బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కరోనా దెబ్బకు బెంగళూరులో సీల్ డౌన్ !, రెండు వార్డుల్లో 45 వేల మంది, A to Z !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భారతదేశంలో రోజురోజుకు కరోనా వైరస్ (COVID 19) కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఐటీ, బీటీ సంస్థలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరంలో కరనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో 24 గంటల్లో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. దేశంలో కరోనా హాట్ స్పాట్ కేంద్రాల్లో బెంగళూరు సిటీ పేరు ఉంది. సిలికాన్ సిటీ బెంగళూరులో సీల్ డౌన్ జారీ చెయ్యాలని అధికారులు నిర్ణయించారని తెలిసింది. ఇప్పటికే బెంగళూరు నగరంలోని రెండు వార్డుల్లో సీల్ డౌన్ అమలు చేపి ఆ ప్రాంతాల్లోని 45 వేల మంది ప్రజలకు A to Z ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. రెండు వార్డుల్లో కరోనా వైరస్ కట్టడికి తాము కఠిన చర్యలు తీసుకుంటున్నామని బీబీఎంపీ అధికారులు తెలిపారు.

Coronavirus: బీహార్ లో 60 కరోనా కేసులు, ఒక్కడి దెబ్బకు ఫ్యామిలీలో 23 మందికి, మీరు జాగ్రత్త !Coronavirus: బీహార్ లో 60 కరోనా కేసులు, ఒక్కడి దెబ్బకు ఫ్యామిలీలో 23 మందికి, మీరు జాగ్రత్త !

 కరోనా హాట్ స్పాట్ లిస్టులో బెంగళూరు

కరోనా హాట్ స్పాట్ లిస్టులో బెంగళూరు

ఐటీ, బీటీ సంస్థలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన సిలికాన్ సిటీ బెంగళూరు ప్రస్తుతం కరోనా వైరస్ హాట్ స్పాట్ కేంద్రాల జాబితాలో చేరింది. కరోనా హాట్ స్పాట్ కేంద్రాల్లో బెంగళూరు పేరు ఉండటంతో ఆ నగరంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బెంగళూరు నగరంలో కరోనా వైరస్ మరింత వ్యాపించకుండా బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP) అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 బెంగళూరులో ఆ ప్రాంతాలు సీల్ డౌన్

బెంగళూరులో ఆ ప్రాంతాలు సీల్ డౌన్

బెంగళూరు నగరంలో ప్రస్తుతం బీబీఎంపీ పరిదిలోని రెండు వార్డులు పూర్తిగా సీల్ డౌన్ అయ్యాయి. బెంగళూరు సిటీలోని బీబీఎంపీ వార్డు నెంబర్ 134 బాపూజీనగర, వార్డు నెంబర్ 135 పాదరాయనపుర వార్డులు సీల్ డౌన్ అయ్యాయి. పాదరాయనపుర, బాపూజీనగర్ లో కొత్తగా ఐదు కరోనా వైరస్ అనుమానిత కేసులు వెలుగులోకి రావడంతో ఆ ఐదు మందిని క్వారంటైన్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాదరాయనపుర, బాపూజీనగర వార్డుల్లో సంపూర్ణంగా సీల్ డౌన్ అమలు చేశారు.

రెండు వార్డుల్లో 45 వేల మంది

రెండు వార్డుల్లో 45 వేల మంది

బీబీఎంపీ వార్డు నెంబర్ 134, 135 వార్డుల్లో మొత్తం 45 వేల మందికి పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. పాదరాయనపుర వార్డులో కరోనా అనుమానిత వ్యాధి కేసులు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని బీబీఎంపీ ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటికే పాదరాయనపుర, బాపూజీనగర వార్డుల్లో బీబీఎంపీ అధికారులు థర్మల్ స్క్రీనింగ్ తనిఖీలు ప్రారంభించారు. పాదరాయనపుర, బాపూజీనగర వార్డుల్లో నివాసం ఉంటున్న 45 వేల మంది ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని బీబీఎంపీ అధికారులు తెలిపారు.

 సీల్ డౌన్ ఏరియాల్లో A to Z ప్రభుత్వమే !

సీల్ డౌన్ ఏరియాల్లో A to Z ప్రభుత్వమే !

పాదరాయనపుర, బాపూజీనగర వార్డులు సంపూర్ణంగా సీల్ డౌన్ అయ్యాయని, అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు ఎవ్వరూ ఇళ్లలో నుంచి బయటకు రాకుండా కఠిన చర్యలు తీసుకున్నామని, వారికి కావలసిన నిత్యవసర వస్తులు కార్పోరేషన్ సిబ్బందితో ప్రభుత్వమే ఇంటింటికి సరఫరా చేస్తోందని బీబీఎంపీ కమిషనర్ బీహెచ్. అనీల్ కుమార్ చెప్పారు.

 బెంగళూరు సిటీ మొత్తం సీల్ డౌన్ ?

బెంగళూరు సిటీ మొత్తం సీల్ డౌన్ ?

బెంగళూరు నగరంలోని 134, 135 వార్డులు సంపూర్ణంగా సీల్ డౌన్ అయ్యాయి. అయితే బెంగళూరు నగరం మొత్తం సీల్ డౌన్ అయ్యే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే బెంగళూరు నగరం సీల్ డౌన్ అయ్యే విషయంపై ప్రభుత్వం కాని, బీబీఎంపీ అధికారులు కానీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇదే సమయంలో బెంగళూరు నగరం మొత్తం సీల్ డౌన్ అవుతోందని ప్రస్తుతం జోరుగా పుకార్లు వస్తున్నాయని, అయితే అలాంటి ప్రస్తావన ఇప్పటి వరకు లేదని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ అంటున్నారు.

Recommended Video

Vizag Municipal Commissioner Srujana Attending Duties With One Month Baby

English summary
COVID 19: In wake of growing Coronavirus, sealeddown has been implemented in Bengaluru. Seal down enforcement has been implemented in Padarayanapura and Bapuji Nagara wards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X