COVID-19: శాంతించిన కరోనా, జూన్ తరువాత రికార్డుస్థాయిలో తగ్గింది, సంక్రాంతికి శుభం జరుగుతుందా, దేవుడా
న్యూఢిల్లీ/హైదరాబాద్/ బెంగళూరు: భారతదేశంలో కరోనా వైరస్ (COVID-19)మహమ్మారి శాంతించింది. గత వారం రోజుల క్రితం కరోనా కేసుల సంఖ్య పెరగడంతో ప్రజలతో పాటు ప్రభుత్వాలు హడలిపోయాయి. భారతదేశంలో మరోసారి 24 గంటల వ్యవధిలో 16, 311 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. గత ఏడాది జూన్ తరువత భారత దేశంలొ అతి తక్కువగా గత 24 గంటల్లో మరణాల సంఖ్య నమోదైయ్యింది. భారతదేశంలో కరోనా వైరస్ బారినపడిన కోలుకున్న వారి సంఖ్య కోటి దాటిపోయింది. ప్రపంచదేశాల్లో కరోనా వైరస్ తాండవం చేసిన దేశాల జాబితాలో భారతదేశం 12వ స్థానంలో కొనసాగుతోంది. సంక్రాంతి పండుగ సందర్బంగా కరోనా కేసులు తగ్గడం శుభసూచికంగా కనపడుతోంది. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి వ్యాధికి 161 మంది బలి అయ్యారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ప్రస్తుతానికి పర్వాలేదు
భారతదేశంలో గత 24 గంటల్లో 16,311 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఆదివారం దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దేశంలో కరోనా వ్యాధి నుంచి కోలుకున్న వారికంటే సుమారు 19 మంది ఆ వ్యాదిబారినపడ్డారు. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా వ్యాధి కోసం చికిత్స పొందుతున్న వారిలో చికిత్స విఫలమై 161 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

జూన్ తరువాత ఇప్పుడు
భారతదేశంలో కరోనా వైరస్ తాండవం చేసిన తరువాత లాక్ డౌన్ అమలు చెయ్యడంతో సామాన్య ప్రజల జీవితాలు తల్లకిందులైనాయి. గత ఏడాది జూన్ తరువాత భారతదేశంలో అతి తక్కువగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, కరోనా మరణాలు గత 24 గంటల్లో తక్కువగా నమోదు కావడంతో ప్రజలు కొంచెం ఊపిరిపీల్చుకున్నారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2.2 లక్షలకు పడిపోయాయి.

సంక్రాంతికి శుభసంకేతం
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ రోజు (జనవరి 11వ తేదీ) సమావేశం అవుతున్నారు. ఇలాంటి సమయంలో దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తక్కువ నమోదు కావడం ఒకరకంగా శుభపరిణామం అని అధికారులు అంటున్నారు. భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ కొనసాగుతోంది, మరో వారం రోజుల్లో ప్రజలకు కరోనా టీకాలు వెయ్యడానికి ప్రభుత్వాలు, ఆరోగ్య శాఖ అధికారులు సిద్దం అవుతున్నారు.

జవవరి 16వ తేదీ ముహూర్తం
దేశవ్యాప్తంగా జనవరి 16వ తేదీన వ్యాక్సిన్ డ్రైరన్ లో భాగంలొ ఫ్రెంట్ లైన్ లో మూడు కోట్ల మంది పారిశుద్ద కార్మికులకు కరోనా టీకాలు (వ్యాక్సిన్)లు వెయ్యనున్నారు. తరువాత 50 ఏళ్లు వయసు పైబడిన 27 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు వెయ్యడానికి ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా టీకాలు మంచి ఫలితాలు ఇవ్వాలని దేశవ్యాప్తంగా ప్రజలు ఆ దేవుడిని వేడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో 2020 జూన్ తరువాత దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, కరోణాల మరణాల సంఖ్య తగ్గడంతో ప్రజలు కొంచెం ఊపిరిపీల్చుకుంటున్నారు.