వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ప్రపంచం: అత్యధిక మరణాలు, కొత్త కేసులతో రికార్డుల్లోకెక్కిన భారత్, ఇదీ లెక్క

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి భారతదేశంలోనూ తన విజృంభణ కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మూడు లక్షల మందికిపైగా ప్రాణాలు తీసిన ఈ మహమ్మారి.. మనదేశంలోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా మనదేశంలో కొత్త కేసులు, మరణాలు అత్యధికంగా నమోదవుతుండటం ఆందోళనకరంగా మారింది.

ఆరోజే అత్యధిక కేసులు

ఆరోజే అత్యధిక కేసులు

భారతదేశంలో గురువారం ఒక్కరోజే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు సంభవించడం గమనార్హం. జులై 4న దేశ వ్యాప్తంగా 9889 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అదే రోజు మరణాలు కూడా ఎక్కువే..

అదే రోజు మరణాలు కూడా ఎక్కువే..

జులై 4న మనదేశంలో మరణాలు కూడా అత్యధికంగా సంభవించాయి. గురువారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 275 మరణాలు చోటు చేసుకున్నాయి.

అత్యధిక పాజిటివ్ కేసుల జాబితాలో భారత్..

అత్యధిక పాజిటివ్ కేసుల జాబితాలో భారత్..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ఏడవ స్థానానికి చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులతో యూఎస్ఏ మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత బ్రెజిల్, రష్యా, స్పెయిన్, యూకే, ఇటలీ ఉన్నాయి. 2,26,713 కరోనా పాజిటివ్ కేసులతో ఇటలీ తర్వాత స్తానానికి భారత్ చేరింది.

కొత్త కరోనా కేసుల జాబితాలో ముందుకు..

కొత్త కరోనా కేసుల జాబితాలో ముందుకు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కొత్త కేసులు అత్యధికంగా నమోదువుతున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానానికి చేరుకోవడం గమనార్హం. 31,890 కొత్త కేసులతో బ్రెజిల్ తొలి స్థానలో ఉండగా, 22,268 కేసులతో అమెరికా రెండో స్థానంలో ఉంది. ఇక 9889 కొత్త కరోనా కేసులతో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది.

అత్యధిక మరణాల జాబితాలో..

అత్యధిక మరణాల జాబితాలో..

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా మరణాలు సంభవించిన దేశాల జాబితాలో భారత్ 12వ స్థానంలో నిలిచింది. భారత్‌లో గురువారం నాటికి 6363 మరణాలు సంభవించాయి. 110173 మరణాలతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

కొత్తగా నమోదువున్న మరణాల్లో..

కొత్తగా నమోదువున్న మరణాల్లో..

ఇక ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న కరోనా మరణాల జాబితాలో భారత్ నాల్గవ స్థానంలోకి వెళ్లింది. బ్రెజిల్, మెక్సికో, అమెరికా తర్వాత 275 మరణాలతో భారత్ ఉంది.

Recommended Video

TTD Issued Guidlines For devotees To Visit Tirumala From June 8
కరోనా నుంచి కోలుకున్నవారి జాబితాలో టాప్-8

కరోనా నుంచి కోలుకున్నవారి జాబితాలో టాప్-8


ప్రపంచ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 8వ స్థానంలో ఉంది. భారతదేశంలో ఇప్పటి వరకు 108450 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

English summary
Covid-19: Daily new cases and daily deaths highest yesterday in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X