వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొవిడ్ టెస్టుల ధర తగ్గింపు - మహారాష్ట్రలో కొత్తగా 12,712 కేసులు, 344 మరణాలు.. అన్నింటా టాప్..

|
Google Oneindia TeluguNews

కరోనా కేసులు, మరణాల్లో మొదటి నుంచీ మోస్ట్ ఎఫెక్టెడ్ గా కొనసాగుతున్నది మహారాష్ట్ర. టెస్టింగ్స్ లోనూ అందరికంటే ముందున్న రాష్ట్రం ధరల్ని ఇంకాస్త తగ్గించింది. కొవిడ్ టెస్టులపై ధరను రూ.300కు తగ్గించామని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు.

కొవిడ్ టెస్టింగ్స్ ధరల అధ్యయనం కోసం ఏర్పాటైన కమిటీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ధరల తగ్గింపు తర్వాత టెస్టింగ్స్ కు గరిష్టంగా రూ.1900 నుంచి రూ.2500కు తగ్గిందని, ఇంతకు మించి ఎవరైనా అధికంగా వసూళ్లు చేస్తే ల్యాబ్ పర్మిషన్లు రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు. పీపీఈ కిట్స్, ఇతర వైద్య సామాగ్రి ధరలు కూడా ఇదివరకే తగ్గించి, సరఫరా పెంచామని ఆయన చెప్పారు.

 నిత్య పెళ్లి కూతురు రవళి - ముగ్గురు భర్తలతో బంతాట - వాటర్ ట్యాంక్ డ్రామాతో అడ్డంగా దొరికి.. నిత్య పెళ్లి కూతురు రవళి - ముగ్గురు భర్తలతో బంతాట - వాటర్ ట్యాంక్ డ్రామాతో అడ్డంగా దొరికి..

 covid-19: Maharashtra slashes costs for COVID tests by Rs 300, 12,712 new cases

మహారాష్ట్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,712 పాజిటివ్ కేసులు, 344 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 5.48 లక్షలకు, మొత్తం మరణాల సంఖ్య 18,650కి పెరిగింది. అంతా కలిపి ఇప్పటిదాకా 3.81లక్షల మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకోగా, 1.47లక్షల యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.

దేశ ఆర్థిక రాజధాని ముంబై సిటీలో కరోనా వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాలేదు. బుధవారం ఒక్కరోజే ఒక్కడ 1,132 కొత్త కేసులు, 50 మరణాలు నమోదయ్యాయి. సిటీలో ఇప్పటిదాకా 1.26లక్షల మంది ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. అందులో దాదాపు 7వేల మంది ప్రాణాలు కోల్పోయారు. పుణెలో కొత్తగా 1,665 కేసులు, 19 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటిదాకా మొత్తం 29.08లక్షల శాంపిల్స్ ను టెస్టు చేసినట్లు బులిటెన్ లో పేర్కొన్నారు.

English summary
Maharashtra on Wednesday reported 12,712 new coronavirus patients and 344 deaths which took the case tally to 5,48,313 and death toll in the state to 18,650, a health official said. the government has reduced by Rs 300 the rates of COVID-19 tests conducted by laboratories, bringing them in the range of Rs 1,900 to Rs 2,500.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X