వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా లాక్‌డౌన్: మోదీ సంచలనం -వలస కూలీలు ఎక్కడికీ కదలొద్దు -ఇకపై రాష్ట్రాలదే భారమన్న ప్రధాని

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా మహ్మారి రెండో దశ వ్యాప్తి అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతుండటం, ప్రతిరోజూ రెండు లక్షలకుపైగా కొత్త కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతోన్న దరిమిలా పరిస్థితిని చక్కబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. గతేడాది కంటే పెద్ద కష్ట కాలాన్ని ఇప్పుడు భారత ప్రజలు ఎదుర్కొంటున్నారని, కుటుంబీకులను కోల్పోయినవారికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని అన్నారు. మంగళవారం జాతినుద్దేశించి కీలక సందేశం ఇచ్చిన ప్రధాని మోదీ దేశంలో మరోసారి లాక్ డౌన్ విధింపునకు సంబంధించి స్పష్టత ఇచ్చారు. లాక్ డౌన్ చిట్ట చివరి ఆప్షన్ గానే వాడాలని, ఇకపై ఆ నిర్ణయాలు రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయని కుండబద్దలు కొట్టారు. ప్రధాని ఏం చెప్పారో ఆయన మాటల్లోనే...

షాకింగ్: తెలంగాణలో థియేటర్లు బంద్ -సర్కారు వద్దన్నా వినని ఎగ్జిబిటర్లు -పవన్ 'వకీల్ సాబ్’‌కు మినహాయింపుషాకింగ్: తెలంగాణలో థియేటర్లు బంద్ -సర్కారు వద్దన్నా వినని ఎగ్జిబిటర్లు -పవన్ 'వకీల్ సాబ్’‌కు మినహాయింపు

గతంలో కంటే కష్టకాలమిది..

గతంలో కంటే కష్టకాలమిది..

''కరోనాకు వ్యతిరేకంగా మనమంతా పెద్ద పోరాటం చేస్తున్నాం, కొన్ని రోజుల కిందట పరిస్థితులు చక్కబట్టే కనిపించినా, మళ్లీ రెండో వేవ్ తుఫానులా వచ్చింది. ప్రజలు అనుభవిస్తోన్న పీడ గురించి నాకు కచ్చితమైన అనుభవం ఉంది. తమవాళ్లను కోల్పోయినవారికి దేశ ప్రజల తరఫున సానుభూతి తెలుపుతున్నాను. మీ అందరి కుటుంబాల్లో ఒకడిగా బాధను పంచుకుంటున్నాను. తొలి వేవ్ తో పోల్చుకుంటే ఇప్పుడు కరోనా కష్టం మరింత పెరిగింది. అయితే, మనం మరింత కలిసికట్టుగా ఈ కష్ట కాలాన్ని గట్టెక్కాలి. ఈ పోరాటంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా ఉన్న డాక్టర్లు, మెడికల్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, పారిశుధ్యకార్మికులు, పోలీసులు, భద్రతా బలగాలు అందరికీ వందనాలు. సొంత కుటుంబాలను పక్కనపెట్టి వారంతా మనకోసం ఈ రెండో వేవ్ లోనూ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు..

గంటా భార్యను రచ్చలోకి లాగిన వైసీపీ విజయసాయిరెడ్డి -బ్లాక్ టికెట్లతో బతుకు మొదలైందంటూ బాబుపైనాగంటా భార్యను రచ్చలోకి లాగిన వైసీపీ విజయసాయిరెడ్డి -బ్లాక్ టికెట్లతో బతుకు మొదలైందంటూ బాబుపైనా

ధైర్యం కోల్పోవద్దు..

ధైర్యం కోల్పోవద్దు..


కఠినాతి కఠిన సమయంలోనూ మనం ధైర్యం కోల్పోవద్దు.. ఎలాంటి పరిస్థితుల నుంచైనా బయట పడటానికి సరైన నిర్ణయం తీసుకున్నప్పుడే మనం విజయం సాధిస్తాం. ఆ ఉవాచలోనే సందేశంగా భావిస్తూ ఇవాళ దేశం యావత్తూ పగలూ రాత్రి శ్రమిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా పరిస్థితి కొద్దిగా నియింత్రిణలోకి వచ్చింది. మొన్నటిదాకా మనల్ని ఆక్సిజన్ కొరత వేధించింది. దీనిపై కేంద్రం, రాష్ట్రాలు, ప్రైవేటు యంత్రాగాలు యుద్ధప్రాతిపదికన పనిచేసి, ఆక్సిజన్ కొరతపై ఉపాయాలు చేశాం. ఆక్సిజన్ సరఫరా పెంచుతున్నాం. ఆక్సిజన్ రైల్ ను కూడా అందుబాటులోకి తెచ్చాం. మరోవైపు..

ఆస్పత్రుల్లో బెడ్లు, మందులపై చింత వద్దు..

