వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొంపముంచిన కరోనా-దేశవ్యాప్తంగా పెరిగిన డయాబెటిస్‌ కేసులు - ప్రమాద ఘంటికలు

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా సమయంలో జనం ఇళ్లకే పరిమితం కావడం తీవ్ర ప్రభావం చూపినట్లు నివేదికలు వస్తున్నాయి. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో జనం ఇళ్లలోనే ఉండిపోవడం వల్ల వారి శరీరంలో బ్లడ్‌ షుగర్‌ స్ధాయిలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా డయాబెటిస్‌ రోగుల శరీరాల్లో ఈ స్ధాయిలు తీవ్రంగా ఉన్నట్లు తాజాగా డాక్టర్లు నిర్ధారించారు. నవంబర్ 14న అంతర్జాతీయ డయాబెటిస్ దినం నేపథ్యంలో దేశవ్యాప్తంగా రోగుల్లో బ్లడ్‌ షుగర్‌ స్ధాయిలపై అప్రమత్తం చేస్తున్న డాక్టర్లు రాబోయే ప్రమాదాన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నారు. అప్రమతంగా ఉండకపోతే డయాబెటిస్‌ రోగుల ఆయుష్షు తీయడం ఖాయమంటున్నారు.

ఢిల్లీలో దాదాపు ప్రతీ ఇంట్లో కరోనా- ఆంక్షల సడలింపు ఎందుకంటూ కేజ్రివాల్‌కు హైకోర్టు అక్షింతలు...ఢిల్లీలో దాదాపు ప్రతీ ఇంట్లో కరోనా- ఆంక్షల సడలింపు ఎందుకంటూ కేజ్రివాల్‌కు హైకోర్టు అక్షింతలు...

 లాక్‌డౌన్‌లో పెరిగిన డయాబెటిస్‌...

లాక్‌డౌన్‌లో పెరిగిన డయాబెటిస్‌...

దేశవ్యాప్తంగా కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి 22 నుంచి దాదాపు మూడు, నాలుగు నెలల పాటు లాక్‌డౌన్‌ కొనసాగింది. కేంద్రం మార్దదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడంతో జనం ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ సందర్భంగా రోగులను మరింత అప్రమతంగా ఉండాలని ప్రభుత్వాలు కోరడంతో వారు ఇళ్లు వదిలి బయటికి రాలేదు. చిన్నా చితకా ఆరోగ్య సమస్యలున్నా ఇళ్లలోనే ఉండిపోయారు. దీంతో వీరికి శారీరక శ్రమ లేకుండా పోయింది. అది వారి శరీరాల్లో బ్లడ్‌ షుగర్‌ స్ధాయిలను విపరీతంగా పెంచినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. లాక్‌ డౌన్‌ ఎత్తేశాక పరిస్ధితి కాస్త మెరుగుపడినా ఇంకా అప్పటి పరిస్దితులు మాత్రం ప్రభావం చూపుతూనే ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

తాజా నివేదికలతో ప్రమాద ఘంటికలు...

తాజా నివేదికలతో ప్రమాద ఘంటికలు...

కరోనా సమయంలో విధించిన లాక్‌డౌన్‌ సందర్భంగా దేశవ్యాప్తంగా డయాబెటిస్‌ వ్యాధి ఏ మేరకు నియంత్రణలో ఉందో తెలుసుకునేందుకు ఇంపాక్ట్‌ ఇండియా క్యాంపెయిన్‌ పేరుతో ఓ పరిశీలన నిర్వహించారు. దీని ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో దేశవ్యాప్తంగా 2018 నుంచి తగ్గుతూ వస్తున్న డయాబెటిస్‌ కారక హెచ్‌బీఏ1సీ తిరిగి లాక్‌డౌన్‌లో భారీగా పెరిగిందని తేలింది. లాక్‌డౌన్‌లో జనంలో ఇళ్లలో ఉండిపోవడం వల్ల వారిలో శారీరక శ్రమ పెరిగి బ్లడ్‌ షుగర్ స్ధాయిలు పెరిగినట్లు నిర్ధారణ అయింది. దీని ప్రభావం వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో, వివిధ స్ధాయిల్లో ఉందని తేలింది.

డయాబెటిస్‌పై లాక్‌డౌన్‌ దీర్ఘకాల ప్రభావం..

డయాబెటిస్‌పై లాక్‌డౌన్‌ దీర్ఘకాల ప్రభావం..


కరోనా లాక్‌డౌన్‌ సమయంలో డయాబెటిస్‌ రోగుల్లో పెరిగిన బ్లడ్‌ షుగర్‌ స్ధాయిల ప్రభావం వారిపై దీర్ఘకాలంగా ఉండబోతోందని ఇంపాక్ట్‌ క్యాంపెయిన్‌ అధ్యయనంలో నిర్దారించారు. లాక్‌డౌన్‌ కాలంలో పెరిగిన బ్లడ్‌ షుగర్‌ స్ధాయిలు తిరిగి సాధారణ స్ధాయికి రావాలన్నా కనీసం వచ్చే ఏడాది జూన్‌ వరకూ సమయం పట్టే అవకాశముందని తేల్చారు. దీన్ని ఎలా తగ్గించాలనే దానిపై ఇప్పడు డాక్లర్లు అధ్యయనం చేస్తున్నారు. అయితే ఏడాది కష్టపడినా కేవలం 1 శాతం ప్రభావం మాత్రమే తగ్గే అవకాశముందని భావిస్తున్నారు. లాక్‌డౌన్‌లో 8.5 శాతానికి చేరిన హెచ్‌బీఏ1సీ స్ధాయిల్ని వచ్చే జూన్‌ నాటికి 7.6శాతానికి తగ్గించే లక్ష్యంతో ప్రయత్నాలు జరుగుతున్నాయి.

English summary
the covid 19 pandemic could have a severe and adverse impact on blood sugar levels among diabetes patients across the country, said doctors just ahead of world diabetes day on november 14.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X