• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎన్నికలు, క్రికెట్‌, కుంభమేళా- కరోనా సెకండ్‌ వేవ్‌ కారణాలివే- చేతులెత్తేస్తున్న కేంద్రం

|

భారత్‌ను కరోనా సెకండ్‌ వేవ్‌ దారుణంగా కుదిపోస్తోంది. గతేడాది వచ్చిన తొలి వేవ్‌తో పోలిస్తే ఎన్నో రెట్లు అదికంగా, వేగంగా ఇది విస్తరిస్తోంది. అదీ కేంద్ర ప్రభుత్వం కరోనాపై యుద్దం ముగిసిందంటూ ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఈ కుదుపు ప్రారంభం కావడం విశేషం. దీంతో ఇప్పుడు తప్పెక్కడ జరిగిందనే చర్చ సర్వత్రా సాగుతోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ నియంత్రణలో భారత్‌ వైఫల్యాలు ఇప్పుడు ప్రపంచంలోనే అమెరికా తర్వాత రెండో అత్యంత ప్రభావం చూపుతున్న దేశంగా మనల్ని నిలబెట్టాయి.

భారత్‌లో సెకండ్‌ వేవ్‌ కల్లోలం

భారత్‌లో సెకండ్‌ వేవ్‌ కల్లోలం


భారత్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా సెకండ్‌ వేవ్‌ పేరే వినిపిస్తోంది. గతేడాది తొలిసారి కరోనా పేరు విన్నప్పుడు కూడా కనిపించనంత భయం జనంలో కనిపిస్తోంది. దీనికి కారణం గతేడాది చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్ కంటే ఎన్నో రెట్లు వేగంగా, ప్రభావవంతంగా విస్తరిస్తున్న సెకండ్‌ వేవ్‌ వైరసే. దీంతో కేంద్రానికి కూడా ముచ్చెమటలు పడుతున్నాయి. నిన్న మొన్నటివరకూ కరోనా తగ్గిపోయింది, ఈ పోరాటంలో మేం ఛాంపియన్లమని చెప్పుకున్న కేంద్ర మంత్రులు ఇప్పుడు నోరు మెదిపేందుకు భయపడుతున్నారు.
దీని వెనుక సెకండ్‌వేవ్‌ నియంత్రణలో వైఫల్యాలే అడుగడుగునా కనిపిస్తున్నాయి.

సెకండ్‌వేవ్‌ కట్టడిలో వైఫల్యాలివే

సెకండ్‌వేవ్‌ కట్టడిలో వైఫల్యాలివే

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానమైనది దీని ప్రభావాన్ని అంచనా వేయడంలో కేంద్రం వైఫల్యం. దేశ కరోనా నియంత్రణలో చివరి దశలో ఉందని ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ప్రకటించిన వారం లోపే సెకండ్‌ వేవ్‌ ప్రభావం చూపడం ప్రారంభించింది. ఇప్పడది రోజుకు రెండు లక్షలకు పైగా కేసులతో చెలరేగిపోతోంది. అయినా దాన్ని నియంత్రించేందుకు కేంద్రం వద్ద నిర్ధిష్టమైన పరిష్కారాలు కనిపించడం లేదు. కేవలం వ్యాక్సిన్లపై ఆధారపడటం, కోవిడ్‌ మార్గదర్శకాలు పాటించమని చెప్పడం మినహా కేంద్రం చేస్తోంది ఏమీ లేదనే చర్చ పెరుగుతోంది.

 కరోనాను అడ్డుకున్నామంటూ గొప్పలు

కరోనాను అడ్డుకున్నామంటూ గొప్పలు

వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాకముందే గతేడాది డిసెంబర్‌ నుంచే కరోనా తీవ్రత తగ్గడం మొదలైంది. అంతే కేంద్ర మంత్రులు, రిజర్వుబ్యాంకు, అధికార పార్టీ నేతలు, మీడియా ఇలా ప్రతీ ఒక్కరూ మనం కరోనాపై గెలిచామంటూ ఒకటే బాకా ఊదడం మొదలుపెట్టేశారు. అదే సమయంలో బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ నుంచి ఇతర రకాల కరోనా వైరస్‌లు భారత్‌లో ప్రవేశించాయని తెలిసినా వాటిపై నిర్ధిష్టంగా అడ్డుకునే చర్యలు తీసుకోలేదు. వ్యాక్సిన్లపై అతిగా ఆధారపడటమే కాకుండా ప్రధాని మోడీని వ్యాక్సిన్ గురు అంటూ కేంద్రమంత్రులు, బీజేపీ పెద్దలు ఆకాశానికెత్తేశారు.

వ్యాక్సిన్లపై అన్నీ వైఫల్యాలే

వ్యాక్సిన్లపై అన్నీ వైఫల్యాలే

భారత్‌లో ఈ ఏడాది జనవరిలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటిని అన్ని రాష్ట్రాల్లో అవసరంతో సంబంధం లేకుండా అందరికీ వేయాలనే స్పృహ కరువైంది. కరోనా ఉన్నవారికే వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచారు. అదీ 60 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే. ముందుగా ఫ్రంట్‌ లైన్ వారియర్లకు వ్యాక్సిన్‌ వేశారు. కానీ 45 ఏళ్లు పైబడిన వారికి కూడా ఈ మధ్యే సెకండ్‌ వేవ్ ప్రభావం తర్వాత వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చారు. ఇప్పటికీ 45 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్లు ఇవ్వడం లేదు. కానీ సెకండ్‌ వేవ్‌లో 45 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వారికి కూడా కరోనా సోకుతున్నట్లు నిర్దారణ అయింది. చిన్నపిల్లలకు సైతం కరోనా వైరస్ సోకుతోంది. అయినా వ్యాక్సిన్‌ నిబందనలు సడలించడం లేదు. అంతేకాదు విదేశీ వ్యాక్సిన్లను భారత్‌లో అనుమతించకుండా కేంద్రం తాత్సారం చేస్తూ వచ్చింది. ఇది కూడా కొంపముంచింది. ఇప్పుడు వ్యాక్సిన్లు కొరత మొదలయ్యాక విదేశా్లకు అనుమతిచ్చినా వెంటనే స్టాక్‌ వచ్చే పరిస్ధితి లేదు.

కొంపముంచిన ఎన్నికలు, క్రికెట్‌, కుంభమేళా

కొంపముంచిన ఎన్నికలు, క్రికెట్‌, కుంభమేళా

దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుతుందని ఎప్పుడైతే గుర్తించారో అప్పుడే ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నోటిపికేషన్ ఇచ్చేసింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రచారం, పోలింగ్ పేరుతో విచ్చలవిడిగా జనం రోడ్లపైకి రావడం మొదలుపెట్టేశారు. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో అగ్రనేతలు ప్రచారాల్ని సైతం రద్దు చేసుకుంటున్నారు. తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో సైతం విపరీతమైన కరోనా కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాది భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన రెండు మ్యాచ్‌లకు దాదాపు 1.3 లక్షల మందిని అనుమతించారు. దీంతో అక్కడ భారీగా కేసులు రావడం మొదలుపెట్టాయి. తాజాగా సెకండ్‌ వేవ్ ఉందని తెలిసీ లెక్క చేయకుండా కుంభమేళాకు అనుమతులివ్వడమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెంటిమెంట్ల పేరుతో సమర్దించాయి. భారీగా కేసులు పెరిగేసరికి ఇప్పుడు మధ్యలోనే నిలిపేసేందుకు సిద్దమవుతున్నాయి.

English summary
In early March, India's health minister Harsh Vardhan declared the country was "in the endgame" of the Covid-19 pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X