వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కేసుల్లో ఇండియా మరో రికార్డు - కొత్తగా 64,399, మొత్తం 21లక్షల కేసులు - 43వేల మంది బలి..

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 2కోట్లకు చేరువైనవేళ.. ఇండియాలోనూ దాని ప్రభావం తీవ్రతరమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 64,399 కేసులు, 861 మరణాలు నమోదయ్యాయి. ఒకే రోజులో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు రావడం సరికొత్త రికార్డు. కొత్తవాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 21.53లక్షలకు పెరిగింది. ఇప్పటిదాకా కరోనాకు బలైపోయినవారి సంఖ్య 43,379కు చేరింది.

Recommended Video

Kozhikode : మరణించిన 18 మంది ప్రయాణికుల్లో ఒకరికి కరోనా పాజిటివ్! || Oneindia Telugu

జులై చివరి వారం నుంచి ప్రతిరోజూ 50వేలకు తక్కువ కాకుండా కొత్త కేసులు నమోదవుతుండటం గమనార్హం. ఆదివారం నాటి 64,399 కొత్త కేసులే ఇప్పటిదాకా ఒక రోజులో నమోదైన అత్యధిక సంఖ్య. మొత్తం 21.53 కేసులకుగానూ దాదాపు 68 శాతం రికవరీ రేటుతో 14.80లక్షల మంది రికవరీ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 6.23లక్షలుగా ఉంది.

covid-19: India reports highest single-day spike of 64,399 cases

ప్రపంచవ్యాప్తంగా కూడా ఒకే రోజులో అత్యధిక కేసులు నమోదైన దేశం కూడా ఇండియానే కావడం విచారకరం. కరోనా కేసులు, మరణాల పట్టికలో టాప్ లో ఉన్న అగ్రరాజ్యం అమెరికాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 58,173 కేసులు రాగా, రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ లో 49,970 కేసులు నమోదయ్యాయి. మూడో స్థానంలో ఉన్న ఇండియాలో మాత్రం కొత్త కేసులు రికార్డు స్తాయిలో(64,399) నమోదయ్యాయి.

జగన్ పై సోము వీర్రాజు 'అయోధ్య' అస్త్రం - తొలిసారి కన్నాతో భోజనం - బీజేపీలోకి గంటా శ్రీనివాసరావు?జగన్ పై సోము వీర్రాజు 'అయోధ్య' అస్త్రం - తొలిసారి కన్నాతో భోజనం - బీజేపీలోకి గంటా శ్రీనివాసరావు?

దేశంలో కరోనాకు మోస్ట్ ఎఫెక్టెడ్ గా ఉన్న మహారాష్ట్రలో ఇన్ఫెక్షన్ల సంఖ్య 5లక్షలు దాటింది. అక్కడ మొత్తం 17,367 మరణాలు నమోదయ్యాయి. తమిళనాడులో 2.9లక్షల కేసులు, 4,808 మరణాలు చోటుచేసుకున్నాయి. 2.17 లక్షల కేసులతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. ఏపీలో మరణాల సంఖ్య 2వేలకు చేరువైంది. తెలంగాణలో కొత్తగా 1982 కేసులు రాగా, మొత్తం సంఖ్య 79,495కు, మరణాలు 627కు పెరిగాయి.

English summary
India on Sunday reported a record single-day spike of 64,399 COVID-19 cases, pushing country's tally to 21,53,010, according to the Union health ministry data. The death-toll climbed to 43,379 with 861 people succumbing to the infection in 24 hours, the data showed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X