వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా లాక్ డౌన్: ఆగస్టు 6 వరకు పొడగింపు - వైరస్ విజృంభణతో ఛత్తీస్ సర్కారు నిర్ణయం

|
Google Oneindia TeluguNews

రాబోయే రోజుల్లో కరోనా మహమ్మారి ఇంకా విజృంభించబోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే మన దేశంలో మొత్తం కేసులు 15లక్షలకు చేరువైంది. అయినాసరే, మరిన్ని సడలింపులు కల్పిస్తూ, కేంద్ర సర్కారు అన్ లాక్ 3.0 మార్గదర్శకాలు రూపొందిస్తున్న సమయంలో.. చిన్నరాష్ట్రాల్లో ఒకటైన ఛత్తీస్ గఢ్ మాత్రం భిన్న నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పెద్ద నగరాల్లో లాక్ డౌన్ ను ఆగస్టు 6 వరకు పొడిగించింది.

కరోనా భయంతో కారు రాంగ్ టర్న్ - గర్భిణి సింధు రెడ్డి విషాదాంతం - తుంగభద్రలో మృతదేహం లభ్యం..కరోనా భయంతో కారు రాంగ్ టర్న్ - గర్భిణి సింధు రెడ్డి విషాదాంతం - తుంగభద్రలో మృతదేహం లభ్యం..

ముఖ్యమంత్రి భూపేశ్ భాగేల్ అధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు తీసుకున్న నిర్ణయాలను వ్యవసాయ మంత్రి రవీంద్ర చౌబే మీడియాకు వివరించారు. రాష్ట్ర రాజధాని రాయ్ పూర్ సహా బిలాస్ పూర్, దుర్గ్, రాజ్ నానద్ గావ్, కోర్బా, అంబికాపూర్ తదితర పెద్ద నగరాలు, పట్టణాల్లో ఆగస్టు 6 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు చౌబే చెప్పారు.

 covid-19: Chhattisgarh extends lockdown in major cities till Aug 6 amid rise in cases

ఛత్తీస్ గఢ్ లోని మొత్తం 28 జిల్లాలకూ వైరస్ విస్తరించగా, ఇప్పటిదాకా(శనివారం రాత్రి వరకు) మొత్తం 7,623 కేసులు నమోదయ్యాయి. అందులో 5వేల పైచిలుకు కేసులు గడిచిన నెల రోజుల్లోనే వెలుగు చూడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మొత్తం కేసుల్లో 4,944 మంది ఇప్పటికే వ్యాధి నుంచి కోలుకోగా, 43మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2,626గా ఉంది.

పుట్టినరోజునాడే సీఎంకు వరుస పంచ్‌లు - డిప్యూటీ చేతిలో 'స్టీరింగ్’ - ఆగ్రహంగా వీహెచ్‌పీ - మోదీ ఒక్కరేపుట్టినరోజునాడే సీఎంకు వరుస పంచ్‌లు - డిప్యూటీ చేతిలో 'స్టీరింగ్’ - ఆగ్రహంగా వీహెచ్‌పీ - మోదీ ఒక్కరే

దేశమంతా అన్ లాక్ 3.0 దిశగా అడుగులు వేస్తున్నవేళ కరోనా లాక్ డౌన్ ను పొడిగిస్తూ ఛత్తీస్ గఢ్ సర్కారు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేసుల సంగతి ఎలా ఉన్నా మరోసారి దేశవ్యాప్త లాక్ డౌన్ విధించబోమని ఇదివరకే స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం.. పరిస్థితి తీవ్రత దృష్ట్యా రాష్ట్రాలే లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఛత్తీస్ గఢ్ బాటలో మరికొన్ని రాష్ట్రాలూ లాక్ డౌన్ పొడగింపును ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

English summary
The Chhattisgarh government on Monday extended the ongoing lockdown period in major cities till August 6 amid a surge in Covid-19 cases. The decision was taken at a cabinet meeting headed by chief minister Bhupesh Baghel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X