వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో కరోనా కల్లోలం - 24 గంటల్లో 3.47 లక్షల కేసులు : ఒమిక్రాన్ సైతం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

భారత్ లో కరోనా కేసులు కల్లోలం కొనసాగుతోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,47,254 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,692 కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందు రోజు కంటే 4.36 శాతం అధికంగా కేసుల సంఖ్య రిజిస్టర్ అయింది. అయితే, గడిచిన 249 రోజుల కాలంలో ఇదే అత్యధికంగా కేసులు నమోదు కావటమని ఆరోగ్య శాఖ చెప్పుకొచ్చింది. కాగా.. దేశంలో ప్రస్తుతం మొత్తం 20,18,825 యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా నిర్దారించారు.

పెరుగుతున్న పాజిటివిటీ రేటు

పెరుగుతున్న పాజిటివిటీ రేటు

గడిచిన 24 గంటల్లో రికవరీ అయిన వారి సంఖ్య 2,51,777 గా ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజు వారీ పాజిటివిటీ రేటు 17.94 శాతం ఉండగా.. వారం పాజిటివిటీ రేటు 16.56 శాతంగా నమోదైంది. ఇక, కర్ణాటకలో మహమ్మారి పంజా విసురుతోంది. గురువారం ఒక్కరోజే 47,754 మందికి సోకింది వైరస్​. ఈ ధాటికి మరో 29 మంది మరణించారు. 22,143 మంది కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 18.48శాతంగా నమోదైంది.

రాష్ట్రంలో క్రియాశీల కేసులు 2,93,231కి చేరాయి. కేరళలో గరిష్ఠ స్థాయికి కొత్త కేసులుకేరళలో వైరస్​ విలయం కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే.. 46,387 కేసులు, 341 మరణాలు నమోదయ్యాయి. మరణాల్లో కొత్తవి 32 కాగా.. 309 కొత్త మార్గదర్శకాల ప్రకారం నమోదు చేసినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం మరో 62 ఒమిక్రాన్​ కేసులు వెలుగు చూసినట్లు తెలిపింది.

ఓమిక్రాన్ కేసులు సైతం

ఓమిక్రాన్ కేసులు సైతం

ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఏపీలో గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రలో 47,420 శాంపిల్స్ ప‌రీక్షించ‌గా.. 12,615 మందికి పాజిటివ్‌గా తేలింది.. మ‌రో ఐదుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. విశాఖ‌ప‌ట్నంలో ముగ్గురు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్క‌రి చొప్పున క‌న్నుమూశారు.. ఇక‌, గ‌త 24 గంట‌ల్లో 3,674 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో నిర్వ‌హించిన టెస్ట్‌ల సంఖ్య 3,20,12,102కు చేర‌గా.. మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 21,40,056కు, రిక‌వ‌రీ కేసులు 20,71,658కి, కోవిడ్ మృతుల సంఖ్య 14,527కు పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ

తెలుగు రాష్ట్రాల్లోనూ

ప్ర‌స్తుతం రాష్ట్రంలో 53,871 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కొత్తగా 4,207 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 7,22,403గా ఉన్నాయి. కాగా కరోనాతో కోలుకున్న వారి సంఖ్య1,825గా ఉంది. ఇప్పటి వరకు కరోనాతో కోలుకుని డిశాచార్జీ అయిన వారి సంఖ్య 6,91,703 గా ఉంది. ఈ రోజు కరోనాతో ఇద్దరూ మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 4,067గా ఉంది. కరోనాతో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 26,633 గా ఉంది. రివరీ రేటు 95.75 శాతంగా ఉంది.

English summary
India reported 3,47,254 new Covid-19 cases in the last 24 hours. The tally of Omicron infections climbed to 9,692.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X