వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు డమ్మీ వ్యాక్సిన్: దేశవ్యాప్తంగా 2వ విడత డ్రైరన్ షురూ -అసలైన టీకాపైనా కేంద్రం కీలక ప్రకటన

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా మహమ్మారిని అరికట్టే దిశగా రాష్ట్రాల సహకారంతో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వ్యాక్సిన్ పంపిణీలో సమస్యలను, సిబ్బంది సమర్థతను అంచనా వేయడం కోసం తలపెట్టిన రెండో దశ డ్రైరన్ శుక్రవారం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా..

Recommended Video

COVID-19 Vaccine Dry Run in India దేశవ్యాప్తంగా డమ్మీ వ్యాక్సిన్ డ్రైరన్ -వచ్చే వారం అసలైన టీకాలు..!

 కరోనా: జనవరి 8న మరోసారి దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైరన్ -13నుంచి టీకాల పంపిణీ నేపథ్యంలో.. కరోనా: జనవరి 8న మరోసారి దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైరన్ -13నుంచి టీకాల పంపిణీ నేపథ్యంలో..

దేశంలోని 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 736 జిల్లాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమం కొనసాగుతోంది. జనవరి 2న నిర్వహించిన తొలి విడత డ్రైరన్‌లో గుర్తించిన లోపాలను సరిదిద్దుకోవాలని, వ్యాక్సిన్‌పై ప్రజల్లో అపోహలను తొలగించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఇప్పటికే కోల్డ్‌ చైన్‌ విధానాన్ని మరింత పటిష్టం చేసినట్లు వెల్లడించిన కేంద్రం.. వ్యాక్సినేషన్‌ కోసం మానవ వనరులు సిద్ధం చేసుకోవాలని కూడా రాష్ట్రాలకు సూచించింది. మరోవైపు..

covid-19: Nationwide 2ndCovid vaccination dry run today: center asks states to prepare

శుక్రవారం నాటి డ్రైరన్ లో డమ్మీ టీకాలను ఇస్తుండగా, ఇప్పటికే ఆమోదం పొందిన అసలైన టీకాలు (కొవిషీల్డ్, కొవాగ్జిన్ లను) పంపిణీ చేసే అంశంపైనా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తొలి విడత వ్యాక్సిన్ ను పంపుతున్నామని, దాన్ని ఫ్రంట్ లైన్ వరియర్లకు అందించేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు..

కేంద్ర ఆరోగ్య శాఖ ప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ అడ్వయిజర్ డాక్టర్ ప్రదీప్ హల్దేర్ గురువారం రాత్రి ఆయా రాష్ట్రాలకు లేఖలను పంపారు. శుక్రవారం నాటి డ్రైరన్ తర్వాత.. అసలైన వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన విధివిధానాలను, తేదీలను వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలకు వ్యాక్సిన్ డోసుల్ని పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని, కొవిన్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న వారికి తొలుత ఇవ్వాలని, ఆ సంఖ్య ఆధారంగా ఏ జిల్లాకు ఎన్ని టీకాలు పంపాలన్న విషయమై ముందుగానే ఓ అవగాహన ఏర్పరచుకోవాలని డాక్టర్ ప్రదీప్ లేఖలో పేర్కొన్నారు.

English summary
As India gears up to receive the first shipment of Covishield, the second phase of the nationwide coronavirus vaccination dry run will be held on friday. During the day-long exercise, more than 25 health workers will get dummy vaccines at each site, which is meant to test the mechanisms and reveal possible gaps in the system ahead of the actual Covid vaccination drive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X