వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా సంక్షోభం: ఎన్95 మాస్కుల ధరలను 250శాతం పెంచేశారు!, పట్టని ప్రభుత్వాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి సంక్షోభ సమయంలో కరోనా కట్టడికి ఉపయోగపడే ఎన్95 మాస్కుల ధరలు గత నాలుగు నెలల్లోనే 250శాతం పెరగడం గమనార్హం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేసిన మాస్కులు గత సెప్టెంబర్ నుంచి 2020, మే మధ్య కాలం వరకు ధరల పెరుగుదల నమోదైంది.

సెప్టెంబర్ నుంచి పెరుగుతూనే...

సెప్టెంబర్ నుంచి పెరుగుతూనే...

ధరల నియంత్రణ సంస్థ రెగ్యూలేటర్ నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్‌పీపీఏ) మాస్కుల ధరలను కట్టడి చేసేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది దేశీయ తయారీలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రభుత్వం పన్నులతో కలిపి రూ. 12.25కు ఒక మాస్కును కొనుగోలు చేసింది. జనవరి 2020లో ఈ మాస్కు ధర 17.33కు చేరింది. మార్చి 31 నాటికి ఈ మాస్కు ధర రూ. 42కు చేరింది. ఇక మే నెల మధ్య కాలం నాటికి రూ. 63కు చేరడం గమనార్హం. ఈ మేరకు వివరాలను టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో వెల్లడించింది.

450-850శాతం ఎక్కువ..

450-850శాతం ఎక్కువ..

దేశీయ వ్యాపార సంస్థలు ఉత్పత్తి చేస్తున్న ఎన్95 మాస్కులపై ధరల నియంత్రణ విధించింది. రూ. 95 నుంచి రూ. 165 మేర ధరల వరకు నియంత్రించింది. జనవరి 2020 నాటికి తగ్గించిన ధరల కంటే 450-850శాతం మేర ఎక్కువగా ఉంది. ఇండియాలో మాస్కుల తయారీ దిగ్గజాలైన మాగ్నమ్, వీనస్ సేఫ్టీ సంస్థలతోపాటు ఎన్95 మాస్కుల తయారీ సంస్థలు ఈ మాస్కుల ధరలు నిర్ణయిస్తున్నట్లు తెలిసింది.

అందుబాటులో ధరల్లోనే విక్రయించాలని.. 47శాతం తగ్గింపు

అందుబాటులో ధరల్లోనే విక్రయించాలని.. 47శాతం తగ్గింపు

అయితే, మే 21 నుంచి ప్రజలకు మాస్కులను అందుబాటు ధరలోనే విక్రయించాలని ఎన్‌పీపీఏ స్పష్టం చేసింది. 47శాతం మాస్కుల ధరలను తగ్గించినట్లు ఎన్‌పీపీఏ చెబుతున్నప్పటికీ.. ఒక్క ఎన్95 మాస్కుల ధరలను మాత్రమే తగ్గించినట్లు తెలుస్తోంది. ఇతర మాస్కులు మాత్రం 23-41శాతం మాత్రమే ధరలను తగ్గించాయి.

Recommended Video

Arvind Kejriwal Takes Coronavirus Test, Reports Expected Tonight
ప్రభుత్వంపై కోట్లాది రూపాయల భారం..

ప్రభుత్వంపై కోట్లాది రూపాయల భారం..

కేంద్రం 1.15 కోట్ల ఎన్95 మాస్కులను కొనుగోలు చేయగా, ఎక్కువగా వీనస్ సేఫ్టీ నుంచి ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ అయిన హిల్ లైఫ్ కేరర్ ద్వారా విక్రయాలు సాగించింది. సుమారు కోటి మాస్కులు ఇంకా డెలివరీ కావాల్సి ఉంది. హిల్ లైఫ్‌కేర్ ఈ మాస్కులను రూ. 60, పన్నులతో కొనుగోలు చేస్తోంది. దీంతో రూ. 20 ఎక్కువగా అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై కోట్లాది రూపాయలు భారం పడుతోందని తెలుస్తోంది.

English summary
The price of N95 respirator masks bought by government agencies in September has shot up over 250% in four months from September 2019 till the middle of May 2020, yet the price regulator National Pharmaceutical Pricing Authority (NPPA) has decided not to put a price ceiling on the same saying it "may disincentivise domestic manufacturing."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X