వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మకానికి కోవిడ్-19 నెగిటివ్ రిపోర్ట్... భరతం పట్టిన కలెక్టర్, అసలేం జరిగింది..?

|
Google Oneindia TeluguNews

మీరట్: కరోనావైరస్ నెగిటివ్ సర్టిఫికేట్ కావాలా... అయితే రూ.2500 చెల్లించండి. వెంటనే నెగిటివ్ సర్టిఫికేట్ ఇస్తామంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీయగా అది ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ నిర్వాకం అని తెలిసింది. వెంటనే మీరట్ జిల్లా కలెక్టర్ అలర్ట్ అయ్యారు. ఆ నర్సింగ్ హోమ్ వివరాలు తెలుసుకుని దాని లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.

బాబోయ్: గాలిలో కరోనా వైరస్...ఆధారాలు ఉన్నాయి: ప్రపంచ ఆరోగ్య సంస్థను హెచ్చరించిన నిపుణులు బాబోయ్: గాలిలో కరోనా వైరస్...ఆధారాలు ఉన్నాయి: ప్రపంచ ఆరోగ్య సంస్థను హెచ్చరించిన నిపుణులు

అసలు విషయానికొస్తే రూ. 2500కు కరోనావైరస్ నెగిటివ్ సర్టిఫికేట్ ఇస్తామంటూ ఆ నర్సింగ్‌హోమ్ సిబ్బంది వైరల్ అయిన వీడియోలో చెబుతున్నట్లుగా ఉంది. ఈ వీడియో వైరల్ కావడంతో చర్యలు తీసుకున్నట్లు మీరట్ జిల్లా కలెక్టర్ అనిల్ దింగ్రా చెప్పారు. అంతేకాదు ఆ హాస్పిటల్ లైసెన్స్‌ను కూడా రద్దు చేసినట్లు వెల్లడించారు. ఆదివారం రోజున ఆ నర్సింగ్ హోమ్‌ను సీల్ చేసినట్లు వెల్లడించిన కలెక్టర్ అనిల్.. ఇలాంటి తప్పుడు వీడియోలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే వీడియోలో ఉన్న వ్యక్తిని తాము గుర్తించినట్లు చెప్పిన మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజ్‌కుమార్.. ఆ వ్యక్తిని అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు.

Covid-19 negative report put for sale, Meerut hospital license cancelled

ఇక ఈ వైరల్ అయిన వీడియోలో తప్పుడు ప్రచారాన్ని నమ్మిన కొందరు రూ.2వేలు హాస్పిటల్ యాజమాన్యానికి చెల్లిస్తున్నట్లు కూడా ఉంది. మిగతా రూ.500 రిపోర్టు చేతికి అందాక ఇస్తామని డీల్ కుదుర్చుకుంటున్నట్లుగా ఉందని రాజ్‌కుమార్ చెప్పారు. ఇక హాస్పిటల్‌లో మేనేజర్‌గా పనిచేసే షా ఆలం అనే వ్యక్తి డబ్బులు చెల్లించండి కోవిడ్-19 నెగిటివ్ రిపోర్టు పొందండి అంటూ ప్రచారం చేస్తున్నట్లు తాము గుర్తించామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజ్‌కుమార్ వివరించారు. ఇదంతా ఇలా ఉంటే మీరట్‌లో వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 69 మంది మృతి చెందారు. మొత్తంగా ఉత్తర్ ప్రదేశ్లో 28వేలకు పైగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 785 మంది మృతి చెందారు.

ఆదివారం నాటికి ఉత్తర్ ప్రదేశ్‌లో 28,061 పాజిటివ్ కేసులు నమోదుకాగా 2,785 కరోనా పాజిటివ్ కేసులు ఒక్క గౌతమ బుద్ధ నగర్‌లోనే నమోదయ్యాయి. ఆ తర్వాత 2224 కేసులతో ఘజియాబాద్ రెండో స్థానంలో ఉండగా లక్నోలో 1448 కేసులు నమోదయ్యాయి. కాన్పూర్‌లో 1364 కేసులు నమోదు కాగా ఆగ్రాలో 1291 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

English summary
The licence of a private hospital in Meerut district has been suspended after a video showing its staff member providing fake Corona report in return for money, went viral on the social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X