వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో కరోనా -కొత్త రకం వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి -యూకే స్ట్రెయిన్ బారిన 73 మంది..

|
Google Oneindia TeluguNews

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పుడిప్పుడే కంట్రోల్ లోకి వస్తుండగా.. బ్రిటన్ నుంచి వ్యాపించిన కొత్త రకం వైరస్ కేసులు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా మరో రెండు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 73కి పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు బుధవారం వివరాలు వెల్లడించింది.

Recommended Video

Corona New Strain : 20 New Type Corona Virus Positive Cases Found In India

బర్డ్ ఫ్లూ విలయం: చికెన్, గుడ్లు తింటున్నారా? -అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలుబర్డ్ ఫ్లూ విలయం: చికెన్, గుడ్లు తింటున్నారా? -అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు

మంగళవారం సాయంత్రానికి సాయంత్రానికి 13 కొత్త కేసులు రావడంతో బ్రిటన్ స్ట్రెయిన్ బాదితుల సంఖ్య 71కు పెరగ్గా, తాజాగా మరో రెండు కేసులు రావడంతో 73కు చేరింది.

covid-19: Number of Indians infected with UK strain rises to 73

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పుడిప్పుడే కంట్రోల్ లోకి వస్తుండగా.. బ్రిటన్ నుంచి వ్యాపించిన కొత్త రకం వైరస్ కేసులు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా మరో రెండు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 73కి పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు బుధవారం వివరాలు వెల్లడించింది.

హిందూపురం: బాలయ్యకు షాక్ -జగన్ కుటుంబ చరిత్రే అంత -ప్రత్యేక రాష్ట్రం తేస్తానని హామీహిందూపురం: బాలయ్యకు షాక్ -జగన్ కుటుంబ చరిత్రే అంత -ప్రత్యేక రాష్ట్రం తేస్తానని హామీ

మంగళవారం సాయంత్రానికి సాయంత్రానికి 13 కొత్త కేసులు రావడంతో బ్రిటన్ స్ట్రెయిన్ బాదితుల సంఖ్య 71కు పెరగ్గా, తాజాగా మరో రెండు కేసులు రావడంతో 73కు చేరింది. ప్రస్తుతం వీరందరినీ ఆయా రాష్ట్రాలు ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అంతేకాకుండా వారితో సన్నిహితంగా మెలిగిన వారిని కూడా క్వారంటైన్‌లో ఉంచినట్లు పేర్కొంది.

తొలుత యూకేలో వెలుగుచూసిన ఈ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు కొత్తరకం కేసుల కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ను కూడా కొనసాగుతుండడంతోపాటు వైరస్‌ సోకిన వారి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కూడా చేపడుతున్నామని కేంద్రం తెలిపింది. ముందుజాగ్రత్త చర్యగా డిసెంబర్‌ 23 నుంచి జనవరి 7వరకు యూకేకు విమాన ప్రయాణాలను భారత్‌ నిలిపివేసింది.

కొత్త రకం కరోనా బారినపడిన వారితో ప్రయాణించినవారు, కుటుంబ సభ్యులు, ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు ఈ వైరస్‌ 41 దేశాలకు వ్యాపించినట్టు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. బ్రిటన్‌లో తొలుత బయటపడిన కోవ్‌-202012/01 రకం కరోనా వైరస్‌ జనవరి 5 నాటికి 40దేశాలు/ప్రాంతాలకు విస్తరించిందని, దక్షిణాఫ్రికాలో బయటపడ్డ 501.V2 రకం వైరస్‌ ఆరు దేశాలకు వ్యాపించిందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఇదిలా ఉంటే..

కరోనా కొత్త 'స్ట్రెయిన్‌' కారణంగా బ్రిటన్‌లో ఏర్పడిన ప్రజారోగ్య సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా భారత్‌లో జనవరి 26 జరిగే గణతంత్ర దినోత్సవానికి హాజరు కాలేకపోతున్నట్టు బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ వెల్లడించారు. బ్రిటన్‌లో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో స్థానిక పరిస్థితులపై ప్రధాని దృష్టి పెట్టడం అవసరం కావడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం పేర్కొంది.

English summary
The total number of Indians infected with the more contagious UK strain of the coronavirus now stands at 73, the health ministry said on Wednesday evening. All these persons have been kept in single room isolation in designated health care facilities by respective state governments, the ministry said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X