వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయం:కేంద్రం తాజా ప్రకటన -బహిరంగ మార్కెట్లపై కొత్త మార్గదర్శకాలు -దాటితే అంతే..

|
Google Oneindia TeluguNews

కొద్దిరోజులుగా తగ్గినట్లు కనిపిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పీక్స్ కు చేరనుందా? సెకండ్ వేవ్ పై వ్యక్తమవుతోన్న అనుమానాలు నిజమేనా? కొవిడ్-19 కట్టడికి కేంద్రం ఇంకాస్త కఠినంగా వ్యవహరించబోతోందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. కరోనా పరిస్థితులు, పెరుగుతోన్న చలి నేపథ్యంలో బహిరంగ మార్కెట్లపై కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

తాజా గైడ్ లైన్స్ ప్రకారం.. ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లుగా గుర్తింపు పొందిన ప్రాంతాల్లో అన్ని రకాల మార్కెట్ల మూసివేత కొనసాగుతుంది. వాటిని ఇప్పుడుడప్పుడే తెరిచే వీలులేదు. ఇక నాన్ కంటైన్మెంట్ జోన్లలోని మార్కెట్లకు మాత్రం అనుమతి ఉంటుందన్న కేంద్రం.. ఆయా దుకాణదారులకు కీలక సూచనలు చేసింది.

కరోనా విలయం: మళ్లీ లాక్ డౌన్? -4న ప్రధాని మోదీ కీలక సమావేశం -అన్ని పార్టీలకు పిలుపుకరోనా విలయం: మళ్లీ లాక్ డౌన్? -4న ప్రధాని మోదీ కీలక సమావేశం -అన్ని పార్టీలకు పిలుపు

రిస్క్ జోన్లో ఉన్నవారు.. అంటే, 65ఏళ్లు పైబడిన వ్యక్తులు, గర్భిణులు, 10ఏళ్లలోపు పిల్లలు మార్కెట్లలో జన సమూహాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య శాఖ కోరింది. మార్కెట్లలో దుకాణాలు నిర్వహించేవాళ్లలో పెద్ద వయసున్నవారంతా విధిగా జాగ్రత్తలు పాటించాలని, ఇతరులతో ప్రత్యక్ష సంబంధాలకు దూరంగా ఉంటం మంచిదని సూచించింది. ఈ మేరకు..

covid-19-markets-in-containment-zones-to-remain-shut-health-ministry-new-guidelines

నాన్ కంటైన్మెంట్ జోన్లలోని మార్కెట్లలో వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలకు సంబంధించి జాగ్రత్త చర్యలు అమలయ్యేలా, కేంద్రం గైడ్ లైన్లను పాటించేలా ఆయా మార్కెట్ ఓనర్స్ అసోసియేషన్లను సంప్రదించనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్కెట్లలో దుకాణందారులతోపాటు ప్రజలంతా విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని తద్వారానే వైరస్ వ్యాప్తిని నివారించగలమని ఆరోగ్య శాఖ పిలుపునిచ్చింది. అంతేకాదు..

స్వీయనియంత్రణ పాటించడంలో ఆయా మార్కెట్ కమిటీలు విఫలమైనా, కొత్త కేసుల సంఖ్య పెరిగినా.. వ్యాపార కార్యకాలాపాలపై తదుపరి ఆదేశాలు ఇస్తామని, వీలును బట్టి రోజు విడిచి రోజు దుకాణాలు తెరుచుకునే చర్యలు కూడా అమలుచేస్తామని తాజా మార్గదర్శకాల్లో ఆరోగ్య శాఖ పేర్కొంది.

షాకింగ్: బండి సంజయ్ కారుపై దాడి -డబ్బు సంచులతో వచ్చారంటూ -పోలింగ్ వేళ తీవ్ర ఉద్రిక్తతషాకింగ్: బండి సంజయ్ కారుపై దాడి -డబ్బు సంచులతో వచ్చారంటూ -పోలింగ్ వేళ తీవ్ర ఉద్రిక్తత

English summary
In a bid to contain the spread of Covid-19, the Ministry of Health and Family Welfare (MOHFW) issued a new set of guidelines for market places. According to the new guidelines, markets in containment zones will remain closed and only those outside containment zones will be allowed to function.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X