బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: బెంగళూరులో ఒక్కడి దెబ్బకు 29 మందికి కరోనా పాజిటివ్, క్వారంటైన్ లో 184 మంది !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం హడలిపోతుంది. సిలికాన్ సిటి బెంగళూరు నగరంలోని హోంగసంద్రలో బీహార్ వ్యక్తికి కరోనా రావడం, అతను ఇష్టం వచ్చినట్లు సంచరించడంతో ఆ ప్రాంతంలోని 184 మందిని క్వారంటైన్ కు తరలించారు. క్వారంటైన్ గడుపు పూర్తి కావడంతో మళ్లీ పరీక్షలు చేసిన అధికారులు హడలిపోయారు. క్వారంటైన్ లో ఉన్న వారిలో ఐదు మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. బీహార్ వ్యక్తి వలన మొత్తం 29 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని వెలుగు చూడటంతో హోంగసంద్ర ప్రజలు ప్రాణభయంతో హడలిపోతున్నారు.

Lockdown: లవ్ మ్యారేజ్, కేరళలో భర్త, బెడ్ రూంలో ప్రియుడు, కరోనా పరీక్షలు చేసిన గంటలో ఫినిష్ !Lockdown: లవ్ మ్యారేజ్, కేరళలో భర్త, బెడ్ రూంలో ప్రియుడు, కరోనా పరీక్షలు చేసిన గంటలో ఫినిష్ !

ఒకేఒక్కడితో హోంగసంద్ర హడల్

ఒకేఒక్కడితో హోంగసంద్ర హడల్

బెంగళూరు నగరంలోని హోంగసంద్ర ప్రాంతంలో బీహార్ కు చెందిన వందల మంది వలస కార్మికులుగా పని చేస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో హోంగసంద్రలోని పలువురికి వైద్య సిబ్బంది పరీక్షలు చేశారు. బీహార్ కు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. అప్పటికే బీహార్ కు చెందిన సాటి కార్మికులతో పాటు అతను చుట్టుపక్కల ఉన్న షాపులు, కూరగాయలు, పాలు విక్రయించేవారితో చనువుగా ఉన్నాడని వెలుగు చూడటంతో హోంగసంద్ర ప్రజలు హడలిపోయారు.

క్వారంటైన్ లో 184 మంది

క్వారంటైన్ లో 184 మంది

బీహార్ కార్మికుడికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో అతనితో పాటు కలిసి జీవిస్తున్న సాటి కార్మికులు, చుట్టుపక్కల వారు, కిరాణా షాప్ లు, పాలు, కూరగాయల వ్యాపారులు ఇలా మొత్తం 184 మందిని అధికారులు ఆసుపత్రులు, హోటల్స్ లోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.

క్వారంటైన్ లో ఐదు మందికి కరోనా

క్వారంటైన్ లో ఐదు మందికి కరోనా

హోంగసంద్రలోని వారి క్వారంటైన్ గడుపు పూర్తి కావడడంతో మరోసారి అధికారులు 184 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. క్వారంటైన్ గడుపు పూర్తి అయిన వారిలో ఐదు మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో వెంటనే వారిని కరోనా ఐసోలేషన్ వార్డులకు తరలించారు. మిగిలిన 179 మంది వైద్యపరీక్షల నివేదికల కోసం వైద్యశాఖ అధికారులు ఎదురు చూస్తున్నారు.

 బీహార్ వ్యక్తి దెబ్బకు 29 మందికి కరోనా

బీహార్ వ్యక్తి దెబ్బకు 29 మందికి కరోనా

క్వారంటైన్ పూర్తి చేసిన వారిలో ఇప్పుడు 5 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. వారిలో ముగ్గురు కూలి కార్మికులు, స్థానికుడు ఒక్కరు, ఒక కన్నడిగ ఉన్నారని అధికారులు తెలిపారు. హోంగసంద్రలో మొదట కరోనా పాజిటివ్ వచ్చిన బీహార్ కూలి కార్మికుడి వలన ఇప్పటి వరకు 29 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు గుర్తించారు.

Recommended Video

Pubs, Bars, Clubs And Restaurants Can Sell Liquor, Conditions Applied
 ట్రావెల్ హిస్టరీ ఏమైనా ఉందా ?

ట్రావెల్ హిస్టరీ ఏమైనా ఉందా ?

హోంగసంద్రలోని బీహార్ కార్మికుడి వలన క్వారంటైన్ లో ఉన్న ఐదు మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో వైద్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. క్వారంటైన్ లో పాజిటివ్ వచ్చిన ఐదు మంది ఇంతకు ముందు ఎక్కడెక్కడ తిరిగారు ? వారి ట్రావెల్ హిస్టరీ ఏమైనా ఉందా ? అంటూ ఆరా తీస్తున్నారు. క్వారంటైన్ లో ఉన్న మిగిలిన 179 మందికి మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించి పూర్తి వైద్య నివేదికలు వచ్చే వరకు వరకు ఎవ్వరినీ బయటకు వదలకుండా మళ్లీ క్వారంటైన్ లో పెట్టాలని అధికారులు ఆలోచిస్తున్నారు.

English summary
Coronavirus: COVID 19 infection was found in five who had completed quarantine in the hospital in Bengaluru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X