వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా పంజా: లాక్‌డౌన్ ముగింపు వేళ.. తొమ్మిదివేలకు పైగా: టాప్-5లో తెలంగాణ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఉద్దేశించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ ముగింపు దశకు వచ్చిన వేళ.. 130 కోట్ల మంది భారతీయులు 21 రోజుల పాటు స్వీయ గృహనిర్బంధంలో కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. కరోనా వైరస్ తీవ్రత తగ్గట్లేదు. లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. మూడు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 308కి చేరింది.

మారిన మోడీ స్వరం: ఇక స్మార్ట్ లాక్‌డౌన్ దిశగా: మూడు జోన్లుగా: నేడు ప్రకటించే ఛాన్స్మారిన మోడీ స్వరం: ఇక స్మార్ట్ లాక్‌డౌన్ దిశగా: మూడు జోన్లుగా: నేడు ప్రకటించే ఛాన్స్

 మూడు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా

మూడు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా

కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ.. పాజిటివ్ కేసుల సంఖ్యలో ఏ మాత్రం తగ్గుదల కనిపించట్లేదు. రోజురోజుకూ వాటి సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత అత్యధికంగా ఉంటోంది. ఈ ఒక్క రాష్ట్రంలోనే 1982 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడు, ఢిల్లీల్లో వెయ్యికి పైగా కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో 1154, తమిళనాడులో 1075 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

టాప్-5లో తెలంగాణ..

టాప్-5లో తెలంగాణ..

కరోనా వైరస్ తీవ్రత, అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదువుతోన్న తొలి అయిదు రాష్ట్రాల్లో తెలంగాణ చేరింది. ఈ జాబితాలో అయిదో స్థానంలో నిలిచింది తెలంగాణ. తెలంగాణ కంటే ముందు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన కోవిడ్19 ఇండియా.ఆర్గ్ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం.. తెలంగాణలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 531. మహారాష్ట్ర-1982, మధ్యప్రదేశ్-562, ఢిల్లీ-1154, గుజరాత్-516 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

అయిదు రోజుల్లో లక్షా 95 వేల మందికి పరీక్షలు..

అయిదు రోజుల్లో లక్షా 95 వేల మందికి పరీక్షలు..

అయిదు రోజుల్లో 1,95,748 మందికి వైద్య పరీక్షలను నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. రోజూ సగటున 15,747 మందికి పరీక్షలను చేశామని పేర్కొంది. సగటున రోజూ 584 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందుజాగ్రత్తగా లాక్‌డౌన్‌ను విధించడం వల్ల కొంత మేలు జరిగిందని అంటున్నారు.

మహారాష్ట్రలో ఒక్కరోజే 16 మంది

మహారాష్ట్రలో ఒక్కరోజే 16 మంది


మహారాష్ట్రలో ఒక్కరోజు వ్యవధిలోనే 16 మంది కరోనా వైరస్ బారిన పడి మరణించడం కలకలం రేపుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం మొదలైన తరువాత మహారాష్ట్రలో ఈ స్థాయిలో మరణాల సంఖ్య నమోదు కావడం ఇదే తొలిసారి. పాజిటివ్ కేసుల సంఖ్య 2000కు చేరువ అవుతుండటం, వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల మరిన్ని మరణాలు నమోదయ్యే ప్రమాదం ఉందనే ఆందోళనలు మహారాష్ట్రలో వ్యక్తమౌతున్నాయి.

English summary
The total count of people affected by the novel coronavirus has reached 9,152. The death toll now cross 300 mark and stand at 308. On a brighter side, more than 800 people have been cured till now. Maharashtra remain worst affected as 217 new positive COVID-19 cases and 16 deaths reported in Mumbai yesterday. However, Tamil Nadu became 3rd state after Maharashtra and Delhi to report 1000 plus coronavirus cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X