హెర్డ్ ఇమ్యూనిటీకి దూరంగా భారత్ - కరోనాతో గుండెపైనా ప్రభావం: హర్షవర్ధన్ - 60లక్షలు దాటిన కేసులు
దేశంలో కరోనా వీరవిహారం కొనసాగుతున్నది. ఆదివారం సాయంత్రానికి మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 60.50లక్షలకు, మరణాల సంఖ్య 95వేలకు చేరింది. ఇలాంటి కీలక సమయంలో కొవిడ్-19 వ్యాధికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కీలక విషయాలు వెల్లడించారు. హెర్డ్ ఇమ్యూనిటీ(సామూహిక రోగనిరోధక శక్తి)కి భారత్ చాలా దూరంలో ఉందని, ఐసీఎంఆర్ రెండో సెరో స్వేలో ఈ విషయం తేటతెల్లమైందని మంత్రి చెప్పారు.
కొండను పిండిచేసిన మహిళలు - 18నెలలు తొవ్వి ఊరికి నీళ్లు - హ్యాట్పాఫ్ చెబుతోన్న దేశం

హెర్డ్ ఇమ్యూనిటికి దూరం.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రజల సందేహాలు తీర్చడం కోసం కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ప్రతి ఆదివారం ‘సండే సవాద్' పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ప్రజలు అడిగిన వివిధ ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. హెర్డ్ ఇమ్యూనిటీకి భారత్ చాలా దూరంగా ఉందని, వ్యాక్సిన్ మాత్రమే శరణ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలందరినీ వైరస్ బారినపడేసి ఇమ్యూనిటీ సాధించే ప్రక్రియ అయిన హెర్డ్ ఇమ్యూనిటీ ప్రమాదరకరమని వెల్లడి కావడంతో కేంద్రం గతంలోనే ఆ దిశగా ప్రయత్నాలను రద్దు చేసుకోవడం తెలిసిందే.
ఎన్డీఏ నుంచి మరో పార్టీ ఔట్? - బీజేపీ ద్రోహం చేసిందన్న ఎన్పీపీ - మణిపూర్లో మళ్లీ హైడ్రామా

ఊపిరితిత్తులే కాదు గుండెపైనా..
కొవిడ్ మహమ్మారి శ్వాసకోశ వ్యాధి మాత్రమే కాదని.. గుండెతో సహా ఇతర అవయవాలపైనా ప్రభావం చూపుతుందని ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ అన్నారు. కరోనాపై ఇటీవల వెలువడుతున్న అధ్యయనాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, కొవిడ్-19 తీవ్రమైన శ్వాసకోశ వ్యాధికాకపోయినా.. ఇది ఊపిరితిత్తులపై మాత్రమే కాకుండా గుండె, కిడ్నీ వ్యవవస్థలను కూడా ప్రభావితం చేస్తుందని చెప్పారు. ఆర్టీ పీసీఆర్ టెస్టుల ధరల్ని వీలైనంత మేరకు తగ్గించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించామని తెలిపారు.

రోజుకు 5 లక్షల పీపీఈ కిట్ల ఉత్పత్తి..
ప్రస్తుతం దేశంలో రోజుకు 5 లక్షలకు పైగా పీపీఈ కిట్లు ఉత్పత్తి అవుతున్నాయని, గతంలో పీపీఈల కొరత ఉందన్న రాష్ట్రాలు ఇప్పుడు చాలనే పరిస్థితికి వచ్చాయని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రధాన మంత్రి స్వాస్థ్య యోజన పథకం కింద దేశంలో ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని, గడిచిన ఐదేళ్లలో కొత్తగా 25వేలకుపైగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను పెంచామని, దేశ జీడీపీలో 1.5 శాతం ఖర్చు ఆరోగ్యరంగానికి పెడుతున్నామని, 2025 నాటికి దానికి 2.5 శాతానికి పెంచుతామని మంత్రి తెలిపారు.