వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాపై ప్రధాని మోదీ కీలక సందేశం - ప్రతి భారతీయుణ్ని కాపాడటమే మిషన్ - 3హైటెక్ ల్యాబ్స్..

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి విషయంలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్ మెరుగైన స్థితిలో ఉందని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యపడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడం వల్లే ఇవాళ ఇండియాలో కొవిడ్-19 మరణాల రేటుగానీ, రికవరీ రేటుగానీ గణనీయంగా ఉందని చెప్పారు. పరిస్థితి మెరుగ్గా ఉన్నంత మాత్రాన అంతా అయిపోయినట్లు కాదని, ప్రతి భారతీయుణ్ని కాపాడుకోవడమనే మిషన్ ఇంకా కొనసాగుతుందని తెలిపారు.

Recommended Video

COVID-19 : CM లతో Modi కీలక సమావేశం.. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో చర్చ! || Oneindia Telugu

కరోనా భయంతో కారు రాంగ్ టర్న్ - గర్భిణి సింధు రెడ్డి విషాదాంతం - తుంగభద్రలో మృతదేహం లభ్యం..కరోనా భయంతో కారు రాంగ్ టర్న్ - గర్భిణి సింధు రెడ్డి విషాదాంతం - తుంగభద్రలో మృతదేహం లభ్యం..

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన మూడు అత్యాధునిక కొవిడ్-19 టెస్టింగ్ ల్యాబ్ లను ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. ముంబై, నోయిడా, కోల్ కతా సిటీల్లో ఏర్పాటైన ఈ హైటెక్ ల్యాబ్ లు.. కరోనాపై దేశం కొనసాగిస్తోన్న పోరుకు మరింత బలాన్ని చేకూర్చుతాయని ప్రధాని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఆయనీ కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు.

covid-19: PM Modi launches 3 high-end testing labs, says India in better position

''కరోనా వైరస్ పుట్టిన కొత్తలో మన దేశంలో ఒకే ఒక్క ల్యాబ్(పుణె వైరాలజీ ల్యాబ్) ఉండేది. ఈ పరీక్షా సమయంలో మనం ల్యాబ్ ల సంఖ్య ను 1300కు పెంచుకోగలిగాం. వాటి ద్వారా ప్రతి రోజూ 5 లక్షలకుపైగా శాంపిళ్లను టెస్టు చేస్తున్నాం. కొత్తగా అందుబాటులోకి వచ్చిన మూడు హైటెక్ ల్యాబ్ లతో రోజువారీ టెస్టుల సంఖ్య మరో 10 వేలు పెరుగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 11వేల కొవిడ్ ఫెసిలిటీలను ఏర్పాటు చేసుకున్నాం. 11 లక్షల పైచిలుకు ఐసోలేషన్ బెడ్లను తయారు చేసుకున్నాం. ఆ విధంగా ప్రతి భారతీయుడిని కాపాడుకోవడమనే మిషన్ కొనసాగతోంది''అని మోదీ వివరించారు.

పాపులర్ నటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం - రాజకీయ పార్టీల వేధింపుల వల్లేనంటూ - భాషా దురభిమానం కారణమా?పాపులర్ నటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం - రాజకీయ పార్టీల వేధింపుల వల్లేనంటూ - భాషా దురభిమానం కారణమా?

ముంబై, నోయిడా, కోల్ కతా లాంటి మహానగరాలు.. లక్షల మంది యువతకు ఉపాధి కేంద్రాలుగా ఉన్నాయని, ఆ మూడు నగరాల్లో ఏర్పాటైన హైటెక్ ల్యాబ్ లు కేవలం కరోనా సేవలకే పరిమితమై పోకుండా, రాబోయే రోజుల్లో డెంగీ, హెచ్ఐవీ, హెపటైటిస్ లాంటి వ్యాధులపైనా పరీక్షలు చేపడుతాయని ప్రధాని తెలిపారు. ఇండియాలో కరోనాపై పోరాటాన్ని ప్రజలే నడిపిస్తున్నారని, హెల్త్ సిబ్బంది, ఏఎన్ఎంలు, అంగన్ వాడీలు విశేష పాత్ర పోషిస్తున్నారని ప్రధాని కొనియాడారు. ఒక దశలో పీపీఈ కిట్ల కొరత ఎదుర్కొన్నా, ఇవాళ ప్రపంచంలోనే పీపీఈ కిట్స్ తయారీలో భారత్ రెండో స్థానంలో ఉండదని మోదీ చెప్పారు.

English summary
Prime Minister Narenda Modi launches COVID-19 3 new high-throughput testing facilities in Noida, Mumbai and Kolkata on monday. he said, India is in a much better situation in the fight against the Covid-19 pandemic because of the right decisions at the right time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X