• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Coronavirus:సెకండ్ థర్డ్ వేవ్ మరింత ప్రమాదకరం : కర్ఫ్యూలతో కట్టడి సాధ్యమేనా, నిపుణుల మాటేంటి?

|

కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. భారత్‌లో ప్రస్తుతం సెకండ్ వేవ్ నడుస్తోంది. 2021 ప్రారంభంలో కరోనావైరస్ పీడ వదిలిందని అంతా ఊపిరి తీసుకుంటున్న క్రమంలో పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరుగుతూ వచ్చాయి. దీనంతటికీ కారణం ప్రజలు అలసత్వం వహించడం వల్లే అని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో కొత్త స్ట్రెయిన్ కూడా దేశంలోకి ప్రవేశించడంతో ఆ వ్యాప్తి మరింత వేగంగా జరిగిందని కూడా నిపుణులు చెబుతున్నారు.

ఈ సారి 2020 ఏప్రిల్ మాసంలో కరోనా ఎంత వేగంగా వ్యాప్తి చెందిందో ఈ ఏడాది అంటే 2021లో కూడా అంతకంటే డేంజర్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామంది అడుగుతున్న ప్రశ్న మాత్రం ఈ మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందని.. అయితే దీనికి ఎవరూ కచ్చితమైన సమాధానం ఇవ్వలేకున్నారు.

 లాక్‌డౌన్‌తో కరోనా కట్టడి సాధ్యమేనా

లాక్‌డౌన్‌తో కరోనా కట్టడి సాధ్యమేనా

కరోనావైరస్‌పై ఉన్న అనుమానాలు అపోహలు, ప్రశ్నలకు కొందరు వైద్యులు, నిపుణులు మాత్రం కొంత వరకు సంతృప్తికరమైన సమాధానం ఇస్తున్నారు. కరోనావైరస్ కట్టడికి లాక్‌డౌన్ అనేది కొంత వరకు పనికొస్తుందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ మండే చెబుతున్నారు.

లాక్‌డౌన్ విధిస్తే ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని కూడా చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఇందుకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

కరోనా కట్టడికి ఇదే మార్గం

కరోనా కట్టడికి ఇదే మార్గం

గతేడాది లాక్‌డౌన్ విధించడంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. అంతేకాదు చాలామంది చిరువ్యాపారస్తులు నష్టపోయారు. అదే సమయంలో కొన్ని వందల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి.ఈ నేపథ్యంలో మరో లాక్‌డౌన్ సాధ్యమేనా అన్న ప్రశ్నకు... లాక్‌డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావం పడుతుందని డాక్టర్ శేఖర్ చెప్పారు. ఉదాహరణకు ముంబైలో కేసులు పెరిగిపోవడంతో లాక్‌డౌన్ విధించడం జరిగింది. అయితే ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడిందని గుర్తుచేశారు. లాక్‌డౌన్ విధించడం వల్ల వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అంటే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వైరస్ సంక్రమించకుండా లాక్‌డౌన్ పేరుతో కట్టడి చేస్తున్నామని చెప్పారు.

కోవిడ్ కేసులు ఉన్న చోట్ల వెంటనే పరీక్షలు నిర్వహించి, కోవిడ్ సోకిన వారిని గుర్తించి వారిని ఐసోలేషన్‌లో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఇలా చేయడం మంచి ఫలితాలను ఇచ్చిందని గుర్తుచేశారు. కరోనా ఒక్కటే కాదని గతంలో చాలా వ్యాధులను ఇదే పద్ధతిలో అడ్డుకోగలిగామని చెప్పారు. ఓ వైపు వ్యాక్సినేషన్ ఇస్తూనే మరోవైపు వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యలపై దృష్టి పెట్టాలన్నారు.

 రాత్రి వేళల్లో కర్ఫ్యూలు ఎందుకు విధిస్తారు..?

రాత్రి వేళల్లో కర్ఫ్యూలు ఎందుకు విధిస్తారు..?

