వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయం:చైనాను దాటిన భారత్.. రేపటితో కొత్త కేసులు సున్నా.. సోమవారం సెలూన్లు రీఓపెన్..

|
Google Oneindia TeluguNews

అక్షరాలా మూడు లక్షల మంది.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కాటుకు బలైపోయారు. మొత్తం కేసులు 45.6లక్షలైతే, అందులో 17లక్షల మంది వ్యాధినుంచి కోలుకోగా, ఇప్పటికీ 25.3లక్షల యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమైన ఇండియాలో అందరూ భయపడ్డట్లే కరోనా కరతాళనృత్యం చేస్తోంది. కొవిడ్-19 కేసుల విషయంలో శుక్రవారం నాటికే భారత్.. వైరస్ పుట్టినిల్లయిన చైనాను అధిగమించింది. అంతేకాదు, రేపటితో కొత్త కేసులు సున్నాకు ఎలా పడిపోతాయో, లాక్ డౌన్ 4.0లో ఎలాంటి సడలింపులుంటాయో కూడా వెల్లడైంది..

24 గంటల్లో 3,277 కేసులు..

24 గంటల్లో 3,277 కేసులు..


కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం చేసిన ప్రకటన ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 4వేల పైచిలుకు కేసులు, 127 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 84,712కు పెరిగింది. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే మన దగ్గర రికవరీ రేటు శాతం ఎక్కువగా ఉండటంతో ఇప్పటివరకు 29వేల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. మరో 2,672 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 52వేలుగా ఉంది. అదే సమయంలో చైనాలో మొత్తం కేసుల సంఖ్య 82,933కాగా, అందులో 78,209మంది డిశ్చార్జైపోయారు. మరో 4,633 మంది ప్రాణాలు కోల్పోయారు. డ్రాగన్ దేశంలో శుక్రవారం కేవలం 4 కొత్త కేసులు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతానికి అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 91 మాత్రమే.

మే 16తో సున్నా కేసులు..

మే 16తో సున్నా కేసులు..

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 25 నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ విధించడం తెలిసిందే. అప్పటికి మన దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యిలోపే ఉండింది. తర్వాతి కాలంలో వైరస్ వ్యాప్తిని అంచనా వేస్తూ.. దేశాన్ని నడిపించే కీలకమైన థింక్ ట్యాంక్ ‘నీతి ఆయోగ్' ఒక గ్రాఫ్ ను రూపొందించింది. మోదీ సర్కారు తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయంతో మే 16 నాటికి భారత్ లో కొత్త కేసుల సంఖ్య సున్నాకు చేరుకుంటుందని నీతి ఆయోగ్ లెక్కలు కట్టింది. తీరా రియాలిటీకి వచ్చేసరికి దాని లెక్కలు తారుమారయ్యాయి. ‘‘జీనియన్ నీతి ఆయోగ్ మరోసారి తనను తాను నిరూపించుకుంది..''అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సదరు గ్రాఫ్‌ను మరోసారి ప్రజలముందుంచారు. ఇకపోతే..

సోమవారం నుంచి సెలూన్లు..

సోమవారం నుంచి సెలూన్లు..


దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాని కారణంగా లాక్ డౌన్ గడువును మరింత కాలం పొడిగిస్తామని ప్రధాని మోదీ ఇదివరకే స్పష్టం చేశారు. మూడో దశ లాక్ డౌన్ ఈనెల 17తో ముగియనుండటంతో లాక్ డౌన్ 4.0కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సిద్ధం చేసింది. అందులో భాగంగా రెడ్ జోన్లలోనూ సెలూన్లు, ఆప్టికల్ షాపులకు అనుమతులిచ్చారు. అలాగే, ముఖ్యమంత్రులకు మోదీ వాగ్దానం చేసినట్లే.. రెడ్ జోన్లలో ఏయే వ్యాపారాలు రీఓపెన్ చేసుకోవచ్చనే నిర్ణయాధికారాలను కేంద్రం.. రాష్ట్రాలకే వదిలేసింది. సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, మాల్స్ లాంటి పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసులపై మరికొంతకాలం నిషేధం కొనసాగనుంది.

Recommended Video

Donald Trump Could 'Cut Off' China Ties & Says Doesn't Want To Speak To Xi Jinping
కేసుల్లో ‘మహా’ రికార్డు..

కేసుల్లో ‘మహా’ రికార్డు..

కొవిడ్-19 వ్యాధికి సంబంధించి దేశంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రంగా కొనసాగుతోన్న మహారాష్ట్రలో శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో కొత్తగా 1576 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 29,100కు, మరణాల సంఖ్య 1068కి పెరిగింది. తమిళనాడులోనూ కొత్తగా 434 కేసులు రావడంతో టోటల్ ఫిగర్ 10,108కి చేరింది. మరణాల రేటు అధికంగా ఉన్న గుజరాత్ లో శుక్రవారం ఒక్కరోజే 340 కొత్త కేసులు, 20 మరణాలు సంభవించాయి. అక్కడ మొత్తం కేసులు 10వేలకు, మరణాలు 600 దాటాయి. ఆంద్రప్రదేశ్ లో 2307 కేసులు, తెలంగాణలో 1454 కేసులు నమోదయ్యాయి.

English summary
With 84,712 Cases, India Crosses China's COVID-19 Tally on friday. saloon shops in all zones will be reopen from monday. congress leader rahul gandhi takes on niti aayog on covid-19 predictions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X