ఆస్పత్రుల్లో బెడ్లు, మందులపై చింత వద్దు..

రెండో దశ వ్యాప్తిలో ఫార్మా కంపెనీలు మందుల ఉత్పత్తిని పెంచాయి. జనవరితో పోల్చుకుంటే మెడిసిన్ ఉత్పత్తి రెట్టింపైంది. ఫార్మా కంపెనీల అధినేతలతో నేను నిన్ననే చర్చలు చేశాను. మందుల ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మన దేశం మొదటి నుంచీ ఫార్మా రంగంలో ముందుండటం కలిసొచ్చే విషయం. అదే సమయంలో ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంపుపైనా దృష్టిపెట్టాం. గతేడాది తొలి వేవ్ మొదలైనప్పటి నుంచే వ్యాక్సిన్ల తయారీ మొదలైంది. దేశ సైంటిస్టులు పగలూ రాత్రి శ్రమించి టీకాలు తయారు చేశారు. ఇవాళ ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు వ్యాక్సిన్లు అందిస్తున్నది మనమే. ఈ ప్రయత్నంలో ప్రైవేటు రంగం ప్రదర్శన అద్భుతంగా ఉంది. టీకాలకు అనుమతుల వ్యవహారాన్ని కేంద్రం ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో చేపట్టింది. ఇదంతా టీమ్ ఎఫర్ట్ గా సాగింది. భారత్ లోనే రెండు వ్యాక్సిన్లను తయారు చేసి ప్రపంచానికి అందించాం. అవసరం అయిన అందరికీ వ్యాక్సిన్ అందిచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.

ఆ నిర్ణయం పోరాటంలో కీలక మలుపు

ఆ నిర్ణయం పోరాటంలో కీలక మలుపు

ప్రపంచంలో మిగతా దేశాలకంటే భారత్ లోనే అత్యధిక టీకాలు పంపిణీ అయ్యాయి. కనీసం 12 కోట్ల డోసుల్ని మనం అందిచగలిగాం. కరోనాపై పోరులో మన ఆరోగ్య రంగం, కరోనా వారియర్లు, సీనియర్ సిటిజన్లకు లాభం చేకూరింది. ఈ క్రమంలోనే మే 1 తర్వాత దేశంలోని 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్లు అందించాలని నిర్ణయించాం. ఇది అత్యంత కీలక నిర్ణయం. కేంద్ర రాష్ట్రాల ఆధ్వర్యంలో ఆ పని కొనసాగుతుంది. దీంతో పేదలు, మధ్యతరగతి వర్గాలకు మేలు జరుగుతుంది. గతంలోలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత టీకాలు లభిస్తూనే ఉంటాయి. అయితే, అందరి ప్రాణాలు కాపాడాలన్నదే మన ఉద్దేశం, ప్రయాస కాబట్టి, సాధ్యమైనంతలో ఆర్థిక భారాన్ని కూడా తగ్గించాలన్నది ఉద్దేశం. కాగా,

లాక్‌డౌన్ చివరి ఆప్షన్ మాత్రమే

లాక్‌డౌన్ చివరి ఆప్షన్ మాత్రమే

టీకాలు అందించే విషయంలో, పనులు కొనసాగుతాయనే విషయంలో వలస కూలీలు, పేదలు, ఇతర వర్గాలు అందరికీ భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వలస కూలీలను బయటికి పోనీయకుండా, వారికి కావాల్సిన మందులు, టీకాలు దగ్గరికి తీసుకెళ్లి అందజేయాలి. కరోనా తొలి వేవ్ సమయంలో లేని సౌకర్యాలెన్నో ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి. దేశ ప్రజల భాగస్వామ్యంతోనే ఇదంతా సాధ్యమైంది. ఎక్కడికక్కడ ప్రజలే చిన్న చిన్న కమిటీలుగా ఏర్పడి కరోనా నియంత్రణకు ప్రయత్నించాలి. అలా చేసినప్పుడు కంటైన్మెంట్ జోన్లుగానీ, కట్టడి ప్రదేశాలుగానీ ఉండవు. ఆంక్షలు విధించడం గానీ, అసలు లాక్ డౌన్ అమలు చేయాలన్నే ప్రశ్నే ఉత్పన్నం కాదు. సంపూర్ణ లాక్ డౌన్ అనేది చిట్ట చివరి ఆప్షన్ గానే ఉండాలి తప్ప, దాన్ని అమలు చేసేందుకు ఉత్సాహపడరాదని రాష్ట్రాలకు నేను విన్నవిస్తున్నాను. లాక్ డౌన్ ను చివరి నిర్ణయంగా భావించాలని రాష్ట్రాలకు సూచిస్తున్నాను'' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

English summary
Prime Minister Narendra Modi in his address to the nation amid prevailing coronavirus situation in the country had said Let's save ourselves from lockdown. 'I urge the States to consider lockdowns only as the last option and focus creating on micro containment zones' said PM Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X