బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

COVID-19: దెబ్బకు హడల్, 10, 000 మంది పోలీసులకు కోవిడ్ పాజిటివ్, సెకండ్ వేవ్ తో షాక్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/హైదరాబాద్: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో సామాన్య ప్రజలతో పాటు పోలీసులు, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది హడలిపోతున్నారు. కరోనా వైరస్ హమమ్మారి నుంచి ప్రజలను కాపాడటానికి ప్రయత్నిస్తున్న 10 వేల మంది పోలసులకు కోవిడ్ పాజిటివ్ అని వెలుగు చూడటంతో సాటి పోలీసులు హడలిపోతున్నారు. ఐటీ హబ్ బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలో ఇప్పటి వరకు 9, 990 మందికి కరోనా పాజిటివ్ అని నిర్దరారణ అయ్యిందని స్వయంగా అధికారులు చెప్పడంతో సాటి పోలీసుల్లో కలవరం మొదలైయ్యింది.

Illegal affair: బెడ్ రూమ్ లో భార్య+బాయ్ ఫ్రెండ్, టెర్రాస్ లో లిక్కర్+ విషంతో భర్త, క్లైమాక్స్!Illegal affair: బెడ్ రూమ్ లో భార్య+బాయ్ ఫ్రెండ్, టెర్రాస్ లో లిక్కర్+ విషంతో భర్త, క్లైమాక్స్!

ఏడాదిలో కరోనా అరాచకం

ఏడాదిలో కరోనా అరాచకం

2020 ఏప్రిల్ నెల నుంచి ఈ రోజు వరకు బెంగళూరు నగరంతో పాటు కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాలు చేస్తున్న 9, 990 మంది పోలీసులకు కరోపా పాజిటివ్ అని వెలుగు చూసింది. కరోనా వైరస్ బారినపడి చికిత్స విఫలమై ఇప్పటి వరకు 107 మంది పోలీసుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

పోలీసులు అందరికీ కోవిడ్ వ్యాక్సిన్

పోలీసులు అందరికీ కోవిడ్ వ్యాక్సిన్

ఐటీ హబ్ బెంగళూరు సిటీతో పాటు కర్ణాటక వ్యాప్తంగా ఉన్న పోలీసు శాఖలోని సుమారు లక్ష మంది ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సిన్ వెయ్యాలని ఇప్పటికే కర్ణాటక డీఐజీ ప్రవీణ్ సూద్ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు మనవి చేశారు, కర్ణాటకలోని పోలీసులు అందరితో పాటు పోలీసు శాఖలో పని చేస్తున్న సిబ్బంది అందరికి కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని సీఎం కూడా పోలీసు అధికారులకు హామీ ఇచ్చారని తెలిసింది.

 సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ?

సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ?


కరోనా సెకండ్ వేవ్ దెబ్బతో ఏప్రిల్ 1వ తేదీ వరకు కర్ణాటకలో 295 మంది పోలీసులు కోవిడ్ బారినపడ్డారని అధికారులు అంటున్నారు.
కర్ణాటకలో ఇప్పటి వరకు 76, 000 మంది పోలీసులకు కోవిడ్ వ్యాక్సిన్ అందించారని, 46, 000 మంది పోలీసులకు సెకండ్ డోస్ ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు అంటున్నారు.

రూ. 30 లక్షలు పరిహారం

రూ. 30 లక్షలు పరిహారం

కర్ణాటకలో కోవిడ్-19 వ్యాధి సోకి చికిత్స విఫలమై పోలీసులు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ. 30 లక్షల పరిహారం ఇస్తామని ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ప్రతిరోజూ 24 గంటలు ప్రజలను కరోనా వైరస్ నుంచి కాపాడుతున్న పోలీసులకు మాత్రం ఆ వ్యాధి నుంచి కాపాడుకోవడానికి సరైన భద్రత లేదని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary
COVID-19: More than 10000 Karnataka Police tested Coronavirus Positive in last one year in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X