వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: సముద్ర తీరంలో హౌస్ బోట్స్ లో కరోనా ఐసోలేషన్ వార్డులు, ఐడియా అదుర్స్ !

|
Google Oneindia TeluguNews

కొచ్చి: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) కట్టడికి కేంద్ర ప్రభుత్వాలు, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, హోటల్స్, రైల్వే బోగీలు, కల్యాణమండపాలతో పాటు విశాలమైన భవనాలను కరోనా క్వారంటైన్ కేంద్రాలు, కరోనా ఐసోలేషన్ వార్డులుగా మార్చేశారు. ఇప్పుడు కేరళలో ప్రపంచ ప్రసిద్ది చెందిన ప్రముఖ పర్యాటక కేంద్రం అలప్పుజ జిల్లాలో సముద్ర తీరంలో, నదీ తీరంలో విలాసవంతమైన హౌస్ బోట్స్ ను కరోనా ఐసోలేషన్ వార్డులుగా మార్చేశారు. పర్యాటకులు లేకపోవడంతో నిలిచిపోయిన విలాసవంతమైన హౌస్ బోట్స్ నేడు కరోనా ఐసోలేష్ వార్డులు తయారు చెయ్యాలని జిల్లా కలెక్టర్ ఐడియా అదుర్స్ అంటున్నారు అధికారులు.

Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!

కేరళలో కరోనా కాటు

కేరళలో కరోనా కాటు

భారతదేశంలో మొదట కరోనా కేసులు ఎక్కువగా వ్యాపించింది కేరళ రాష్ట్రంలోనే. తరువాత కేరళ ప్రభుత్వం కట్టుదిట్టమైన కఠిన చర్యలు తీసుకున్నారు. కేరళలో లాక్ డౌన్ కు వారం ముందే అన్ని విద్యాసంస్థలు మూసివేయడంతో కరోనా వైరస్ వ్యాపించడకుండా చూశారు. కేరళలో ప్రస్తుతం 387 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వ్యాధి సోకి ముగ్గురు చనిపోయారు. 211 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకుని వారి ఇళ్లకు వెళ్లి మరోసారి క్వారంటైన్ లో ఉంటున్నారు.

సముద్ర తీరంలో హౌస్ బోట్స్

సముద్ర తీరంలో హౌస్ బోట్స్

కేరళలోని అలప్పుజ జిల్లా అంటేనే హౌస్ బోట్స్ కు పెట్టింది పేరు. భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రకృతి ప్రేమికులు అలప్పుజ జిల్లాలోని సుందరమైన ప్రాంతాలకు హౌస్ బోట్స్ లో తిరుగుతుంటారు. కేరళలో అలప్పుజ జిల్లాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ దెబ్బకు అలప్పుజ జిల్లాలో పర్యాటకులు లేకపోవడంతో ఆ ప్రాంతాల్లో ప్రతిరోజూ సంచరించే విలాసవంతమైన హౌస్ బోట్స్ ఇప్పుడు ఖాళీగా పడి ఉన్నాయి.

2 వేల మందికి కరోనా చికిత్స

2 వేల మందికి కరోనా చికిత్స

అలప్పుజ జిల్లాలోని హౌస్ బోట్స్ ను కరోనా ఐసోలేషన్ వార్డులు చెయ్యాలని నిర్ణయించామని ఆ జిల్లా కలెక్టర్ ఎం. అంజనా మీడియాకు చెప్పారు. అలప్పుజ జిల్లాలోని హౌస్ బోట్స్ లో సుమారు 1, 500 నుంచి 2, 000 మందికి చికిత్సలు చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం. అంజనా వివరించారు.

ఖర్చు చాలా తక్కువ

ఖర్చు చాలా తక్కువ

ఇప్పటికే కరోనా వైరస్ వ్యాధి సోకిన వారికి ప్రత్యేక చికిత్సలు చెయ్యడానికి రైల్వే బోగీలను కరోనా ఐసోలేష్ వార్డులుగా మార్చేశారు. రైల్వే బోగీలను కరోనా ఐసోలేషన్ వార్డులుగా మార్చడానికి చాలా ఖర్చు అవుతోందని అధికారులు అంటున్నారు. అయితే కేరళలోని అలప్పుజ జిల్లాలోని హౌస్ బోట్స్ లో ఇప్పటికే బెడ్స్ ఉన్నాయని, అక్కడ వైద్య పరికరాలు, 24 గంటల విద్యుత్ సదుపాయం తీసుకుంటే కరోనా వైరస్ ఐసోలేషన్ వార్డులు తయారు చేసి అక్కడ కరోనా వ్యాధి సోకిని వారికి చికిత్స చెయ్యడానికి అవకాశం ఉంటుందని, అందుకు చాలా తక్కువ ఖర్చు అవుతోందని జిల్లా కలెక్టర్ ఎం. అంజనా వివరించారు.

ఐడియా అదుర్స్

ఐడియా అదుర్స్

అలప్పుజ జిల్లాలో హౌస్ బోట్స్ ను కరోనా ఐసోలేషన్ వార్డులుగా మార్చుకోవాలని ఆ జిల్లా కలెక్టర్ ఎం. అంజనా మంచి ఐడియా వేశారని కేరళ ప్రభుత్వ అధికారులు అంటున్నారు. సముద్ర తీర ప్రాంతంలో ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు లేకుండా ఉండే హౌస్ బోట్స్ లో కరోనా వైరస్ వ్యాధి సోకిన వారికి చికిత్స చెయ్యడానికి బాగుంటుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

కేరళ- కర్ణాటక సరిహద్దులో !

కేరళ- కర్ణాటక సరిహద్దులో !

కేరళలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 387 నమోదైనాయి. అలప్పుజ జిల్లాలో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కేరళ- కర్ణాటక సరిహద్దులోని కాసరగూడు ప్రాంతంలో అత్యధికంగా మొత్తం 167 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాసరగూడు ప్రస్తుతం కరోనా రెడ్ జోన్ అయ్యింది.

English summary
Coronavirus: M. Anjana, Alappuzha district collector in Kerala said that district Administration has decided to convert houseboats into COVID 19 Isolation wards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X