వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విస్తరిస్తోన్న వేళ.. ఆన్‌లైన్ ఫుడ్, హోమ్ డెలివరీల మాటేంటీ?: పాటించాల్సిన చిట్కాలివే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా భయానకంగా విస్తరిస్తోన్న వేళ..దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. తొమ్మిదిరోజులుగా ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. విద్యార్థులు, ఉద్యోగులు.. ఇళ్లకు దూరం అయ్యారు. తాము పని చేసే ప్రాంతాల్లోనే చిక్కుకుపోయారు. రవాణా వ్యవస్థ స్తంభించి పోవడం వల్ల ఎటూ వెళ్లలేకపోతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు మూత పడటంతో ఆన్‌లైన్ ద్వారా ఆహార పదార్థాలను తెప్పించుకోవాల్సి వస్తోంది.

కరోనా కమ్మేసిన ప్రస్తుత వాతావరణంలో ఆన్‌లైన్ ద్వారా చేతికి అందే ఆహారం, హోమ్ డెలివరీలు, ఆన్‌లైప్ ఫుడ్ ప్యాకేజింగ్ పట్ల అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. హోమ్ డెలివరీలు నేరుగా మన ఇంటికే కరోనా వైరస్‌ను మోసుకొచ్చే పరిస్థితులకు అవకాశాలు లేకపోలేదు. వాటిని అందుకున్న మనం వినియోగదారులకు కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి.

 Covid-19 Outbreak: How to make your food packaging for ready-to-eat meals or takeaways

ఈ పరిస్థితుల్లో- ఆన్‌లైన్ ఫుడ్, హోమ్ డెలివరీలను ఎలా కరోనా ఫ్రీగా మార్చాలనే అంశం చర్చనీయాంశమైంది. దీనికోసం కొన్ని రకాల చిట్కాలను పాటించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు నిపుణులు. ఆహార పదార్థాల ద్వారా కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందనడానికి ఇప్పటిదాకా ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు. మనం తినే పదార్థల ద్వారా వైరస్ సోకుతుందడనానికి నిదర్శనాలు ఇప్పటిదాకా ఎక్కడా నమోదు కాలేదు.

గుడ్‌న్యూస్: కాకినాడలో కోలుకున్న కరోనా పేషెంట్..డిశ్చార్జి: వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే దగ్గరుండి మరీ.. !గుడ్‌న్యూస్: కాకినాడలో కోలుకున్న కరోనా పేషెంట్..డిశ్చార్జి: వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే దగ్గరుండి మరీ.. !

అయినప్పటికీ- ఆన్‌లైన్ ఆహారాన్ని ప్యాక్ చేయడానికి వినియోగించే వస్తువుల ద్వారా కరోనా సోకే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. దీన్ని నివారించడానికి కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుందని చెబుతున్నారు. వినియోగించడానికి 72 గంటలకు ముందు సిద్ధం చేసిన ఆహార పదార్థాల వల్ల గానీ, ప్యాకేజీ వల్ల గానీ వైరస్ సోకదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏరకమైన వస్తువపైన అయినా సరే.. కరోనా వైరస్ 72 గంటల పాటు జీవించి ఉండే అవకాశం ఎంత మాత్రమూ లేదని అంటున్నారు. 72 గంటలకు ముందు ప్యాక్ చేసిన ఆహార పదార్థల, ప్యాకింగ్ వల్ల దీని భయం ఉండదని చెబుతున్నారు.

Recommended Video

PM Urges People To Light Diyas For 9 Minutes On April 5 At 9 PM

రెడీ టు ఈట్, టేక్ అవే ఫుడ్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలను తప్పకుండా పాటించాల్సి ఉంటుందని అంటున్నారు. అలాంటి ఫుడ్ హోమ్ డెలివరీ అందినప్పుడు వినియోగించడానికి ముందు దాన్ని ఒకటికి రెండుసార్లు బ్లీచ్ చేయాల్సి ఉంటుందని, ప్యాకింగ్‌ను శుభ్రంగా తుడావాలని సూచిస్తున్నారు. ఫుడ్ ప్యాక్‌ను కనీసం నిమిషం పాటు తుడిచి శుభ్రపరిచిన తరువాతే వినియోగించాలని వార్విక్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ జేమ్స్ గిల్ తెలిపారు. పిజ్జా వంటి ఆహార పదార్థాలను మరోసారి వేడి చేయడం అత్యుత్తమం అని అన్నారు. పండ్లు, కూరగాయలను ఇంటికి తీసుకొచ్చిన వెంటనే.. వాటిని కుళాయిల కింద కడగాలని అనంతరం ఎండలో ఆరబెట్టడం మంచదని గిల్ చెప్పారు.

English summary
While there's no evidence that Covid-19 (the disease) or SARS-Cov-2 (the virus) is transmitted through food, as thorough food, as thorough cooking kills the virus, the food packaging for ready-to-eat meals or takeaways may unwittingly become a carrier, even though they are "not known to present a specific risk.".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X