బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru rules: కారులో ఒక్కరైనా రూల్ రూలే, మేడమ్ అయినా సార్ అయినా అంతే, దూలతీరింది!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID-19) నియమాల దెబ్బకు ఇప్పుడు ప్రజలు హడలిపోతున్నారు. ఐటీ బీటీ హబ్ బెంగళూరు సిటీలో మరో కొత్తరూల్ అమలులోకి వచ్చింది. కారులో, బైక్ లో ఒంటరిగా వెలుతున్నా సరే కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి, లేదంటే మీ జోబులకు చిల్లుపడుతుంది అంటూ బీబీఎంపీ అధికారులు రాత్రికి రాత్రి కొత్త రూల్ అమలులోకి తీసుకువచ్చారు. కారులో గ్లాస్ డోర్ క్లోజ్ చేసినా సరే ముఖానికి మాస్క్ లేకుండా కనపడితే మీ జోబుకు ఖాళీ చేసుకోవాలని, మేడమ్ అయినా సరే సార్ అయినా సరే ఈ రూల్ అమలులో ఉంటుందని బీబీఎంపీ సిబ్బంది అంటున్నారు.

Illegal affair: భర్త ఎగ్ రైస్ వ్యాపారి, గుడ్డు పక్కింట్లో పెడుతున్నాడని రాగిముద్దతో చంపేసిన భార్య!Illegal affair: భర్త ఎగ్ రైస్ వ్యాపారి, గుడ్డు పక్కింట్లో పెడుతున్నాడని రాగిముద్దతో చంపేసిన భార్య!

కారులో మేడమ్ అయినా సార్ అయినా అంతే

కారులో మేడమ్ అయినా సార్ అయినా అంతే


బెంగళూరు సిటీలో కార్లలో సంచరించే వాళ్లు ఎవరైనా సరే వాహనం నడుపుతున్న వాళ్లు కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP) అధికారులు మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఆదేశాలు అమలు చేశారు. కారు నడుపుతున్నది సార్ అయినా సరే.... మేడమ్ అయినా సరే ఈ నియమాలు కచ్చితంగా పాటించాలని బీబీఎంపీ అధికారులు ఆదేశించారు.

 ఒక్కరు ఉన్నా అదే కథ.... అదే రూల్

ఒక్కరు ఉన్నా అదే కథ.... అదే రూల్

కారులో ఒక్కరే వెలుతున్నాము, కారు డోర్ గ్లాస్ మూసివేశాము అని కథలు చెప్పకూడదని, కారులో ఒక్కరు ఉన్నా, ఇద్దరు ముగ్గురు ఉన్నా కచ్చితంగా మాస్క్ లు వేసుకోవాలని బీబీఎంపీ అధికారులు సూచించారు. బెంగళూరులో ఇక ముందు బైక్ లో ఒక్కరు వెళ్లినా సరే కచ్చితంగా మాస్క్ లు వేసుకోవాలని బీబీఎంపీ అధికారులు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.

 జస్ట్ రూ. 250 ఫైన్

జస్ట్ రూ. 250 ఫైన్

భౌతికదూరం పాటించకున్నా, రోడ్ల మీద పిచ్చపాటి మీటింగ్ లు పెట్టినా, మాస్క్ లేకుండా బైక్, కారు నడిపినా సరే ఒక్కొక్కసారికి రూ. 250 అపరాదరుసుం (ఫైన్) వసూలు చెయ్యాలని అధికారులు బీబీఎంపీ మార్షల్స్ కు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే బీబీఎంపీ మార్షల్స్ చేష్టలతో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇన్ని రోజులు వారు కొంత వెనక్కి తగ్గారు. అయితే మంగళవారం రాత్రికి రాత్రి ఒక్కసారిగా ఈ కొత్త రూల్స్ అమలు చెయ్యడంతో మరోసారి ప్రజలు బీబీఎంపీ అధికారులకు చివాట్లు పెడుతున్నారు.

 ఫైన్ వసూలుకు టార్గెట్

ఫైన్ వసూలుకు టార్గెట్

బెంగళూరు సౌత్ బీబీఎంపీ అధికారులు మరోసారి వివాదానికి కేంద్ర బింధువు అయ్యారు. బెంగళూరు సౌత్ లో పని చేస్తున్న బీబీఎంపీ మార్షల్స్ అధిక మొత్తంలో ఫైన్ వసూలు చెయ్యడంలో విఫలం అవుతున్నారని అధికారులు మండిపడ్డారు. బెంగళూరు సౌత్ లోని బీబీఎంపీ మార్షల్ ఒక్కొక్కరు ప్రతిరోజు 20 మంది దగ్గర ఫైన్ వసూలు చెయ్యాలని, లేదంటే కచ్చితంగా వారికి నోటీసులు ఇవ్వకుండానే కఠిన చర్చలు తీసుకుంటామని బీబీఎంపీ అధికారులు అధికారికంగా ఉత్తర్వులు (సర్కులర్) జారీ చేశారు. బీబీఎంపీ అధికారుల తీరుతో ప్రజలు వారికి శాపనార్తాలు పెడుతున్నారు.

English summary
Coronavirus: It is now mandatory for drivers in Bengaluru to wear masks even if they are alone in the car. The Bruhat Bengaluru Mahanagara Palike (BBMP) on Tuesday night issued ‘clarification’ on the rules in place to curb the spread of COVID-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X