వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో కరోనా: 97% మించి రికవరీలు -కొత్తగా 12,194 కేసులు, 92 మరణాలు

|
Google Oneindia TeluguNews

గ్లోబల్‌గా కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా తీవ్రంగానే కొనసాగుతోంది. మొత్త ఇన్ఫెక్షన్ల సంఖ్య 11కోట్లకు, మరణాలు 25 లక్షలకు చేరువయ్యాయి. కాగా, భాతర్ లో మాత్రం కొత్త ఏడాది ప్రారంభం నుంచే కొత్త కేసులు, మరణాల తీవ్రత తగ్గుతూ వస్తోంది. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్ లో కొవిడ్ రికవరీ రేటు రికార్డు స్థాయిలో ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే..

Pulwama Terror Attack: రెండేళ్లు -NIA విఫలం -Interpol ఎంట్రీ -అమర జవాన్లకు కిసాన్ల నివాళిPulwama Terror Attack: రెండేళ్లు -NIA విఫలం -Interpol ఎంట్రీ -అమర జవాన్లకు కిసాన్ల నివాళి

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెలువరించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 12,194 పాజిటివ్ కేసులు, 92 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,04,940కు, మరణాల సంఖ్య 1,55,642కు పెరిగింది. దేశంలో మరణాల రేటు 1.43 శాతం ఉంది. కాగా,

covid-19: India records 12,194 new cases, 92 deaths in last 24 hrs, 97.31 recovery rate

దేశంలో రికవరీల సంఖ్య ఇంకాస్త పెరిగింది. నిన్న ఒక్కరోజే 11,106 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,06,11,731కు చేరింది. భారత్ లో రికవరీ రేటు 97.31శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 1,37,567కు తగ్గింది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 20,62,30,512 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 6,97,114 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. ఇక..

వెంకయ్యను మళ్లీ లాగిన వైసీపీ -వీపీ మౌనమేల? పోస్కోతో జగన్‌కు లింకుల్లేవు: మంత్రి పెద్దిరెడ్డివెంకయ్యను మళ్లీ లాగిన వైసీపీ -వీపీ మౌనమేల? పోస్కోతో జగన్‌కు లింకుల్లేవు: మంత్రి పెద్దిరెడ్డి

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కార్యక్రమం జనవరి 16న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా అందిన వారి సంఖ్య 82లక్షలు దాటింది. తొలి విడతలో పారిశుద్ధ్య కార్మికులు, కిందిస్థాయి ఆరోగ్య సిబ్బంది టీకాలు పొందుతున్న విషయం తెలిసిందే.

English summary
India's Covid-19 infection tally climbed to 1,09,04,940 with 12,194 fresh cases recorded in the last 24 hours, while 1,06,11,731 people have recuperated so far, according to Union Health Ministry data on Sunday. In the last 24 hours, 92 people succumbed to the deadly virus while 11,106 were discharged from hospitals, according to the health ministry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X