వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ఢిల్లీ జమాత్ మీటింగ్ కు 9 వేల మంది, వైరస్ చైన్ లింక్: ఆంధ్రా, తెలంగాణలో !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) కు హాట్ స్పాట్ గా మారిన ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లిగి జమాత్ మీటింగ్ కు హాజరైన 9, 000 మందిలో ఎంత మందికి ఆ వ్యాధి సోకింది ? అనే విషయంపై దేశ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 9 వేల మంది తబ్లిగ్ జమాత్ సమావేశాలకు హాజరైనారని కేంద్ర ప్రభుత్వం ఆధారాలు సేకరించింది. దేశంలోని వివిద రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మొత్తం 7, 600 మందితో సహ విదేశాలకు చెందిన 1, 300 మంది హాజరైనారని కేంద్ర ప్రభుత్వ అధికారులు గుర్తించారు. ఈ 9 వేల మంది ఎవరెవరితో కలిశారు ? వారి వలన ఎంత మందికి కరోనా వైరస్ సోకింది ? అంటూ అధికారులు ఆరా తీస్తున్నారు.

Coronavirus దెబ్బ: కర్ణాటకలో ప్రజలకు ప్రతిరోజూ 7. 5 లక్షల లీటర్ల పాలు ఫ్రీ, సూపర్ సీఎం !Coronavirus దెబ్బ: కర్ణాటకలో ప్రజలకు ప్రతిరోజూ 7. 5 లక్షల లీటర్ల పాలు ఫ్రీ, సూపర్ సీఎం !

ఢిల్లీలో తబ్లిగి మీటింగ్ కు 9 వేల మంది

ఢిల్లీలో తబ్లిగి మీటింగ్ కు 9 వేల మంది

కరోనా వైరస్ వ్యాధి దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. భారతదేశంలో కరోనా వైరస్ ను అరికట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లిగి జమాత్ సమావేశాలకు దేశ వ్యాప్తంగా 7, 600 మంది భారతీయులు, విదేశాల నుంచి 1, 300 మంది హాజరైనారని కేంద్ర ప్రభుత్వం ఆధారాలు సేకరించింది.

కరోనా హాట్ స్పాట్ తబ్లిగి జమాత్

కరోనా హాట్ స్పాట్ తబ్లిగి జమాత్

ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లిగి జమాత్ సమావేశం కరోనా వైరస్ కు హాట్ స్పాట్ గా అవతరించిందని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే 9 వేల మంది ఈ సమావేశానికి హాజరైనారని, వారి వలన ఇంకా ఎంత మందికి కరోనా వైరస్ వ్యాపించి ఉంటుందో అంటూ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

23 రాష్ట్రాలు, విదేశాలు

23 రాష్ట్రాలు, విదేశాలు

ఢిల్లీలోని నిజాముద్దీన్ వెస్ట్ ప్రాంతంలోని మర్కజ్ మత కేంద్రంలో జరిగిన తబ్లిగి జమాత్ సమావేశానికి దేశంలోని 23 రాష్ట్రాలకు చెందిన వారు. నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన వారితో సహ విదేశాలకు చెందిన 1, 306 మంది హాజరైనారని కేంద్ర ప్రభుత్వం పక్కా ఆధారాలు సేకరించింది.

ఢిల్లీ దెబ్బకు దేశం విలవిల

ఢిల్లీ దెబ్బకు దేశం విలవిల

ఏప్రిల్ 1వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం సేకరించిన ఆధారాల ప్రకారం నిజాముద్దీన్ వెస్ట్ ప్రాంతంలోని మర్కజ్ మత కేంద్రంలో జరిగిన తబ్లిగి జమాత్ సమావేశానికి హాజరైన వారిలో 1, 051 మందిని నిర్భంధించారు, వారిలో 21 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అందులో ఇప్పటికే ఇద్దరు మరణించారు. తబ్లిగి జమాత్ కు చెందిన 7, 688 మంది దేశంలో వీలైనంత మందిని కలిశారని ప్రధాని కార్యాలయానికి చెందిన ఓ సీనియర్ అధికారి ఎన్ డీటీవీకి సమాచారం ఇచ్చారు.

ఢిల్లీ లింక్ తో ఎంత మందికి కరోనా అంటే !

ఢిల్లీ లింక్ తో ఎంత మందికి కరోనా అంటే !

ఢిల్లీ నిజాముద్దీన్ లో జరిగిన సమావేశాని హాజరైన వారి సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఢిల్లీ నిజాముద్దీన్ లో తబ్లిగి జమాత్ ప్రధాన కార్యాలయానికి భారతదేశంలోని 23 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన వారితో పాటు ఇండోనేషియా, నేపాల్, మలేషియా తదితర దేశాల నుంచి మొత్తం 9 వేల మందికి పైగా హాజరైనారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అందులో 400 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తమిళనాడులో ఎక్కువగా 190 కరోనా కేసులు నమోదైనాయి. తరువాత ఆంధ్రప్రదేశ్ లో 71, ఢిల్లీలో 53, తెలంగాణలో 28, అసోంలో 13, మహారాష్ట్రలో 12, అండమాన్ లో 10, జమ్మూ, కాశ్మీర్ లో 6, పుదుచ్చేరిలో 2, గుజరాత్ లో ఒక్క కరోనా వైరస్ కేసులు నమోదైనాయి.

లాక్ డౌన్ తో ఢిల్లీలో చిక్కిపోయారు

లాక్ డౌన్ తో ఢిల్లీలో చిక్కిపోయారు

ఢిల్లీలోని నిజాముద్దీన్ లోని మర్కజ్ లో తబ్లిక్ జమాత్ సమావేశాలకు, ప్రార్థనలు చెయ్యడానికి వచ్చిన వారిలో చాలా మంది లాక్ డౌన్ అయిన తరువాత రావాణ సౌకర్యం లేకపోవడంతో ఢిల్లీలోని ఆ సంస్థకు చెందిన ఇరుకుగా ఉన్న చిన్నచిన్న గదుల్లో చిక్కుకుపోయారు. లాక్ డౌన్ తరువాతే తబ్లిగి జమాత్ కు చెందిన మసీదుతో పాటు వాటి అనుభంద సంస్థల్లో ఉన్న 2, 335 మందిని బయటకు లాగి వారికి కరోనా వైద్య పరీక్షుల నిర్వహించామని ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యేంద్ర జైన్ మీడియాకు చెప్పారు. మొత్తం మీద ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లిగి జమాత్ కరోనా వైరస్ కు దేశవ్యాప్తంగా హాట్ స్పాట్ అయ్యిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

English summary
COVID 19: At least 7,600 Indians and 1,300 foreigners have been identified with links to an Islamic missionary group that organised a religious congregation in Delhi last month and has emerged as India's biggest hotspot in the coronavirus pandemic, the Union Home Ministry said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X