పక్కపక్క రాష్ట్రాల్లోనే కరోనా పరిస్థితులు వేర్వేరుగా ఉన్నాయి. కాబట్టి సెకండ్ వేవ్ గురించి నిర్దిష్టంగా చెప్పలేం. కోవిడ్ -19పై పోరాటంలో సైంటిఫిక్ అధ్యయనాల కంటే ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యం. ఫిజికల్ డిస్టెన్స్ నియమాలు, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత అత్యంత కీలకమైన అంశాలు ''అని ఐసీఎంఆర్ చీఫ్ వ్యాఖ్యానించారు.

విదేశాలకు దీటుగా మనం..

విదేశాలకు దీటుగా మనం..

దేశంలో తొలి కేసు నమోదైన జనవరి నుంచి కరోనా పరిస్థితిని ఐసీఎంఆర్ పర్యవేక్షిస్తున్నదని, ప్రపంచ దేశాలకు దీటుగా కరోనాపై తొలి దశలోనే పుణె వైరాలజీ ల్యాబ్ లో కీలక ప్రయోగాలు చేపట్టామని, మారుతోన్న వైరస్ తీరుతెన్నులపై ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తునే, వ్యాక్సిన్ ప్రయోగాలకూ ప్రాధాన్యం ఇచ్చామని బలరాం భార్గవ తెలిపారు. కోవిడ్ -19 కంటే ముందే.. వ్యాధులపై ప్రయోగాల కోసం ఐసీఎంఆర్..10 ఆగ్నేయాసియా దేశాలతో కలిసి పరిశోధనలకు నడుం బిగించిందని గుర్తుచేశారు. కరోనా ఉధృతి తగ్గిన తర్వాత దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వసతుల్లో టీబీ, హెచ్ఐవీ, హెపటైటిస్-బి తదితర వ్యాధులపై ప్రయోగాల్ని కొనసాగిస్తామని ఐసీఎంఆర్ చీఫ్ పేర్కొన్నారు.

పండుగ పూట జగన్ సర్కారుకు శవయాత్ర - బీజేపీ వెన్నుపోటు, పవన్ నాయకత్వం - పద్మశ్రీ సంచలనం

  #AmitabhBachchan : కరోనా నుంచి కోలుకున్న Amitabh Bachchan! || Oneindia Telugu
  2కోట్ల టెస్టులు.. 18లక్షల కేసులు..

  2కోట్ల టెస్టులు.. 18లక్షల కేసులు..

  కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ సోమవారం తెలిపిన వివరాల ప్రకారం దేశంలో ఇప్పటిదాకా 2కోట్లపైచిలుకు శాంపిళ్లను పరీక్షించారు. సోమవారం నాటి 52,783 కేసుల్ని కలుపుకొంటే మొత్తం కేసుల సంఖ్య 18.22లక్షలకు చేరింది. ఇప్పటిదాకా కరోనా బారినపడి 38,400 మంది చనిపోయారు. అయితే ఇండియా డెత్ రేటు(2.12శాతం) ప్రపంచ యావరేజ్(4శాతం)కంటే తక్కువ ఉండటం గమనార్హం. దాదాపు 65 శాతం రికవరీ రేటుతో 12లక్షల మంది ఇప్పటికే వ్యాధి నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 5.8లక్షలుగా ఉంది.

  English summary
  ICMR chief Dr Balram Bhargava said has said that it is difficult to predict whether or not India will see a second wave of COVID-19 infections and there will be smaller peaks at different times due to varied geography of the country.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X