వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాపై కేంద్రం గుడ్ న్యూస్ -70 శాతానికి పెరిగిన రికవరీ - 2 శాతానికి తగ్గిన మరణాలు

|
Google Oneindia TeluguNews

భారత్ లో కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. వరుస చర్యల ఫలితంగా దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు పెరుగుతుండగా.. మరణాల రేటు కూడా భారీగా తగ్గుతున్నట్లు కేంద్రం ఇవాళ ప్రకటించింది. అటు ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌ను అభివద్ధి చేసినట్లు రష్యా ప్రకటన చేసిన రోజే కేంద్రం తాజా వివరాలను బయటపెట్టడంతో రోగులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా బాధితుల రికవరీ రేటు 70 శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ ప్రకటించింది. గతంలో పోలిస్తే మరణాల రేటు కూడా తగ్గి ప్రస్తుతం 2 శాతం కంటే తక్కువగా నమోదవుతుందని అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 47,746 మంది రోగులు డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 15,83,489కి చేరుకుంది. అయితే గత 24 గంటల్లో 53 వేల కొత్త కేసులు నమోదైనట్లు ప్రధాని మోడీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా వెల్లడించారు.
వీటితో పాటు 871 మరణాలు కూడా చోటు చేసుకున్నాయి.

covid 19 recovery rate raises to 70% and fatality rate falls below 2% in india

ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 22,68,675 కాగా.. 45,257 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో పరిస్ధితిని నియంత్రించగలిగితే భారత్ కరోనా నుంచి బయటపడినట్లేనని ప్రధాని మోడీ ఇవాళ చేసిన ప్రకటన తాజా పరిస్ధితికి అద్దం పట్టేలే ఉందని తెలుస్తోంది.

English summary
with frequest measures, covid 19 recovery rate has jumped to 70 percent while the case fatality rate has fallen below 2%, said the Union Health Ministry today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X