• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా వేళ షాకింగ్: రాత్రికి రాత్రే... మృతదేహాలను నదిలో విసిరేస్తున్న అంబులెన్సు డ్రైవర్లు...

|

కరోనా సెకండ్ వేవ్ సంక్షోభం దేశాన్ని అత్యంత దారుణ పరిస్థితుల్లోకి నెడుతోంది. వందలాది కరోనా పేషెంట్ల మృతదేహాలు అంత్యక్రియలకు కూడా నోచుకోవట్లేదు. అంతిమ సంస్కారాల ఖర్చు భారమైపోవడంతో అయినవాళ్లే కోవిడ్ పేషెంట్ల మృతదేహాలను నదుల్లోకి విసిరేస్తున్నారన్న కథనాలు వస్తున్నాయి. ఉత్తరాదిలోని బిహార్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. గంగా నదిలో కొట్టుకొస్తున్న మృతదేహాలు నది తీర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఓవైపు దీనిపై విచారణ జరుగుతుండగా... మరోవైపు నదిలో కొట్టుకొస్తున్న శవాల సంఖ్య పెరుగుతూనే ఉంది.

కరోనా ప్రళయం ఏ రేంజ్‌లో ఉందంటే... ఇంతకుమించిన సాక్ష్యం ఉండదు.. నదిలో కొట్టుకొచ్చిన 45 మృతదేహాలుకరోనా ప్రళయం ఏ రేంజ్‌లో ఉందంటే... ఇంతకుమించిన సాక్ష్యం ఉండదు.. నదిలో కొట్టుకొచ్చిన 45 మృతదేహాలు

యూపీ వాళ్లే విసిరేస్తున్నారని...

యూపీ వాళ్లే విసిరేస్తున్నారని...


బిహార్‌లోని బక్సర్ జిల్లాలో గంగా నది తీరాన ఉన్న చౌసా పట్టణంలో సోమవారం(మే 10) కోవిడ్ పేషెంట్ల మృతదేహాలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. గంగా నదిలో దాదాపు 45 కుళ్లిపోయిన మృతదేహాలు అక్కడికి కొట్టుకొచ్చాయి. తాజాగా ఆ సంఖ్య 71కి చేరిందని అక్కడి అధికారులు వెల్లడించారు. చౌసాకి సమీపంలోనే ఉత్తరప్రదేశ్ సరిహద్దు గ్రామాలు,పట్టణాలు ఉండటంతో... అక్కడివాళ్లే ఇలా శవాలను నదిలో పడేస్తున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. దీనికి బలం చేకూర్చేలా కొన్ని వీడియోలు కూడా వెలుగుచూశాయి.

రాత్రికి రాత్రే... నదిలో విసిరేస్తున్నారు...

రాత్రికి రాత్రే... నదిలో విసిరేస్తున్నారు...


యూపీ-బిహార్ సరిహద్దులోని జైప్రభ సేతు అనే బ్రిడ్జి వద్ద.. రాత్రికి రాత్రే అంబులెన్సుల్లో మృతదేహాలను తీసుకొచ్చి నదిలో విసిరేసి వెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వెలుగుచూడటంతో చాలామంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బిహార్ బీజేపీ ఎంపీ జనార్దన్ సింగ్ సిగ్రివాల్ మాట్లాడుతూ... బ్రిడ్జి పైనుంచి నదిలో మృతదేహాలను విసిరేస్తున్న ప్రచారం నిజమేనన్నారు. అంబులెన్స్ డ్రైవర్లు అలా చేయకుండా స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని తాను కోరుతున్నట్లు చెప్పారు.

యూపీ-బిహార్ మధ్య బ్లేమ్ గేమ్...

యూపీ-బిహార్ మధ్య బ్లేమ్ గేమ్...


ఈ వ్యవహారం యూపీ-బిహార్ మధ్య బ్లేమ్‌ గేమ్‌గా మారింది. మీరంటే మీరే ఇలా చేస్తున్నారని రెండు రాష్ట్రాల అధికారులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. నిజానికి ఇది రెండు రాష్ట్రాల్లో జరుగుతోందని... రెండు రాష్ట్రాలకు చెందిన అంబులెన్సు డ్రైవర్లు గంగా నదిలోకి మృతదేహాలను విసిరేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సోమవారం నదిలో కొట్టుకొచ్చిన మృతదేహాలను బయటకు తీసి వాటికి పోస్టుమార్టమ్ నిర్వహించినట్లు బిహార్ అధికారులు తెలిపారు. అవి కోవిడ్ రోగుల మృతదేహాలే అన్న ప్రచారం ఉన్నప్పటికీ.. మరణాలకు కచ్చితమైన కారణాలేవీ ఇంకా తెలియలేదన్నారు.

  Twitter Donated 15M $ To India | Covid 19 | Jack Dorsey || Oneindia Telugu
  ఆ ప్రచారంలో నిజం లేదన్న అధికారులు

  ఆ ప్రచారంలో నిజం లేదన్న అధికారులు

  కోవిడ్ పేషెంట్ల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎక్కువ ఖర్చు అవుతుండటంతో కుటుంబ సభ్యులు,బంధువులే శవాలను నదిలోకి విసిరేస్తున్నారన్న ప్రచారాన్ని బిహార్ అధికారులు కొట్టిపారేశారు. దహనవాటికల్లో చితిపై పేర్చేందుకు కట్టెల కొరత నెలకొందని... దాంతో మృతుల బంధువుల నుంచి అక్కడి సిబ్బంది భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని సాగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. నదుల్లో మృతదేహాలను విసిరేయకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని... తాము కూడా అవసరమైన చర్యలు,తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు.

  English summary
  Visuals viral in the social media showing bodies being thrown into the river Ganges over a bridge near the Bihar – Uttar Pradesh border from ambulances have shocked the people and scare among the residents in the downstream.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X