వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్వారంటైన్లలో బీభత్సం: నర్సులు ముందు ఒంటిపై బట్టలు లేకుండా: బూతు పాటలతో.. !

|
Google Oneindia TeluguNews

లక్నో: కరోనా అనుమానితుల పేషెంట్లు, బాధితుల ప్రాణాలను కాపాడటానికి అహర్నిశలు శ్రమిస్తోన్న డాక్టర్లు, నర్సులు సరికొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. క్వారంటైన్లలో ఉంటోన్న కొందరు కరోనా అనుమానిత పేషెంట్లు.. వైద్యానికి ఏ మాత్రం సహకరించట్లేదు. నర్సులు, మహిళా డాక్టర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఒంటిపై బట్టలు లేకుండా క్వారంటైన్లలో తిరుగాడుతున్నారు. దీనిపై ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి పోలీసులకు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు.

ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు భవనంలో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరిని ఘజియాబాద్‌లోని ఎంఎంజీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉంచారు. వారికి వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. వారిలో కొందరు వైద్య పరీక్షలకు సహకరించట్లేదంటూ మహిళా డాక్టర్లు, నర్సులు ఫిర్యాదు చేశారు.

Covid-19 patients does not cooperate for treatment, says Ghaziabad CMO

తాము వైద్య చికిత్స నిర్వహించడానికి వెళ్లిన సమయంలో క్వారంటైన్లలో ఉన్న కొందరు అనుమానిత పేషెంట్లు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. బట్టలు లేకుండా తిరుగుతున్నారని, సిగరెట్లను తెచ్చివ్వాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. తమ సమక్షంలో బూతు పాటలు పాడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. నర్సులు చెప్పిన విషయాన్ని ధృవీకరించుకున్న తరువాత చీఫ్ మెడికల్ ఆఫీసర్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు.

Covid-19 patients does not cooperate for treatment, says Ghaziabad CMO

Recommended Video

Coronavirus : Watch IAF's C-17 Globemaster Lands With Indian Pilgrims From Iran

ఇలాంటి పరిస్థితుల్లో వారికి వైద్య చికిత్సలను నిర్వహించడం కష్టతరమౌతుందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పేషెంట్లు సహకరించినప్పుడే తాము వైద్యాన్ని అందించగలమని, క్వారంటైన్లలో అలాంటి వాతావరణాన్ని కల్పించాలని విజ్ఙప్తి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆసుపత్రిని సందర్శించారు. పేషెంట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మరోసారి అలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

English summary
Ghaziabad CMO has written a letter to the local police saying that the Tablighi Jamaat Markaz event attendees, who have been put under observation at the Ghaziabad hospital, have been misbehaving with the hospital staff. The hospital's nursing staff has complained against these patients, the CMO in the letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X