• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాత్రి 8గం తర్వాత ఫుడ్ డెలివరీ బంద్ -స్విగ్గీ, జొమాటో ప్రకటన -కారణం ఇదే..

|

పాపులర్ ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ కీలక ప్రకటన చేశాయి. రాత్రి 8గంటల తర్వాత ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లు తీసుకోబోమని స్పష్టం చేశాయి. కరోనా విలయం నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ విధించిన దరిమిలా తామీ నిర్ణయం తీసుకున్నామని, రాబోయే రోజుల్లో ఢిల్లీ ఇతర నగరాల్లో సర్వీసుపైనా సమాలోచనలు చేస్తున్నట్లు తెలిపాయి.

సీఎం జగన్ బెయిల్ రద్దుకు పిటిషన్ -సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ రాకతో వణుకు -వైసీపీ ఎంపీ రఘురామ సంచలనంసీఎం జగన్ బెయిల్ రద్దుకు పిటిషన్ -సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ రాకతో వణుకు -వైసీపీ ఎంపీ రఘురామ సంచలనం

కరోనా కొత్త కేసులు వెల్లువలా వస్తుండటంతో వైరస్ వ్యాప్తి కట్టడి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు సోమవారం ప్రకటన చేసింది. రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం చెప్పడంతో ఆ మేరకు తాము కూడా సర్వీసుల టైమింగ్స్ మార్చుతున్నామని, రాత్రి 8 తర్వాత ఫుడ్ డెలివరీలు ఉండబోవని స్విగ్గీ, జొమాటో సంస్థలు ప్రకటన చేశాయి.

 covid-19 surge: Zomato, Swiggy to stop delivering food in Mumbai after 8 pm

మహారాష్ట్రలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండడంతో పాటు పగటి సమయంలోనూ ఐదుగురు కంటే ఎక్కువ మంది సమూహాలుగా ఏర్పడరాదని, కార్యాలయాలు కేవలం 50 శాతం సిబ్బందితోనే పనిచేస్తాయని, ప్రైవేటు ఉద్యోగులు మాత్రం ఇంటి నుంచే పనిచేయాలని ప్రభుత్వం సూచించింది. పగటి వేళల్లోనే హోం డెలివరీ సర్వీసులను అనుమతించనున్నారు. బస్సులు, రైళ్లు కూడా 50శాతం సామర్థ్యంతోనే నడవనున్నట్లు ప్రకటించింది. కర్ఫ్యూ అమలు సమయంలో హోటళ్లు, మాల్స్‌, రెస్టారెంట్లు, బార్లను పూర్తిగా మూసివేయనున్నారు.

viral video: తలపతి స్ట్రాంగ్ మెసేజ్ -సైకిల్‌పై వచ్చి ఓటేసిన విజయ్‌ -ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీచార్జ్viral video: తలపతి స్ట్రాంగ్ మెసేజ్ -సైకిల్‌పై వచ్చి ఓటేసిన విజయ్‌ -ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీచార్జ్

ఈ క్రమంలోనే జొమాటో, స్విగ్గీ యాప్స్ ద్వారా కస్టమర్లకు సమాచారాన్ని చేరవేస్తున్నారు. కొవిడ్ నిబంధనల విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తున్నామని, సంస్థాగతంగానూ డెలివరీ సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్విగ్గీ, జొమాటో బాధ్యులు పేర్కొన్నారు. డెలివరీ సిబ్బందికి ఉచితంగా వ్యాక్సిన్లు అందించాలని స్విగ్గీ ఇదివరకే నిర్ణయించింది. ఇదిలా ఉంటే,

ఆర్థిక రాజధాని ముంబై కొలువైన మహారాష్ట్రతోపాటే దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా మహమ్మారి మరోసారి కమ్మేస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో వైరస్ కట్టడికి కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ అంతటా రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఆప్ సర్కారు ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. నేటి రాత్రి నుంచే (ఏప్రిల్ 6) అమల్లోకి రానుండగా.. ఈ నెల 30 వరకు కర్ఫ్యూ ఉంటాయని వివరించింది. కాగా, ఢిల్లీలో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీలపై స్విగ్గీ, జొమాటో ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది.

English summary
In view of a surge in COVID cases, food-hailing giants Swiggy and Zomato have announced that they will stop delivering food after 8pm in Maharashtra. Users in Maharashtra have received in-app notifications from Swiggy and Zomato, asking them to order food before 8 pm. The notifications were sent out to users on the first day of the lockdown in Maharashtra on April 5.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X