ఇక రాత్రివేళల్లో కర్ఫ్యూల గురించి కూడా డాక్టర్ శేఖర్ వివరించారు. సాధారణంగా మూసివేసి ఉన్న గదిలో కరోనా వైరస్ అనేది ఎక్కువగా బతికి ఉంటుందని అదే బయట ప్రదేశాల్లో అయితే ఎక్కువ సమయం జీవించి ఉండదని చెప్పారు. గతేడాది నవంబర్ డిసెంబర్ నెలల్లో ప్రజలు చాలామంది పార్టీలు, కార్యక్రమాలు, సభలు సమావేశాలకు పెద్ద సంఖ్యలో గుంపులు గుంపులుగా హాజరయ్యేవారని అలా కావడంతో వైరస్ ఎంతోమందిని కాటేసిందని చెప్పారు.

సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు సాయంత్రం నుంచి రాత్రి వరకు జరుగుతున్నాయి కాబట్టి రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధిస్తే ఇలాంటి కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయడం తద్వారా వైరస్‌ను నియంత్రించవచ్చనే ఉద్దేశంతోనే నైట్ కర్ఫ్యూలు విధించడం జరుగుతోందని చెప్పారు.

అజాగ్రత్తతో ఉంటే అంతే సంగతులు

అజాగ్రత్తతో ఉంటే అంతే సంగతులు

ఇక సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని చెప్పారు. ఒకసారి వైరస్ వ్యాప్తి తగ్గిందన్న నిర్ణయానికి వస్తే ప్రజలు అజాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. అంటే తగిన జాగ్రత్తలు పాటించడం లేదు. దీంతో మళ్లీ వైరస్ బుసకొడుతోంది. వైరస్ కాస్త తగ్గిందే తప్ప వ్యాప్తి చెందడం మాత్రం పూర్తిగా తగ్గలేదు. ఈ విషయాన్ని ప్రజలు మరిచి మళ్లీ యథాతథంగా జీవిస్తున్నారు. ఇక్కడే తేడా కొడుతోందని డాక్టర్ శేఖర్ చెప్పారు. ఇక యూకే కొత్త మూటెంట్ వేగంగా వ్యాప్తి చెందుతోందా లేదా అనేదానిపై పరీక్షలు నిర్వహిస్తున్నారని మరో రెండు వారాల్లో దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు.

 మ్యూటేషన్స్ నిరంతర ప్రక్రియ

మ్యూటేషన్స్ నిరంతర ప్రక్రియ

దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ, 65 ఏళ్లు పైబడి వయస్సున్న వ్యక్తులే ఫస్ట్ వేవ్ కరోనాకు బలైనవారిలో ఎక్కువగా ఉన్నారు. ఇక వారికి వ్యాక్సిన్ ఇవ్వడంతో కొంత వరకు ప్రాణ నష్టం తగ్గిందని డాక్టర్ శేఖర్ వివరించారు. ప్రస్తుతం మరణాల రేటు గతంతో పోలిస్తే కాస్త తక్కువగానే ఉందని వివరించారు. వ్యాక్సిన్ వేసుకుంటే వైరస్ మళ్లీ దాడి చేయదనే అపోహను వీడాలి. వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ముఖానికి మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ చేసుకోవడం వంటివి కొనసాగించాలి. హర్డ్ ఇమ్యూనిటీ వరకు పరిస్థితిని తీసుకురాకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు.

అన్ని వైరస్‌లు వేవ్స్‌లో వస్తాయని, సెకండ్ వేవ్ ముగిసిందని అజాగ్రత్తతో ఉంటే థర్డ్ వేవ్ మరింత ఉధృతంగా వ్యాపిస్తుందని చెప్పారు. చివరిగా మ్యూటేషన్స్ ఒక్కసారి ప్రారంభం అయ్యాక సాధారణంగా తగ్గవని ఇది నిరంతరం జరిగే ప్రక్రియని చెప్పారు. ఇక కాలక్రమంలో వైరస్‌లు తగ్గుతూ వచ్చి ఒక ప్రాంతంకు మాత్రమే పరిమితమై ఆ తర్వాత తగ్గుముఖం పడుతాయి. అయితే కొన్నేళ్ల పాటు ఈ ప్రక్రియ ఉంటుంది.

English summary
The second and third wave of Coroanvirus will be more intense said the health experts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X