వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ముప్పు మిగిలేవుంది, అజాగ్రత్త వద్దు: ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనావైరస్ ముప్పు ఇంకా దేశంలో తొలగిపోలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ.. మహారాష్ట్రలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా ప్రజలు అజాగ్రత్తగా ఉండవద్దని సూచించారు.

ఈ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, కరోనా దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడంలో నిర్లక్ష్యం చేయొద్దని ప్రజలకు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తలు పాటించాలని తేల్చి చెప్పారు.

 Covid-19 danger persists, says PM Narendra Modi

డాక్టర్ బాలాసాహెబ్ విఖే పాటిల్ ఆత్మకథను ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కూడా పాల్గొన్నారు.

కాగా, దేశ వ్యాప్తంగా కొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ మహారాష్ట్రలో మాత్రం కరోనా ఉధృతి ఏమాత్రం తగ్డడం లేదు. ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి.

గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 55,342 కరోనా కేసులు, 706 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 71,75,881 చేరింది. మరణాల సంఖ్య 1,09,856కు చేరింది. ప్రస్తుతం దేశంలో 8,38,729 యాక్టివ్ కేసులున్నాయి. 62,27,296 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Recommended Video

COVID-19 : Coronavirus vaccine పై కేంద్రం ప్లాన్.. జులై నాటికి 25 కోట్ల మందికి వ్యాక్సిన్!

ఇక మహారాష్ట్రంలో ఇప్పటి వరకు 15,35,315 కరోనా కేసులు నమోదయ్యాయి.
2,12,439 యాక్టివ్ కేసులున్నాయి. 12,81,896 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
40,514 మంది కరోనా బారినపడి మరణించారు.

English summary
Noting that the Covid-19 threat still persists, Prime Minister Narendra Modi Tuesday said people should not show any laxity towards the novel coronavirus, observe social distancing norms and maintain personal hygiene till a vaccine is available.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X